సబ్ ఫీచర్

జేఎన్‌యూ అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం ఇంకా మొదలైందో లేదో, జెఎన్‌యులో చెలరేగిన హింసా వాతావరణం, దౌర్జన్యం, క్రోధం దేశహితైక ప్రయోజనాల పట్ల పూర్తి వ్యతిరేకత, చలపాదతనం, తామస దేశాన్నంతా నివ్వెరపరచాయి.
జేఎన్‌యూలో విద్యార్థుల సంఖ్య 8,800. వీరిలో 10 శాతం వామపక్ష క్రోధాభిభూతులని అంచనా. అంటే 90 శాతం విద్యార్థుల భవిష్యత్తును (వీరిలో విద్యార్థినుల సంఖ్య కూడా కలిసే ఉంది) హింసా, దౌర్జన్యాలతో శాసించటానికి ఈ వామపక్షీయుల కుహనా లేదా కూట విద్యార్థి సంఘాల నాయకులకు, వారి అనుచరగణానికి ఎటువంటి దయా, దాక్షిణ్యం, సానుభూతి, మానవత్వం ఈ మూక హింసాపరులకు లేకపోవటం విచారకరం. వేయి ఎకరాల సువిస్తీర్ణమైన ప్రదేశంలో, పచ్చని వాతావరణంలో, విశ్వవిద్యాలయ బోధన భవనాలు, వసతి గృహాలు బయటకు ఆకర్షకంగా కనిపిస్తాయి. అదేమి శాపమో ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాల కార్యకలాపాలు, బోధన విభాగంపై, యాజమాన్యంపై ప్రాయికంగా పితూరీతనం, తిరుగుబాటు విరగబాటు మొదటినుంచీ ఒక వర్గం విద్యార్థి సంఘాలు రెచ్చగొడుతూనే వున్నాయి. 1969లో ఈ విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. అంటే ఎంతో ఘనంగా, వేడుకగా స్వర్ణోత్సవం జరుపుకోవలసిన ఈ సందర్భంలో రణక్షేత్రం చేసి పొలికేకలు సృష్టిస్తున్నారు వామపక్షీయ విద్యార్థి సంఘాలు, వారిని సమర్థించే సెక్యుల రిస్టులమని గుండెలు బాదుకునే రాజకీయులు కొందరున్నూ. హింసా, దౌర్జన్యం మీరే మీరే ప్రారంభించారని ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు పరస్పరం విద్యార్థి సంఘాల వర్గీయులు.
జవహర్‌లాల్ నెహ్రూగారిని దివోలోకంలో కూడా శాంతి, సౌమనస్యాలతో ఉండనివ్వటం లేదు. జెఎన్‌యు స్థాపన జరిగిన 6 సంవత్సరాలలోనే మూసివేశారు.
ఈ జనవరి 15వ తేదీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో టి.ఆర్. మహంతి అనేవారు 1983వ సంవత్సరంలో తాను జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి నేతననీ అప్పుడు కూడా విద్యార్థి సంఘాలు కొన్ని విశ్వవిద్యాలయ యాజమాన్యంపై అసమ్మతి తిరుగుబాటులు నిర్వహించాయనీ, అయితే అవి ప్రజాస్వామిక పంథాలో, అత్యంత క్రమశిక్షణాయుతంగా, అహింసాపూర్వక ధ్యేయంగా, సౌమనస్యపూరితంగా జరిగాయనీ, ఆత్మప్రశంస చేసుకుంటూ జేఎన్‌యూ విశ్వవిద్యాలయ విశిష్ట సంస్కృతిని ప్రస్తుతిపూర్వకంగా ప్రతిపాదించారు.
అయితే ఆ మరునాడు ఆ పత్రికలో సంపాదకీయ లేఖలలో శ్రీ మహంతిగారి అసత్య ప్రలాపాలను, ఆత్మస్తుతి అబద్ధాలను ఖండించే లేఖలు సుమారు 60 దాకా వెలువడ్డాయి. ఈ లేఖలలో 1983 నాటి (ఇంకా కొన్ని నెలలలో ఎమర్జన్సీ రాబోతున్నది) ఆనాటి వార్తాపత్రికల నుంచి జేఎన్‌యూ విషబీజ సంస్కృతిని వెల్లడిస్తూ ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో పాఠకులు తమ ధర్మాగ్రహాన్ని ప్రకటించారు. (15 జనవరి 2020 ఇండియన్ ఎక్స్‌ప్రెస్).
ఇందులో కొన్ని లేఖలలో మొదటి నుంచి జాతీయ వ్యతిరేక కార్య కలాపాలలో జేఎన్‌యూ వామపక్ష, కుహనా సెక్యులరిస్టు బృందాలు ఎట్లా ప్రవర్తించిందీ ప్రస్తావితమైనాయి.
2010వ సంవత్సరం మావోయిస్టులు దంతెవాడలో 76మంది సిఆర్‌పిఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీసు బలగం) సైనికులను హతమార్చినప్పుడు, దేశమంతా విషాదాక్రాంతమై పరితపిస్తున్నప్పుడు జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో గోదావరి పేరిట ఉన్న ధాబా (్ఫలహారశాల)లో వామపక్ష విద్యార్థుల వర్గాలు సంబరాలు జరుపుకున్నారు అని ఒక లేఖ తబ్శీళ్ళు ప్రకటించింది.
ఎమర్జన్సీ రోజులలో దేశమంతా వ్యతిరేకత పెల్లుబికినా జేఎన్‌యూ వామపక్ష విద్యార్థి సంఘం నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండి పోయినారని ఒక లేఖ ప్రస్తావించింది. (ఎందుకట? ఒక తీవ్ర భావజాల వామపక్ష వ్యవస్థ ఎమర్జన్సీని సమర్థించినందువల్లనట!)
నాటి ప్రధాని ఇందిరాగాంధీ 46 రోజులపాటు జేఎన్‌యూను మూసివేసిం దని ఇంకో లేఖ ప్రస్తావించింది. (ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం ఆమెకు కూడా తలనొప్పిగా తయారైంది సుమా! అంటున్నారీ లేఖకుడు).
1983లో చెలరేగిన అల్లర్ల సందర్భంగా ఇండియాటుడే వెల్లడించిన భయంకర వాస్తవాలను ఇంకొక లేఖకుడు వెల్లడి చేశాడు. 700 మంది విద్యార్థులు అరెస్టు అయినట్లు, తీహార్ జైలులో సేదదీరినట్లూ ఇంకొక లేఖ ఇండియాటుడే (1983 మే) వార్తాకదనాన్ని ఉన్నదున్నట్లు ఉట్టంకించాడు. వార్డెన్‌ల వసతి గృహాలపై దుండగీండ్రైన విద్యార్థులు జరిపిన దాడులు (ఇండియాటుడే ఉదాహృతం) ఇంకొక లేఖలో వర్ణితం. వార్డెన్‌ల ఇళ్ళు దాడికిగురై, వస్తువులు దోచుకుని, పుస్తకాలను తగులబెట్టి, గృహ దహనకాండ నిర్వహించారుట ఒక వర్గం విద్యార్థి సంఘం.
ఒక గమనిక : ఈ లేఖలన్నీ 1983 మేలో జరిగిన భీభత్సకాండను ఆనాటి పత్రికల వార్తాకదనం నుంచి సేకరించినవే.
శీతాకాలపు సెమిస్టరును జరగకుండా, విద్యార్థులు రిజస్టరు చేసుకోకుండా బీభత్సం జరపటం ఎందుకు? జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో 80 శాతం విద్యార్థులు విద్వాంసక భృతిని పొందుతున్నట్లు, హాస్టల్ ఫీజులు పెంచిన విషయం సానుభూతితో పర్యావలోకనం చేస్తామని చెప్పినట్లు తమ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో (వౌఖిక గోష్ఠి)లో వైస్ ఛాన్స్‌లర్ వివరించినా వామపక్ష విద్యార్థి సంఘాలు పట్టించుకోలేదు. జనవరి 3న, సి.సి. టివి., కంప్యూటర్లు ధ్వంసం చేసిన వారెవరు? 5న దానికి ప్రతిక్రియ జరిపినవారెవరు? సమగ్ర నివేదిక వెలువడినప్పుడు మాత్రమే నిజానిజాలు కపటాలు వెల్లడవుతాయి.

- అక్కిరాజు రమాపతిరావు