సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలర్కుడు
ఋతుధ్వజుని భార్య మదాలస. మహా సాధ్వీమణి త్యాగ, జ్ఞాన, వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకరులేరు. ఈమెకు దివ్యత్వము అనేది పుట్టిన ఇల్లు. పెట్టిన పేరు. వీరిరువురికి మొదట ఒక పుత్రుడు పుట్టాడు. పుట్టిన బిడ్డకే ఏమీ లేనప్పుడు పెట్టిన పేరుకు ఏముంటుందిః కానీ ఈ ఋతధ్వజుడు పేరు పెట్టడం కోసం చాలా తాపద్రయపడ్డాడు. కట్టకడపటికి విక్రాంతుడు అని పేరు పెట్టాడు. మదాలస ఫక్కున నవ్వింది. పేరు కోసం ఈ మహారాజు ఇంత ప్రాకులాడుతున్నాడు ఏమిటి అని లోపల అనుకుంది మదాలస. ప్రాకృతమైన శరీరమునకు ఒక భౌతికమైన పేరుకావాలి. గానీ ఈ మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహమునకు పేరుకోసం అంతగా ప్రాకులాడటం వ్యర్థమని భావించింది. కొంతకాలానికి రెండవ కుమారుడు పుట్టాడు. సుబాహుడు అని పేరు పెట్టాడు. అనగా మంచి హస్తములు కలవాడు అని అర్థం. అప్పుడు కూడా మదాలస ఫక్కున నవ్వింది. రాజు అవమానంగా భావించాడు. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రం విలువ లేనట్టుగా మదాలస హాస్యం చేస్తున్నదని భావించాడు రాజు.
మరికొంతకాలానికి మూడవ పుత్రుడు పుట్టాడు. అప్పుడు ఆ రాజు ‘మదాలసా! నేను పెడుతున్న పేర్లు నీకు అంత ఇష్టముగా ఉన్నట్లు లేదు. ఈ తడవ ఈ పిల్లవానికి నీవే పేరుపెట్టు’ అని ఆమెకు వదిలిపెట్టాడు.
అప్పుడు ఆ పిల్లవానికి ‘అల్కరుడు’ అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది. మేము క్షత్రియులం. రాజపుత్రులం. ధీరులం. నా కుమారునికి ‘అల్కరుడు’ అని పేరు పెట్టడం అవమానకరమన్నాడు. అల్కరుడు అనగా పిచ్చికుక్క . అప్పుడు మదాలస ‘మహారాజా! తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటివాడు. తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటివాడు. ఏకత్వాన్ని భావించలేనటువంటివాడు. ‘కుక్క’ కంటే హీనమే అన్నది ఆమె.
కనుక తన స్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవుల కు పేర్ల వల్ల ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనటువంటి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది మానవ దేహము. కానీ వీరు మానవులు కారు. ఆత్మ స్వరూపులే. ధర్మస్వరూపులే. నిర్గుణ నిరాకార తత్త్వములే. నిర్మల స్వరూపులే. నిష్కళంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడం ఎంత అజ్ఞానం.
స్వప్నం
అసలు స్వప్నం అంటే ఏమిటి? కలలో కల ఈ జీవితమే ఒక స్వప్నం ఇందులో మళ్లీ ఇంకొక స్వప్నం. కల మేలుకొనగానే చెదిరిపోతోంది. కానీ జీవితం అనే కల మేలుకొనగానే మొదలవుతుంది. ఇందులో కాసేపు సంతోషం , కాసేపు దుఃఖం ఉంటుంటాయి. ఏదో నమ్మకం, ఏదో ఆశ కనిపిస్తుంటుంది. ఏదో అర్థాన్ని వెతుక్కుంటుటావు.
కానీ జీవితం అంటే అసలు అర్థం ఏమిటో నీవు తెలుసుకోవాలి. అసలు అర్థాన్ని తెలుసుకోలేక పోతే అంతా ఉత్తదే. జననం నుంచి మరణానికి నుంచి జననానికి ఒకటే పరుగు. దారి పొడుగునా ఎదురుదెబ్బలు. ఈ అనుభవమే చివరకు మిగిలేది.
కోహం
కోహం ( నేనెవరను) మీలో ప్రతి వ్యక్తీ ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇవ్వాళ కాపోతే రేపన్నా దీనికి జవాబు తెలుసుకోవాలి. ఇంద్రియాలు వొక్కొక్క రంగంలో తమ శక్తి చూపుతూ ఉన్నాయి. కానం వాటికి ఈ ప్రశ్నకు జవాబిచ్చే శక్తిలేదు. తమ తమ రంగాలలో కూడా వాటి శక్తి పరిమితమే. చెవులు గ్రహించలేని సూక్ష్మధ్వనులెన్నో ఉన్నాయి. బాహ్య ప్రపంచాన్ని పరిశీలన చేయటానికి కూడా ఇంద్రియాలు పూర్తిగా ఉపకరించవు. నిరామయం, నిరాకారం అయిన ఆత్మను గురించి ఇక ఇంద్రియాలు ఏమి అధ్యయనం జేయగలుగుతాయి?
సత్యం నాస్తి పరో ధర్మః
విమర్శించడం చాలా సులభం. తెలుసుకోవడం చాలా కష్టం. దేవుడున్నాడా? లేడా అనే వాదోపవాదాలలో కాలమును వ్యర్థం చేయటం కంటే సత్యమే దేవుడు, ధర్మమే దేవుడు, అహింసయే దేవుడు. ఈ మూడింటిని అనుసరించే ఆరాధించే నిజమైనటువంటి మార్గంలో నడుపు. సత్యం నాస్తి పరో ధర్మః సత్యమునకు మించిన మరొక ధర్మం లేదు కనుక సత్యమే దైవము.
సత్యమును మొట్టమొదట సాధించటానికి పూనుకోవాలి. మనం పలికే ప్రతి పలుకు హృదయమునుండి రావాలి. ఈపలుకులు ప్రేమమయమై ఉండాలి. ప్రియమైనటువంటి, ప్రేమమయమైనటువంటి పలుకులన్నీ సత్యములే. ప్రేమలేనప్పుడే అసత్యం ప్రారంభమవుతుంది.
ఇంకా ఉంది