సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో మంచిని నింపు
బాగా వెలుతురుండి, పరిశుభ్రంగా వుండే గదిలోకి తేళ్లు, పాములు రావటం అరుదు. చీకటిగా, అపరిశుభ్రంగా వుండే గదిలోకే అలాంటి విషప్పురుగులు చేరుతాయి. అంధకారంతో నిండి, అపవిత్రమైన ఆలోచనలతో వుండే మనస్సులోకి కామ, క్రోధాదులనే విషకీటకాలు చేరతాయి.
మంచి ఆలోచనలను పెంపొందించుకో. నీ మనస్సును ఆత్మజ్ఞానంతో ప్రకాశవంతం చేసికో.
అగ్నిలో వేయి!
బొగ్గును సబ్బుతో రుద్దితే తెల్లబడుతుందా? లేదు. పాలతో కడుగు, తెల్లబడుతుందా? లేదా. అగ్నిలో వేయి. తెల్లని బూడిదగా మారుతుంది. అజ్ఞానం అంతరించాలంటే అవిద్యను హతమార్చాలి. అందుకు ఆత్మజ్ఞానం కలగాలి.
స్వవిమర్శో మోక్షః
‘స్వవిమర్శో మోక్షః’, తననుతాను విచారించుకొనుటే మోక్షమని పెద్దలు చెబుతారు. పరమాత్మయే పత్తి. ‘నేను’అను దారం పడుగూ, పేకగా అల్లుకొని, ‘ఆత్మ’అను వస్త్రంగా మారుతున్నది. ‘నేను’గాని, ‘ఆత్మ’గాని పరమాత్మ అను పత్తి లేక రావు. పేరుకు మూడు విధాలుగా వున్నా ఇవి మూడు ఒకటే.
నీరు ఆవిరిగా వుంటున్నది. మంచుగా మారుతున్నది. మేఘంగా విహరిస్తున్నది. వర్షంగా కురుస్తున్నది. నదియై పారుతున్నది. సముద్రంలో కలిసిపోతున్నది. ఏదయినా నీరే. పరమాత్మకూడా అనేక రూపాలతో, నామాలతో తోచినా, చివరకు ఒక్కటే!
ప్రవృత్తి యోగం
కామం, కాలం...
కామం తీరి జననం: కాలం తీరి మరణం!
కామదేవుడు మన్మథుడు. అతడిని శివుడు దహించాడు. మృత్యుదేవత యముడు. భక్తమార్కండేయుని పట్టబోయి శివుని చేతిలో భంగపడ్డాడు. మనిషి కోరికనుండీ, మృత్యువునుండీ తప్పించుకోవాలంటే మహదేవుని శరణు పొందాలి. ఆ దేవుని ఆశ్రయిస్తే, కామం, కాలం నినే్నమీ చేయలేవు.
ప్రేమ మార్గం
దేవుని కరుణ ఎలా లభిస్తుంది? తర్కంలో పిల్లిమొక్కలువేస్తేనా? యోగమంటూ హఠం పడితేనా? ఉపవాస క్లేశాల మూలంగానా? వీటి వేటి వల్లా ప్రయోజనం లేదు.
అందుకు ప్రేమేమార్గం. మూల్యం కోరని ప్రేమ; బేరసారాలెరుగని ప్రేమ; ప్రేమ స్వరూపికి సంతోషంగా సమర్పించే కానుకయిన ప్రేమ; ఎంతటి ఆటంకాలనయినా అధిగమించే ప్రేమ-అలాంటి ప్రేమే ఆయనకు నీరాజనం.
శౌచం కన్న బలం లేదు. ప్రేమ కన్న వరం లేదు. భక్తికన్న ఆనందం లేదు. శరణాగతి కన్న జయం లేదు.
అవ్వాబువ్వా
పరమాత్మా కావాలి. ప్రాపంచిక సుఖములూ కావాలి అంటారు. అదెలా కుదురుతుంది?
అవ్వా, బువ్వా రెండూ కావాలంటే ఒక పనిచేయి. ఐహిక కార్యములలో కూడా అముష్మిక స్థితినే కలిగియుంటూ శరణాగతి పొందు. అయితే, ఒక్క సంగతి. పరమాత్మను చేరుటకు ఈ ప్రపంచమునే వినియోగించుకో. కాని, ప్రపంచము నీలో ఉండకూడదు. నదిని దాటాలంటే, పడవ నదిలో ఉండాలి కాని, పడవలో నది (నీరు) ఉంటే ప్రమాదం కదా!
ముక్తిసౌధం
ముక్తిసౌధానికి నాలుగు అంతస్థులున్నాయి. ధ్యానం, కర్మ, భక్తి, జ్ఞానం. ఇవి వొకదానిపైన వొకటున్నాయి. వీటిని ఒకదాని తరువాత ఒకటి ఎక్కుతూ వెళ్లాలే కాని పై అంతస్థులే సరాసరి ఎక్కేయాలంటే కుదరదు.
ముక్తిసౌథంలోకి వెళ్లాలంటే శరణాగతి అనే ముఖద్వారంనుండే వెళ్లాలి.
కొంతమంది ముక్తి సాధించటానికి భక్తియోగం మంచిదా, కర్మయోగం మంచిదా, జ్ఞానయోగం మంచిదా అని వాదించుకుంటూ వుంటారు. అప్పుడు నీవీవిషయాన్ని గుర్తుపెట్టుకో.
పక్కకు లాగే పిశాచం
ధ్యానం ఏకాగ్ర చిత్తంతో చేయాలి. కాని ఏదో వొక విచారం. తొందరగా వచ్చి ధ్యానానికి భంగం కలిగిస్తుంటాయి. పిల్లల సంగతి కానీండి, సంపాదన గురించి కానీండి. ఆస్తిపాస్తుల గురించి కానీండి, సుస్తీల గురించి కానీండి- ఏదోవొక చింత మనిషి మనస్సును పిశాచంలా పక్కకు లాగుతూనే వుంటుంది. అన్ని రూపాలూ ఆ మాయవల్ల కలిగేవే. పరబ్రహ్మానికి ఈ లీల సహజమే. నీవు ఏ పరమాత్మను శరణు పొందావో ఆయన నీకు అభయం యివ్వడా? అసలు నీవే పరమాత్మవు. పరమాత్మ స్వరూపానివికాక నీవు మరెవరివి?

ఇంకా ఉంది