సబ్ ఫీచర్

ముప్ఫైల్లోకి అడుగిడుతున్నారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది మహిళలు ముప్ఫై సంవత్సరాలు వచ్చేసరికి డీలా పడిపోతారు. ఎన్నో చేయాలనుకుంటారు కానీ.. ఏమీ చేయలేక బాధపడిపోతుంటారు. అనవరమైన నిస్సత్తువ మనస్సులోకి ప్రవేశిస్తుంది. కారణం లేని బాధ మనస్సును తొలిచేస్తుంది.. అలాంటివారు మనస్సులోని అనుమానాల్ని వదిలేసి ఇకముందు ఎలా ఉండాలో చూసుకోవాలి.
* దూరమైనా, దగ్గరైనా ఒంటరిగా ప్రయాణించడానికి సిద్ధమవ్వాలి. ఈ ఒంటరి ప్రయాణం వల్ల మీరేంటో మీకు తెలుస్తుంది. మీకు మీరు ఎందుకు నచ్చలేదో మిమ్మల్ని మీరు కోపంగా కాకుండా, ప్రశాంతంగా ప్రశ్నించుకోండి. ఇలా ఒంటరిగా ప్రయాణించడం వల్ల మొదట్లో ఇబ్బంది అనిపించినప్పటికీ ఆ తర్వాత అందులో ఉండే ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఆ సంతోషాన్ని ఆస్వాదించాలి.
* కొత్త అభిరుచులను ఏర్పరచుకోవాలి. దీంతో కొత్త స్నేహాలు పెరుగుతాయి. సరికొత్త విషయాలు తెలుస్తాయి. ఇంతకు మునుపు కంటే ఎక్కువ ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు.
* ఎప్పటినుంచో నాట్యమో.., చిత్రలేఖనమో.., లేదా మీకు నచ్చిన హాబీ ఏదో నేర్చుకోవాలనుకుంటారు. కానీ అప్పుడు చేయలేక పోతారు. ఇంకెందుకాలస్యం.. ఇప్పుడు వాటిలో శిక్షణ ఇచ్చే సంస్థలు మీకు దగ్గరలో ఉన్నాయేమో కనుక్కుని అందులో చేరిపోవాలి.
* చిన్నప్పుడు అంటే.. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఆ కోర్సు తీసుకోవాల్సింది.. అనవసరంగా ఈ కోర్సు తీసుకున్నాను.. అనుకుని బాధపడకండి. ఇప్పటికీ మీకు ఇష్టమైన కోర్సు ఏదైనా ఉంటే అందులో చేరిపోండి. ఇష్టమైన పుస్తకాలు చదవండి. అప్పుడు మనస్సు కూడా చురుగ్గా ఉంటుంది.
* జీవితంలో పైకి ఎదగడానికి తప్పనిసరిగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో అయిదు, పది సంవత్సరాల్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ లక్ష్యాలేమిటి? ఇలా ప్రణాళికను విభజించుకోండి. అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
* వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. 30ల తర్వాత బరువు తగ్గాలంటే కష్టం. అందుకే మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఇలా మనసుకు నచ్చిన పనులు చేస్తూ, మనస్సును చురుగ్గా ఉంచుకుంటే హుషారుగా ఉంటారు. *