సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వనాశనానికా శక్తి?
భారత సంస్కృతికి జీవకర్ర ధర్మం. అందరికీ అది ఆచరణీయం. సంఘనీతికీ, సంక్షేమానికీ అది వెనె్నముక. రాయిని దేవుడంటున్నారని భారతీయులను కొందరు గేలిచేయవచ్చు. అది వారి అజ్ఞానం. కాని భారతీయులు చేస్తున్నదేమిటి? రాతిలోకూడా దేవుడున్నాడని గ్రహించటమే. రాతిని భగవంతుడుగా మార్చటం ఒక ఘన విజయం.
ఈ దేశంలో శక్తియుక్తులన్నీ మృత్యువును జయించేందుకే వినియోగిస్తుంటారు. కొన్ని దేశాలలో, సర్వనాశనకరమైన ఆయుధాల తయారీకి తమ సర్వశక్తినీ వుపయోగిస్తున్నారు.
సైన్సు సంగతి
ఎక్కడ ప్రారంభమైనదో అక్కడే అంతమయ్యేదానిని పూర్ణమన్నారు. పూర్ణమైనది సర్కిల్‌గా సున్నావలె ఉంటుంది. దానికి ఆది, అంతము ఒక్కటే. ఆది, అంతములకు భేదము లేనటువంటిది ఆధ్యాత్మికము, కాని, సైన్సు ఒకదగ్గర ప్రారంభమై మరొకదగ్గర అంతమవుతుంది. ఇది ఇంగ్లీష్ అక్షరం సి మాదిరి ఉంటుంది. దీని ఆది, అంతముల మధ్య అగమ్య గోచరమైన అగాధం ఉంటుంది.
చూపుదేని మీద
ఇక్కడ షిర్డి సాయిబాబా విగ్రహమున్నది. విగ్రహంలో ఉన్న వెండి బరువును గురించి, పనితనాన్ని గురించీ ఆలోచిస్తే అందులో సాయి కనిపించడు. సాయి మహిమలను లీలలను భావించినపుడు అందులో వెండి మీదికి దృష్టిపోదు. అట్లే ఈ పాత్రలో, ఈ గోడలో ఈ జనంలో అంతటా బ్రహ్మం నిండియుందని గ్రహిస్తే అజ్ఞానం మిమ్ములను ఆవరించదు. అపుడు దేనిమీద రాగం ఉండదు. అదే సాధనకు పరమావధియైన ‘సర్వం బ్రహ్మమయం’ అనేస్థితి.
ఊర్థ్వ గతి
అంధకారమును నిర్మూలనం గావించి, దివ్యత్వమైనటువంటి దృష్టిని ప్రసాదించి ఊర్థ్వ గతిని అందించేటటువంటిదే ఈ జ్యోతి. జ్యోతి గతి ఊర్థ్వ గతే. కాని ఆధోగతి కాదు. ప్రాచీన కాలము నుంచి మనవారు ఈ జ్యోతిని ఆరాధిస్తూ వచ్చారు. ప్రాచీన కాలం నుండి భారతీయులు ఏ మంగళకార్యం చేయవలసి వచ్చినా జ్యోతిని మొదట వెలిగించి ప్రారంభించేవారు. ఇది భారతీయ ప్రాచీన సంప్రదాయం ఇదియే ప్రాచీన భారతీయ సంస్కృతి.
జ్యోతిని నాల్గు పదార్థములలో వైరాగ్యమే ప్రమిద. భక్తియే తైలము,. చిత్తశుద్ధియే పత్తి జ్ఞానమే నిప్పు. ఈ నాల్గింటి ఏకత్వం చేతనే జ్ఞానజ్యోతి వెలుగుతుంది.
పరంజ్యోతి
ఒక దీపాన్ని మనం వెలిగించుకుంటే దానితో ఎన్ని దీపాలయినా వెలిగించుకోవచ్చు. ఉత్త పత్తితో ఏ దీపాన్నీ వెలిగించలేం కదా.
జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి తన జ్ఞానాన్ని ఎంతమందికైనా పంచగలుగుతాడు.అజ్ఞాని పంచేదేమిటి? అంధకారం.
విశ్వమంతటా నిండి ఉన్న ప్రేమజ్యోతి నుండి ముందు నీ హృదయ జ్యోతిని వెలిగించుకో. అప్పుడు నీవు ఎందరి హృదయ జ్యోతులనయినా వెలిగించగలుగుతావు. భగవంతుడు పరంజ్యోతి. మనకు కనిపిస్తున్న ఈ జీవ జ్యోతులన్నీ ఆ పరంజ్యోతి రూపాలే.
జ్యోతిని చూడాలంటే
ప్రకాశముగా వెలుగుతున్న జ్యోతిని చూడవలెనన్న మరొక జ్యోతిని మనం వెతుకనక్కర్లేదు. అటులనే స్వప్రకాశముగా వెలుగుచున్నటువంటి ఆత్మ జ్ఞానమును వెతుకుటకు మరొక జ్ఞానము అక్కర్లేదు.
సత్యం - కీర్తి
అస్థిరం జీవనం లోకే
అస్థిరం వనం ధనం
అస్థిరం దారా పుత్రాది
సత్యం కీర్తిః ద్వయం స్థిరమ్ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తంతయు కేవలం అస్థిరమైనది. యత్ దృశ్యం తన్నశ్యం ఏవి నేడు కనిపించుకనో అవన్నీ కూడా నశించేవే. ఈ జగత్తునందు సత్యం, కీర్తి రెండే స్థిరమైనవి. శాశ్వతమైనవి. మిగతావన్నీ అస్థిరములే.
సృష్టి రహస్యం.. ఈ విశ్వం ఎలా ఆవర్భివించింది? ఈ విషయమై అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించటం జరిగింది. వాటికి ఖండన మండనలూ కోకొల్లలుగా వెలిశాయి కూడా. నిజానికి దీనిపై ఇంటి ఊకదంపుడు అవసరం లేదు. సుషుప్తిలో స్వప్నం వచ్చినపుడేం జరుగుతోంది.? యథార్థం నుంచి వి డి వడి స్వాప్నిక ప్రపంచంలోకి పోతున్నావు. స్వప్నంలో అంతా యథార్థం లాగే తోస్తూ ఉన్నది. తెలివి రాగానే స్వప్నం మాయమై పోతున్నది. నిద్రలాగా మాయ ఆవరించినపుడు స్వప్నం లాగా ఈ సృష్టిఅంతా ఆవిష్కరింపబడుతూ ఉన్నది. మాయ కారణంగానే సత్తునుంచి విడివడి అసత్తు యథార్థంగా గోచరిస్తున్నది. సృష్టికర్త సంకల్ప ఫలితంగా ఆవిర్భవించే ఈ సృష్టి రహస్యాలు అనేకం. అనంతం. అర్థం చేసికో వీలు లేనివి.

ఇంకా ఉంది