సబ్ ఫీచర్

భాషా వైవిధ్యం అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభాష తల్లి పాలతో సమానం. శిశువుకు తల్లిపాలు లభించనట్లయితే ఏ విధంగా అనారోగ్యం పాలవుతాడో మాతృభాష అభ్యసించలేని విద్యార్థి కూడా విషయాలు నేర్చుకోవడంలో వెనుకబడతాడు. 1999వ సంవత్సరంలో యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడంతో 2000 సంవత్సరంనుండి ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ భాషలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 7000 భాషలున్నాయని అంచనా. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాషకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలలో మాట్లాడుతున్న ప్రాంతీయ భాషల మనుగడకు ప్రమాదం దాపురించింది. వీటిలో ముఖ్యంగా గిరిజనులు మాట్లాడే లిపి లేని భాషలు చాలావరకు కనుమరుగు అయిపోయాయి. ప్రతి రెండువారాలకు ఒక ప్రాంతీయ భాష అంతరించిపోతోందని యునెస్కో నివేదికలు తెలియచేస్తున్నాయి. భారత ప్రభుత్వం 22 భాషలను అధికార భాషలుగా గుర్తించింది.
2018లో కేంద్ర ప్రభుత్వం వివిధ భాషలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ‘్భషా సంగమం’అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కెనడాలో నివశిస్తున్న రఫికుల్ ఇస్లాం అనే భాషా ప్రేమికుడు 1998లో అప్పటి ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ కోఫి అన్నన్‌కు ఒక లేఖ రాసారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించాలని ఆయన కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన కోఫీ అన్నన్ 1999 నవంబర్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరపడానికి నిర్ణయించారు. తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడ్డ నేటి బంగ్లాదేశ్‌లో 1952 ప్రాంతంలో తమ మాతృభాష అయిన బెంగాలీ భాషను రక్షించాలని కోరుతూ కొందరు యువకులు పెద్దఎత్తున ఉద్యమం చేశారు. అప్పట్లో బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లో భాగంగా ఉండేది.
యువకుల నిరసన కాస్త పెద్ద ఉద్యమంగా రూపొందింది. ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో భాగంగా కాల్పులు జరుపగా నలుగురు యువకులు అసువులు బాసాలు. వారి త్యాగానికి గుర్తుగా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుతున్నారు. బ్రిటన్ అనుసరించిన వలసవాదం కారణంగా ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా ఎదిగింది. ఆంగ్ల భాషను నేర్చుకుంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అత్యధిక మంది ప్రజలు భావించడంతో ఇంగ్లీషు మీడియంకు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో మాతృభాషలో అభ్యసించే విద్యార్థుల సంఖ్య తగ్గింది. స్వాతంత్య్రానికి ముందే గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు, కవులు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ప్రారంభించడంతో అప్పటివరకు గ్రాంథిక భాషలోవున్న తెలుగు వ్యవహారిక భాషగా మారింది. గిడుగు రామ్మూర్తి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతుండగా, తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి కాళోజి నారాయణరావు జయంతిని సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ భాషలను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో 2019ను ప్రాంతీయ భాషల సంవత్సరంగా ప్రకటించింది.
అయితే కేవలం దినోత్సవాలు జరిపినంత మాత్రాన ప్రాంతీయ భాషలు పరిరక్షించబడవు. ప్రభుత్వం జరిపే వివిధ ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృభాషను తప్పనిసరిగా వినియోగించాలి. వాణిజ్య సముదాయాలలో తెలుగులోనే పేర్లు ఉండేవిధంగా చూడాలి. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషిచేయాలి. అత్యధిక మార్కులు వస్తాయనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు తెలుగుకు బదులు సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. అయితే వారికి సంస్కృతంపై కూడా ఏమాత్రం పట్టు వుండటం లేదు. భాషల మధ్య సమన్వయాన్ని ఏర్పర్చాల్సిన అవసరం వుంది. హిందీ భాషకు, తమిళ భాష మాట్లాడే ప్రజల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలి. అలాగే వివిధ భాషలకున్న మాండలీకాలను పరిరక్షించాల్సిన అవసరం వుంది. ప్రాంతీయ భాషలకున్న యాసలను అపహాస్యంచేసే పరిస్థితి తలెత్తనీయకూడదు. తద్వారా ప్రాంతీయ భాషలు రక్షింపబడతాయి.

- యం. రాంప్రదీప్, 9492712836