సబ్ ఫీచర్

ఆటలకు కేవలం అరగంటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు ఎప్పుడు చూసినా చథువు.. చదువు.. ఆటలు, పాటలు, టీవీ.. అన్నీ బంద్.. ఎంతసేపూ చదువే.. చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ చదువు.. చదువు.. అని అరుస్తుంటారు. పెద్దవాళ్ల కోణంలో ఇది కరెక్టే అనిపిస్తుంది కానీ.. పిల్లలకు మాత్రం అది ఒత్తిడిగా అనిపిస్తుంది. అందుకే చదువుకోమంటే.. రకరకాల సాకులు చెబుతుంటారు. ఆ సమస్యలు లేకుండా పిల్లలు అటు చదువుతూ, ఇటు ఆడుతూ హాయిగా గడపాలంటే.. దానికి పరిష్కారం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది.
అసోచామ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో పిల్లలు ఇంటి నుంచి బడికి వెళ్లి రావడానికి గంట పడితే.. పాఠశాలలో గడిపేది 8-10 గంటలు. ఆ తరువాత రెండు గంటలు హోం వర్కు, అదయ్యాక రెండు లేదా మూడు గంటలు ట్యూషన్.. ఇలా వాళ్ల రోజు గడిచిపోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే.. పిల్లలకు రోజులో ఆడుకోవడానికి దొరికే సమయం ఇరవై నిముషాల కన్నా తక్కువే.. ఒక్కమాటలో చెప్పాలంటే వారికి చదువే ప్రపంచం అయిపోతుంది. ఇదే అలవాటైతే వారిపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా స్కూలుకు వెళ్లాలన్నా, పుస్తకం తీయాలన్నా ఉత్సాహాన్ని చూపించరు. ఆ కారణంతోనే అన్నింటినీ నిదానంగా చేయడం మొదలుపెడతారు. చదువుపైనా ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమస్య రాకుండాండాలంటే.. తల్లిదండ్రులే వారిని సరదాగా మార్చాలి అంటున్నారు మానసిక నిపుణులు.
* పిల్లలను ఎప్పుడూ చదువు.. చదువు.. అనకుండా వారికి అవసరమైన సామర్థ్యాలను అందించాలి.
* చిన్నారుల్లో పదసంపదను పెంచే ప్రయత్నం చేయాలి. దానివల్ల భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. అంటే చేతికి పుస్తకాలు ఇచ్చి కూర్చోబెట్టక్కరలేదు. పిల్లలతో మాట్లాడుతూ వీలైనన్ని కొత్త పదాలు వాడాలి. వాటికి అర్థాలు చెబుతూ ఆ పదాలు వారినే తెలుసుకోమని చెప్పాలి. ఇలా పదసంపద పెరగడం వల్ల చదువు సులువు అవుతుంది.
* పిల్లలపై అది చేయండి.. ఇది చేయండి.. అని ఒత్తిడి తేకూడదు. పిల్లలకు చదువుతో పాటే ఆటలు, ఇతర
వ్యాపాకాలకు కూడా ఓ టైం టేబుల్ సెట్ చేయాలి. అది పిల్లల ఆధ్వర్యంలోనే జరగాలి. అప్పుడే వారికి ఎప్పుడు ఏది చేయాలో తెలుస్తుంది.
* రోజంతా పాఠశాల్లో గడిపాక మళ్లీ ట్యూషన్లు, హోంవర్కులతో గడిపే పిల్లలకు మళ్లీ చదవమంటే కాస్త ఒత్తిడిగా అనిపించడం సహజమే.. ఎప్పుడైనా పిల్లలను చదవమని చెప్పినప్పుడు వారికి ఏ సబ్జెక్టు ఇష్టమో తెలుసుకుని దానిపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేయాలి.
* రోజుకి ఒకటో, రెండో సబ్జెక్టులో పూర్తిగా చదివించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది.
* స్కూలు నుంచి రాగానే పిల్లలను చదువు అంటూ కూర్చోబెట్టకుండా కాసేపు ఆడుకోనివ్వాలి. వాళ్లకు ఇష్టమైన అంశంలో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేయాలి.
* ఇవి వారానికి రెండు, మూడు రోజుల్లో పిల్లల చదువుకి అడ్డంకి కాకుండా మేనేజ్ చేయవచ్చు.
* ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. హోం వర్కులు తక్కువగా ఉన్నప్పుడు, పరీక్షలు లేనప్పుడు పిల్లలను పార్కులకు తీసుకెళ్లచ్చు. పిల్లలకు విహారయాత్రలు కూడా అవసరమే..
* పిల్లలకు ఏకాగ్రతలను పెంచే పజిల్స్, క్విజ్ వంటివి నేర్పాలి. అప్పుడే వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. అప్పుడే సులువుగా చదువుకోగలుగుతారు.
* పిల్లలకు పుస్తక పఠనం కూడా మంచిదే.. వీటికి రాత్రి సమయాలే అనుకూలం.
* పిల్లలకు ఇష్టమైన అంశంలో దగ్గరుండి తర్ఫీదును అందిస్తే అమ్మానాన్నలు వారిని అన్నింట్లో ప్రోత్సహిస్తారు అనే నమ్మకం వారిలో కలుగుతుంది. *