సబ్ ఫీచర్

సంస్కృతంతో సంస్కృతీ పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. సంస్కృతికి ఆధారభూతమైన భాష సంస్కృత భాష. భారతస్య ప్రతిష్ఠేదే సంస్కృతం సంస్కృతిస్త్ధా’’ భారతదేశానికి గౌరవాన్ని సంపాదించి పెట్టే భాష సంస్కృత భాష. ఇది దేవ భాష అని పెద్దల వాక్కు. ఈ భాష విజ్ఞాన ఖని. అనేక వైజ్ఞానిక విషయాలు ఈ భాషలో ఉన్నాయి. అనేక భాషలకు జనని ఈ భాష. అందువలననే భారతీయులందరికీ తమ మాతృభాషలో పాండిత్యం పెంపొందటానికి ఈ భాష ఉపకరిస్తుంది. భారతీయులందరి రక్తంలోను సంస్కృత భాష ఉంది. అందువలన ఇది సంస్కారాన్ని కలిగిస్తుంది.
సంస్కృతం చాలా శ్రేష్ఠమైన భాష. మధురమైన భాష అని సంస్కృతపు ఔన్నత్యాన్ని వర్ణించటంకంటే సంస్కృతం నేర్చుకోవటమే మన ధర్మం. సంస్కృతం మన సంస్కృతికి పునాది రాయి వంటిది. వృద్ధితో సంస్కృతి బలపడి, మన చింతనం మరియు జీవన మూల్యాలలో విశేషమైన ప్రగతి చేకూరుతుంది.
అన్ని భారతీయ భాషలలోను 50-60 శాతం సంస్కృత శబ్దాలు ఉన్నాయి. అవి భాషల ధ్వని వ్యవస్థ సంస్కృతానివే. ఒకప్పుడు సంస్కృత భాష సామాన్య ప్రజల వ్యవహారిక భాషగా ఉండేది. నిత్య వ్యవహారాలన్నీ సంస్కృతంలోనే పూర్వులు నిర్వహించుకొనేవారు. క్రమేణా అనేక కారణాలవలన సంస్కృత భాష కొంతమందిలో పరిమితమయినది.
సంస్కృతం కఠినమైనదిగా చెబుతుంటారు. కానీ అది తప్పుడు ప్రచారం. ఏ భాషా సరళంగా కాని, కఠినంగా కాని ఉండదు. కాని అదే భాషని ఇష్టపడి నేర్చుకుంటే సరళంగా ఉంటుంది. సంస్కృత భాషకి కుల, మత, వర్గ, వర్ణాలకతీతమైనది. విదేశీయులెందరో సంస్కృత భాషను నేర్చుకొని, మన సంస్కృతి, ఇతిహాసాలను అనువదించుకున్నారు. వారందరు సంస్కృతంలో పండితులైనారు. ఆంగ్ల విద్యావిధానం మోజులో సంస్కృతానిదేకాక మాతృభాషకు హాని కలుగుచున్నది.
సంస్కృతాన్ని అందరి భాషగా సరళీకరించవలసిన ఆవశ్యకత నేడుంది. సరళ సంస్కృతం నేర్చుకుని మాట్లడటం, వ్రాయడం సుసాధ్యమే. సంస్కృతం నేర్చుకొనడం ద్వారా మనలో నైతిక నిబద్ధత, దేశభక్తి, సంస్కారాలు వాటంతట అవే అలవడుతాయి. మన సంస్కృతి, ధర్మం పట్ల విశేషమైన భక్తి పెరుగుతుంది. విదేశీ సంస్కృతికి, అనైతిక పనులకు దూరంగా ఉండగలుగుతాము. సంస్కృత పదాలు వాడటంవలన ప్రాంతీయ, వర్గ బేధాలు భాషాబేధాలు సమసిపోతాయి. ఈ భాష నేర్చుకొనడం ద్వారా విద్యార్థులలో శారీరక మానసిక వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయి.
సంస్కృతానికి ఉజ్వల భవిష్యత్తు వుంది. ప్రపంచంలో 35 దేశాలలో సంస్కృతాధ్యయనం జరుగుతోంది. కంప్యూటర్ శాస్తజ్ఞ్రులు సంస్కృతాధ్యయనం చేస్తున్నారు. అన్ని భాషలకు మాతృక సంస్కృత భాషే. దీన్ని నేర్చుకుంటే అనేక భాషలు తేలిగ్గా మనకు అవగాహన అవుతాయ. అంతేకాదు సంస్కృతంలో నిక్షిప్తమైన ఉన్న అపార పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవచ్చు. అందువల్లనే ప్రభుత్వాలు సంస్కృత భాషకు సముచిత ప్రాధాన్యతనివ్వాలి.
ప్రతి ఒక్కరం సంస్కృతం నేర్చుకుందాం! మన దేశ సంస్కృతికి ప్రతీక సంస్కృత భాష. అందువల్ల ఈ భాషను నేర్చుకోవడం ద్వారా మనదేశ సంస్కృతిని, సంస్కృతాన్ని కాపాడుకుందాం. ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, పాలకులు సంస్కృత భాషని ప్రోత్సహించాలి.

- వేదుల జనార్దనరావు