సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహమే దేవాలయం
భగవంతుడు మన రక్షకుడు. ఆయనే శిక్షకుడు. ఆయనే పోషకుడు. ఆయనే మనకు దిక్కు. సజీవ వ్యక్తితో వలెనే ఆయనతో మెలగటం నేర్చుకో. ఆయనను పిలవటం అలవాటుచేసికో.
గుడి ఎందుకు? గుండెలను కరగించటానికే. దయాదాక్షిణ్యం. దానం, ధర్మం వంటి సద్గుణాలను నీలో రగిలించటానికే.
భగవచ్చింతన లేనిచోట క్రౌర్యం వీరంగంవేస్తుంది. భక్తిలేనిచోట లోభం తిష్ఠవేస్తుంది.
‘దేహో దేవాలయ ప్రోక్తః
జీవో దేవస్సనాతనః’
అన్నట్లు ఈ దేహమే దేవాలయం. దేవుడే సనాతనుడైన దేవుడు. మీరు ఎవరు? నడిచే గుళ్లు! మీలోనే వున్నారు దేవుళ్లు. ఆయనను గ్రహించు. ఆయన నీకు రక్షణ కల్పిస్తాడు. కావలసినవి అనుగ్రహిస్తాడు. చెడుకు తలొగ్గకుండా కాపాడుతాడు.
దివ్యసుధ
దివ్యతత్త్వం తిన్ను మైమరిపించే సుధ. భగవన్నామం వల్ల క్రమంగా చిక్కనైన అమృతం అది. ఒకసారి దారి రుచి చూడు. అన్నీ మరచిపోతావు. నీవే మారిపోతావు.
నరుడు తోకలేని వానరుడు. కోతి కళలనె్నన్నిటినో వదిలేస్తే కానీ నరుడనిపించుకోడు. మనోవాక్కాయ కర్మలచే తనను తాను భగవదర్పితం చేసుకోవాలి. భగవానునికి శరణాగతుడు కావాలి. అప్పుడే ఈ జంతువు మనిషనిపించుకొంటుంది. దివ్యత్వానికి నిలయవౌతుంది.
కోతి చేష్ట
మీ మనసులు కోతులలాగా ఉన్నాయి. కాసేపు కూడా అవి స్థిమితంగా ఉండలేవు. ఈ కొమ్మమీద నుంచి ఆ కొమ్మపైకి, ఆ కొమ్మ మీదినుండి ఈ కొమ్మపైకి దూకుతుంటాయి. వాటిని నాకప్పగించండి. నేను వాటి చాపల్యం పోగొడుతాను. ‘కూచో’ అంటే కూచుంటాయి. ‘లే’ అంటే లేస్తాయి. అలా చేస్తాను.
ఈ సంగతే శంకరాచార్యులు శివునితో ఇలా చెప్పారు. ‘నా మనసు మర్కటంలాగా చంచలం. దానిని నీకప్పగిస్తాను. అప్పగించిన పని చేసేలా నీవే తరిఫీదు చేసికో’ అన్నాడాయన. అప్పగించడమంటే ఏమిటి సంపూర్ణంగా అప్పగించాలి. అదే సర్వస్య శరణాగతి.
ఖజజ
పాండవులంతా కూర్చొని ఒక విచారణ చేస్తున్నారు. రేపటి దినము యుద్ధం ప్రారంభం అవుతుంది. ఎవరెవరు ఏ బాధ్యతలు వహించాలి. ఎవరెవరు ఏయే దిక్కుకు బయలుదేరాలి. అనే సంగతులు చర్చించి ప్లాన్ వేసుకుంటున్నారు. వీరు ప్లాన్ వేసుకుంటున్నప్పుడు దుర్యోధనుడు వచ్చాడు. ఎందుకు? గురువుగారయిన ద్రోణాచార్యుడు పాండవులకు తెలియని ఒక పదాన్ని దుర్యోధనునికి చెప్పి పంపించాడు. ఈనాడు వీళ్లు ఆ పదం యొక్క అర్థం కనుక్కోలేక ఓడిపోతారు. వాళ్లకు అవమానం అయిపోతుంది అనుకున్నాడు. రారాజు పరుగెత్తి వచ్చాడు. పాండవులు ఉన్న చోటుకి వచ్చి ఖజజ నాతోడ పోరాడదగునే నీకు అన్నాడు. నీకు నాతో పోరాడ వీలవుతుందా. అంటే అర్థమయేది. కానీ పాండవులకు ‘ఖజజ’ అంటే ఎవరో తెలియదు. ఖజజ అంటే తామే అనుకొని ఎవరో ఒకరు పొరపాటున అర్జునుడు గానీ, లేక ధర్మరాజు గానీ లేస్తే అవమానమైపోతుంది. ఈ పదానికి అర్థం తెలియని మూర్ఖులుగా ఉన్నారేమోనని భావిస్తాడేమో. ఈ సంగతిని అర్థం చేసుకున్న కృష్ణుడు భీముని వైపు తిరిగి సంజ్ఞ చేశాడు. ‘లే’ అన్నట్లు. అపుడు భీముడు లేచాడు. దుర్యోధనునికి దీని అర్థం తెలియదు. తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఐదుమంది పాండవులు కృష్ణుని అడిగారు. ‘స్వామీ! ఏమిటిది? ఎపుడు కూడానూ మా తల్లి పెట్టిన పేరు కాదే ఇది! ఎవరు పెట్టిన పేరు ఇది? ఖజజ అంటే భీముడెలా అయ్యాడు? ఏమిటి? ’అని అడిగాడు. అపుడు ‘ఖ’ అంటే ఆకాశము, జ దానితో పుట్టినది. వాయువు. జ తిరిగి వాయువులో పుట్టినది వాయుపుత్రుడు. కనుక ఖజజ అనగా భీముడే అన్నారు కృష్ణుడు. ఈ విధంగా సర్వమూ దైవమునకే తెలుస్తుంది. కానీ అందరికీ తెలిసేది కాదు.ఈవిధంగా సర్వరక్షకుడైన శ్రీకృష్ణుడు పాండవులను రక్షించుతూ వచ్చుచుండుట చేతనే పాండవులు దిగ్విజయాన్ని సాధిస్తూ వచ్చారు. పాండవులు కూడానూ కృష్ణుని శరణుజొచ్చారు. అదేవిధంగా దైవాన్ని మనం శరణుజొచ్చినపుడు ఏమాత్రమూ ఎందులో కూడాను అపజయమనేది ఉండదు. అన్నింటి యందునూ జయమునే పొందుతాం.
తారాబలం
శ్రీకృష్ణుని జన్మనక్షత్రం రోహిణి. ఆ తారాబలం యోగంలో ప్రవేశానికి, ప్రావీణ్యానికీ సంబంధించింది. శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పునర్వసు. శరణాగతులైన వారిని కరుణించి రక్షించే స్వభావం రామునిది. ఆయన జన్మనక్షత్ర ప్రభావం అందులో కనిపిస్తుంది.

ఇంకా ఉంది