సబ్ ఫీచర్

రాజధానిలో ఏం జరుగుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి 11వ తేదీ న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం డెబ్బది స్థానాలున్న అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీతో ఆప్ అధికారం చేజిక్కించుకున్నది. బీజేపీ ద్వితీయ స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ఆప్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ముస్లింలీగ్ మాత్రమేకాక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగంగా మద్దతునివ్వటం విశేషం. బీజేపీ గత అసెంబ్లీలో కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అరవింద కేజ్రీవాల్ ఎడల ఆయన గురువు అన్నాహజారే వ్యతిరేకత ప్రకటించినా కూడా అవినీతి ఆరోపణలు ఉన్నా అధికారంలోకి రావటం విశేషం.
లోగడ రెండుసార్లు ఆప్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మాత్రం అసెంబ్లీ తీర్పుకు భిన్నంగా ఏడు స్థానాలూ బీజేపీ సాధించుకోగలిగింది. అంటే ఢిల్లీ సమస్యలు, గల్లీ సమస్యలు వేరువేరుగా ఉంటాయి అని ఓటర్లు ఆలోచించారా?
ఢిల్లీని షాహీన్‌బాగ్ ఏరియాలో అల్లర్లు జరిగాయి. ఇది ముస్లిం మెజారిటీ ప్రాంతం. ఇక్కడి రోడ్లు మూసివేశారు. దీనిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నాలుగేండ్ల పిల్లను ఆందోళనల్లోనికి దింపి ‘మాకు భారత్ నుండి ఆజాదీ కావాలి’ అని నినాదాలు ఇప్పించారు. అక్కడ కాల్పులు జరిగాయి. న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికలపై పాకిస్తాన్ ఎందుకు వ్యాఖ్యానిస్తున్నది. ప్రత్యక్షంగా పాకిస్తాన్, చైనాలు న్యూఢిల్లీ ఎన్నికలలో జోక్యం చేసుకున్నాయి. నెహ్రూ నుండి శీలాదీక్షిత్ యుగం వరకు ఇక్కడ అప్రతిహతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది?? కాస్త స్థిమితంగా కూర్చొని ఎవరైనా ఆలోచించారా? ఆంటోనియో మైనో అనారోగ్యంతో బాధపడుతున్నది. రాహుల్ విన్సీలో నాయకత్వ లక్షణాలులేవు. ఐనా వారిని పట్టుకొని ఆ పార్టీవారు ఎందుకు వేలాడుతున్నారు? ‘‘బీజేపీని ఓడించటం కోసం మేము బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాము’’ అని న్యూఢిల్లీ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెప్పుకున్నారు. ఇదెక్కడి తర్కం? జెఎన్‌యులో జాతి వ్యతిరేక ఆందోళనలు జరిగినప్పుడు అక్కడికి కేజ్రీవాల్, ఏచూరి సీతారాం, రాహుల్‌గాంధీ వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించడం సమంజసమేనా? మనీష్ శిశోడియా మీద పధ్నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. ఇతడు డిప్యూటీ ముఖ్యమంత్రి. స్వయంగా కేజ్రీవాల్ మీద కేసులున్నాయి. ఆయన మంత్రివర్గంలో దాదాపు పాతికమందిని అవినీతి ఆరోపణల కింద లోగడ కోర్టులు అభిశంసించాయి. ఇప్పుడు ఎన్నికలలో బీజేపీ, బీఎస్‌పీ, కాంగ్రెస్, జేడీయూ వంటి వివిధ పార్టీల నుండి వచ్చిన క్రిమినల్స్‌కు కేజ్రీవాల్ టిక్కెట్లుఇచ్చాడు. వీరి సంఖ్య మూడవ వంతు (1/3) ఉంది. కేజ్రీవాల్ విజయానికి ఉచితాలు అనుచితాలు ఒక కారణం అని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. కరంట్ ఫ్రీ-వాటర్ ఫ్రీ, బస్సులు ఫ్రీ, స్కూళ్లు ఫ్రీ- యాత్రలు ఫ్రీ- ఇలా అన్నీ ఉచితంగా ఇస్తాము అంటే ప్రజలు ఆకర్షింపబడుతారు. రెండు కొంటే ఒకటి ఫ్రీ అని ఒక నినాదం ఉంది. అసలు కొనకుండానే ఫ్రీ అంటే జనం ఎగబడతారు-
పంజాబులో ఉచితంగా ఇంటింటికీ డ్రగ్స్ సరఫరాచేసి ఎన్నికల విజయం సాధించటం ఇటీవలి విచిత్రమే.
బంజారా తాండాలో రజిత అనే చదువురాని యువతి ఉంది. ‘నీవు ఎవరికి ఓటువేశావు?’ అని అడిగాను. ‘ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి’ అని చెప్పింది. వాళ్ల గ్రూపు నాయకునికి గంపగుత్తగా కొన్ని లక్షలు ఇస్తారు. దానిని అతడు తమ అనుయాయులకు పంచుతాడు. దీనిని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటారా?
జయలలిత (మాజీ తమిళనాడు సిఎం) ‘అమ్మ కాంటీన్’ పెట్టి ఐదు రూపాయలకే భోజనం అన్నది- ఇదెలా సాధ్యం? బియ్యం కిలో యాభై రూపాయలు ఉన్నప్పుడు సన్నబియ్యపు అన్నం కూర, పులుసు, పెరుగు, ఊరగాయతో ఐదు రూపాయలకు భోజనం వస్తుందా? అంటే భారీ సబ్సిడీ ఇవ్వాలి. అలాగే రైతుల ఋణమాఫీ విషయంలో ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం పోటీపడుతున్నది. ‘రైతులను ఆదుకుంటాం- మీరు అప్పులు తీసుకొని బ్యాంకులకు ఎగగొట్టండి’ అంటున్నారు. మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవలసిందే కానీ ఈ ఉచితాలకు అనుచితాలకు హద్దు ఎక్కడ? శ్రమించకుండా భుజించే అలవాటు ఏర్పడిన తర్వాత ఆ జాతి- దేశం వెనుజులా వలె దివాలా తీస్తుంది. కేజ్రీవాల్ ఉచితాలను ప్రాధాన్యం ఇచ్చి మహిళలను ఆకర్షించి, వారి ఓట్లు భారీగా సంపాదించాడని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.
చైనాలో, రష్యాలో, అమెరికాలో, బ్రిటన్‌లో ఇలాంటి వ్యవస్థలు లేవు. అమెరికాలో ఒక వ్యక్తి పనిచేయకపోతే మర్నాడు అతని ఉద్యోగం పోతుంది. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఉందా? దేశంలోని ముఖ్యమంత్రుల జాబితాలు చూపండి. వీరిలో క్రిమినల్ కేసులు లేని ఒకవ్యక్తి పేరు చెప్పండి చూద్దాం!? ప్రతివారం పోలీసుస్టేషన్‌కు పోయి సంతకాలు పెట్టేవారు ఒకరైతే, న్యూఢిల్లీలో 4000 మంది అమాయక సిక్కులను ఊచకోత కోసిన కమలనాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జయలలిత, లాలూప్రసాద్‌యాదవ్‌లు, హేమవతీ నందన్ బహుగుణలూ కోర్టు శిక్షలు పడ్డవారు ముఖ్యమంత్రులు-
కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ 1966నాటి రామకృష్ణ మర్డర్ కేసులో మొదటి ముద్దాయి. ‘హత్యలుచేసి రాజ్యాధికారం సంపాదిస్తే తప్పేమిటి?’ అని బహిరంగంగా అడుగుతున్నాడు. శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, వాద్రా వంటివారు రకరకాల కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నారు. ఐనా వారిని స్వయంగా ప్రభుత్వం నాయకులుగా అంగీకరిస్తున్నది.
***
రెండింటికి చెడిన రేవడి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఏపీలోని రాజకీయ పార్టీల స్థితిగతులు ఇలా ఉన్నాయి. ఇవ్వాళ వాటికి దశ దిశ లేకుండా పోయింది. మద్రాసు నుండి తరిమితే కర్నూలు వచ్చారు. అక్కడినుండి తరిమితే అమరావతి వచ్చారు. అక్కడి నుండి జగన్‌రెడ్డి తరిమితే విశాఖపట్నం పోతున్నారు.
ఈ ప్రస్థానం ఎక్కడ ముగుస్తుంది?? కాపులకు(విశాఖ), కమ్మలకు (గుంటూరు), రెడ్లకు (కర్నూలు) మూడు రాజధానులు ఉంటే క్షత్రియులకు (విజయనగరం), పద్మ నాయకులకు (బొబ్బిలి) ఉంటే తప్పేమిటి?

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్