సబ్ ఫీచర్

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల సమయం వచ్చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవబోతున్నాయి. ఇంకా నెల సమయం ఉంది కదా అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టకపోతే అంతే సంగతులు.. అదీ ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ వేసుకుని మరీ చదివితే పరీక్షల్లో తప్పకుండా రాణించవచ్చు. పరీక్షలు అనగానే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఒకటే టెన్షన్. విద్యార్థులు పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకునే సమయం, ఇన్నాళ్లుగా చదివిన పాఠాలు, విషయాల్ని మననం చేసుకుంటూ నమూనా పరీక్షలు రాసే సందర్భాలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలోనే సిలబస్ పూర్తిగా చదవలేదనో, చదివినా గుర్తుంటుందో లేదో అనే అనుమానాలు విద్యార్థులను వేధిస్తుంటాయి. చూసేవారికి ఇది చిన్న విషయంగా అనిపించినా విద్యార్థులకు ఇది ఒత్తిడి కలిగించే అంశమే.. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి విద్యార్థులను బయటపడేసి, ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఉపయోగపడే యాప్స్ అనేకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేవారికి ఉపయోగపడే ఆ యాప్స్ వివరాలను తెలుసుకుందాం..
* పరీక్షలకు సిద్ధమయ్యేవారు గత సంవత్సరాల్లో వచ్చిన ప్రశ్నలు, సరైన జవాబులను తెలుసుకునే ప్రయత్నం చేయటం తెలిసిందే.. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు వీటికోసం లెక్కకు మించిన గైడ్స్ కొనే బదులుగా పాత పరీక్ష పత్రాలను ఆప్ రూపంలో అందిస్తోంది విక్రమ్ సిరీస్. ‘‘ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రిపరేషన్’’ అనే ఈ యాప్‌లో ఇంటర్‌కు సంబంధించిన పలు గ్రూపుల తెలుగు, ఇంగ్లీషు మీడియం ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ పేపర్లు ఒకేచోట ఇమేజ్ రూపంలో పొందవచ్చు.
* ఒత్తిడికి దూరంగా పరీక్షలకు మానసికంగానూ సిద్ధమయ్యేందుకు ‘‘ఇంపాక్ట్ ఇండియా’’ వంటి యాప్స్ ఉపయోగపడతాయి. ఇందులో సమయపాలన, జ్ఞాపకశక్తి పెంచే మెళకువలు, ఒత్తిడిని అధిగమించే చిట్కాలు, నెగోషియేషన్ స్కిల్స్ వంటి అంశాలకు సంబంధించిన అనేక వీడియోలు ఉంటాయి. ఈ యాప్ నుంచి అనుబంధ యూట్యూబ్ పేజీకి వెళ్లి దీనికి సంబంధించిన వీడియోలను వీక్షించవచ్చు.
* గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష కాస్త కష్టంగా అనిపించడం సహజమే.. అలాంటివారికి ‘‘ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్’’ అనే యాప్ సాయం తీసుకోవచ్చు. ఇందులో ఇంటర్మీడియట్, అప్పర్ ఇంటర్మీడియట్ అనే విభాగాల్లో గల 1200 ఇంగ్లీష్ గ్రామర్ అంశాలు దశలవారీగా సాధన చేస్తే ఇంగ్లీషు పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు.
* మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో సబ్జెక్టు ఎంత ముఖ్యమో ఫార్ములాలూ అంతే ముఖ్యం. చాలామంది వీటిని గుర్తుంచుకునే విషయంలో తడబడుతుంటారు. ఇలాంటివారి కోసం ‘‘్ఫర్ములా డెక్’’ అనే యాప్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వివరాలతో యాప్‌లో ఎకౌంట్ తెరచి అందులో కోరిన విభాగంలో ఫార్ములాలు నేర్చుకోవచ్చు.
* కొందరు ఎంత బాగా చదివినా పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లేసరికి కంగారు పడుతుంటారు. ఇలాంటివారు పరీక్షకు ముందు శ్రావ్యమైన సంగీతం వింటే మంచిది. దీనికోసం ‘‘కామ్’’ వంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని హెడ్‌ఫోన్స్‌తో వింటే మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతతో పరీక్ష రాయగలరు.
* సిలబస్ అంతా చదివి చివరలో రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం పుస్తకాలను తిరగేయడం తలనొప్పి. ఇలాంటి సమయంలో మొబైల్‌లో ‘‘తెలంగాణా ఎస్.సి.ఇ.ఆర్.టి. బుక్స్’’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషలో ఒకటి నుండి పది తరగతుల పుస్తకాల పీడీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి.
* పుస్తకాలు చదవటం కంటే అవే అంశాలను వీడియో రూపంలో చూస్తే విద్యార్థులకు బాగా గుర్తుంటాయి. ఈ అవకాశం అందించే యాప్స్‌లో ‘‘ఖాన్ అకాడమీ’’ ఒకటి. ఇందులో మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, తదితర అంశాల సమాచారం ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు వీడియోల రూపంలో లభిస్తుంది.
* అలాగే యూట్యూబ్‌లో తెలుగు రాష్ట్రాల పదో తరగతి పాఠాలు వివరంగా తెలుసుకోవాలంటే ‘‘డిజిటల్ టీచర్’’ వంటివాటిని ఆశ్రయించవచ్చు.
* పరీక్షలకు తయారయ్యేవారు సమయపాలన పాటించటం ఎంతైనా అవసరం. సమయం, సిలబస్‌లను బట్టి సమయపాలన కోసం మొబైల్‌లో ‘‘ఎగ్జామ్ కౌంట్‌డౌన్’’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షల తేదీలు, సిలబస్ వివరాలు పొందుపరిస్తే కౌంట్‌డౌన్ రూపంలో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా చెబుతూ ఉంటుంది. దీంతో ఎటువంటి హడావుడి, గాబరా లేకుండా తగినట్లుగా చదువుకోవచ్చు.
* పరీక్షల ముందు నుంచే ‘‘నిఘంటు’’ యాప్స్‌ను వాడటం వల్ల కొత్త పదాల స్పెల్లింగ్స్ నేర్చుకుని తప్పులు రాయకుండా చూసుకోవచ్చు. *