సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా ఆయన ప్రసాదమే
ఏది జరిగినా ‘అది మన ప్రారబ్ధం’అంటారు. ‘ఒకరిని అని ఏంలాభం. మన కర్మ యింతే అయితే’అని చెబుతుంటారు. కాని కొంతమంది ఇది వొప్పుకోరు. ‘శివుని ఆజ్ఞలేక చీమయినా కదలదు కదా. నేను చేసేదేముంది? అంతా ఆయనే చేయిస్తున్నాడు? సుఖం యిచ్చినా, దుఃఖం యిచ్చినా ఆయనే’. అంటారు. అలాగే! ఆ సంగతిని నీవు గట్టిగా నమ్ము. అదే మోక్షం, భగవంతుడే అన్నీ అనుగ్రహిస్తున్నాడు. కనుక నీకేది లభించినా ఆయన ప్రసాదమే. స్వీకరించు. అప్పడిక మంచీ, చెడూ అని అనటానికి నీకుహక్కు లేదు.
అంతా అనుగ్రహమే
ఏదైనా మేలు జరిగితే, ‘అదంతయు భగవదనుగ్రహ’మని చెప్పినట్లే. కీడు ఏదయినా కలిగినప్పుడు కూడా ‘అదియును భగవదనుగ్రహమే’ అనుకొనవలె. ఈనాడు అలా అనుకొనేవారు కనబడరు.
నీవు నీ జీవితాన్ని దేవుని యధీనముచేయు. ఆయన మేలు కలిగించునో, కీడు కలిగించునో ఆ చింత నీకనవసరం. ఒక్కొక్కసారి భగవంతుడు కావలెనని నీకు గట్టికష్టమునే కల్గించవచ్చును. అది భవిష్యత్తున నీ మేలుకొరకే కావచ్చును. కాదని నీవెట్లు తీర్మానించగలవు? అసలు నీ తీర్మానమెందుకు? నీవు చేయవలసిన పనిని నీ శక్తికొలది సక్రమంగాచేసి, పలుకకుండా వుండు.
అభయ కంకణాలు
శ్రీ కృష్ణ్భగవానుడు భగవద్గీతలో మనకు మూడు మాటలు చెప్పాడు.
‘్ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే, యుగే’
‘శిష్ట రక్షణకోసం, దుష్టశిక్షణకోసం, దర్మసంస్థాపనకోసం యుగయుగాలలో నన్నునేను సృజించుకుంటాను’, ఇది మొదటిది!
‘యోగక్షేమం వహామ్యహం’
‘ననే్న నమ్ముకొన్నవారి యోగక్షేమాలను నేనే చూస్తాను’, ఇది రెండవది.
‘మోక్షయిష్యామి మాశుచ’
‘అన్నిటినీ వదిలివేసి ననే్న శరణుజొచ్చిన వారి పాపాలను పోగొట్టి ముక్తినిస్తాను’ ఇది మూడవది.
కృష్ణుని అభయహస్తానికి మూడు కంకణాలుంటాయి. అవి ఈ మూడు విషయాలనే మనకు గుర్తుచేస్తుంటాయి.
ఇహ సంసారే బహు దుస్తారే...
సాగరం తన కడుపులో ఏమేం దాచుకుందో ఎవరికెరుక? అది కాలంలాగే అనాది. అంతులేనిది. అంతుపట్టనిది. ఒకప్రక్క భయంకర సుడిగుండాలు, మరోవేపు ఉవ్వెత్తున ఎగసే కెరటాలు సాగరాన్ని అల్లకల్లోలం చేస్తుంటాయి. సురక్షితమైన ఓడలేకుండా ఈ వొడ్డునుండి ఆ వొడ్డుకు దానిని దాటటం అసాధ్యం.
సంసార సాగరం కూడా అలాంటిదే. అంతకన్నా కూడ భయంకరం దీనిని దాటటం బొత్తిగా ఆవశ్యం. ఇది కూడా అంతులేనిదే. అంతుపట్టనిదే. అబ్బో! ఎంత అఖాతం! సంసార సాగరాన్ని దాటాలంటే, ‘దైవకృప’అన్న నావ వొక్కటే ఉపాయం! లేకపోతే జనన మరణాలనే అలలమధ్య ప్రాణి ఎప్పటికీ కొట్టుమిట్టాడుతూనే వుంటాడు.
నిరంతర నిధి ధ్యాస
భగవంతుడు సర్వాంతర్యామి. సర్వశక్తిశాలి. సర్వజ్ఞుడు. అటువంటి పరిమితి ఎరుగని పరమాత్మను భావించటానికి మనిషి ఎంత సమయాన్ని వినియోగిస్తున్నాడు? ఇరవై నాలుగు గంటల దినంలో కేవలం కొద్ది నిముషాలు! ఆ అనంత ఆత్మ పదార్థాన్ని ఎలా సంభావిస్తున్నాడు? ఒక చిన్న బొమ్మనో, ఫొటోనో ఎదురుగా పెట్టుకొని! ఇదేం కథ? ఎంత వృథా!
ఊపిరి ఆడుతున్నంతకాలం ఆయనను మననం చేస్తుండాల్సిందే! తెలివి వున్నంతకాలం ఆయనను తలుస్తుండాల్సిందే! భగవంతుని గురించి తప్ప ఇతర ఆలోచనలను రానీయకు. ఆయన ఆదేశాలకు ఎదురుచూడటం తప్ప మరో లక్ష్యాన్ని చింతించకు. ఆయన ఆదేశాన్ని ఆచరించటం మినహా మరో పని చేపట్టకు. శరణాగతి అంటే గదే!
కర్మను వదలకు!
‘సర్వధర్మాలనూ వదిలివేసి ననే్న శరణు పొందు’- అని గీత చెబుతోంది. అయితే కర్మను వదిలేయమనటం లేదు. అంటే, నీవు కర్మ చేయాలి. అయితే భగవత్పరంగా చేయి. అప్పుడు నీవుచేస్తున్న కర్మ ధర్మబద్ధమా కాదా అన్న ప్రశ్న ఉదయించదు. భగవత్పరమైన కర్మ ఎప్పుడూ ఆమోదయోగ్యమే అవుతుంది. ‘్ధర్మాలను విడిచిపెట్టు’అనటంలో ‘విచ్చలవిడిగా ప్రవర్తించు’ అని అర్థంకాదు. నిష్క్రియకూడా కాదు. ‘సర్వస్య శరణాగతి’ అన్న అత్యున్నత ఆదర్శానికి అది ప్రతీక.

ఇంకా ఉంది