సబ్ ఫీచర్

సీఏఏ ఇక శిలాశాసనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత పౌరులకు ఏమాత్రం సంబంధం లేని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై గత రెండు మాసాలకు పైగా అటు ఢిల్లీలో ఇటు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ప్రదర్శనలు, ఆగ్రహజ్వాలలు అర్ధరహితమని తెలిసినా చాలామంది తమ రాజకీయ అవసరాల కోసం, దానిపై విమర్శలు చేస్తున్నారు.
రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దు విషయం గానీ, సీఏఏ విషయంలో గానీ తమ వైఖరి మారదని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో ప్రకటించారు. ఆ చట్టంపై ఎలాంటి పునరాలోచన లేదని సుస్పష్టంగా ప్రధాని ప్రకటించారు. దాంతో సీఏఏ ఇక శిలాశాసనమే!
దేశంలో ఎన్నో ఎనె్నన్నో సమస్యలున్నా, వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా, మేధోమథనం చేయకుండా, ఏకాగ్రతతో సకారాత్మక దృష్టి సారించకుండా ఇలా నెలల తరబడి ప్రతిపక్షాలు సమస్య గాని సమస్యపై సర్వశక్తులు ఒడ్డటం విడ్డూరం.
సీఏఏ అకస్మాత్‌గా ఆకాశం నుంచి ఊడిపడిన ఆలోచన ఏమాత్రం కాదని, దేశ విభజన సమయం నుంచి ఈ విషయం అందరి నోళ్ళలో నానుతూ ఉందని, మహాత్మాగాంధీ, అప్పటి ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీ మధ్య జరిగిన చర్చల సారాంశం, అవగాహన, అర్థవంత చర్చలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆయా సమయాల నాటి ప్రభుత్వాల అభిప్రాయాలు ఆలోచనలు, ఆకాంక్షలు, మానవీయ కోణం అన్నీ జత కలిసి, సారాంశంగా సీఏఏ రూపుదిద్దుకున్నదని అటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా పదే పదే చెప్పినా, గత చరిత్రను తారీఖులు, దస్తావేజులు, పత్రాలను ఉల్లేఖించి వివరించినా వినకుండా, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తూ దేశంలో అశాంతిని, అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు.
దేశీయంగానేగాక అంతర్జాతీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్ చేయడం దారుణాతి దారుణం. భారత పౌరులెవరికీ ఎటువంటి సంబంధం లేని చట్టంపై ఇంత గుడ్డిగా, జాతీయంగా, అంతర్జాతీయంగా వ్యతిరేకతను ప్రోదిచేయడం, ఒత్తిడి తీసుకురావడం చూస్తే చదివేస్తే వున్న మతిపోయినట్టుగా ఉందే తప్ప తమ జ్ఞాన చక్షువుల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఆర్టికల్ 370 రద్దు గాని, సీఏఏ గాని పూర్తిగా భారతదేశ అంతర్గత అంశాలు. వీటిపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం, అంతర్జాతీయ మీడియాలో కథనాలు రాయించి దేశ ప్రతిష్ఠను చులకన చేయడం దారుణాతి దారుణం.
దేశ ప్రయోజనాలను ఆశించి ఎప్పుడో తీసుకోవలసిన చర్యలను ఆలస్యంగానైనా తీసుకున్నామని, ఇవి అవసరమని ఏ రకమైన ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, తీకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని పేర్కొన్నా, కొందరు ఇంకా దింపుడు కళ్ళెం ఆశతో సీఏఏ రద్దు ఉపసంహరణ కోసం ఒత్తిడి చేయడం, ఊరేగింపులు జరపడం, తీర్మానాలు చేయడం హాస్యాస్పదం. ఆ చట్టంలో ఏ భారతీయ పౌరుడికైనా ఇసుమంత కష్టం... నష్టం కలుగుతుందన్న దాఖలా లేకపోయినా ఢిల్లీ మొదలుకుని తమిళనాడు వరకు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం, రాళ్లు విసరడం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఊరేగడం విచిత్రం.
ఇటీవల అమిత్‌షా ఒక జాతీయ టెలివిజన్ ఛానల్‌లో మాట్లాడుతూ సిఏఏపై ఎవరికైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు తాను సిద్ధమేనని, తన కార్యాలయంలో తనను కలవొచ్చునని చెప్పగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ఆందోళన కారులు వందలాది మంది అమిత్‌షా ఇంటికి ఆదివారం బయలుదేరారు. కేంద్ర మంత్రినుంచి సమయం తీసుకోలేదు. ఎంతమంది ప్రతినిధుల బృందం కలవనున్నది. తదితర అంశాలను పక్కకునెట్టి తమకెవరూ నాయకులు లేరు. కాబట్టి తామందరం మూకుమ్మడిగా మంత్రి ఇంటికి బయలుదేరతామనడం తమతో మంత్రి చర్చించాలని డిమాండ్ చేయడం ఎంతటి అపరిపక్వ ఆలోచనలతో వాళ్లు కాలం గడుపుతున్నారో అర్థమవుతోంది. ఇంతటి విశృంఖలత్వ ధోరణితో, అశాస్ర్తియ పద్ధతిలో ప్రభుత్వ పద్ధతులను పట్టించుకోమంటూ మూకుమ్మడిగా వీధుల్లోకి రావడం విచిత్రం విషాదం కూడానూ.
కేంద్ర మంత్రితో ఒక అంశంపై చర్చ చేసేందుకు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఒక ప్రతినిధుల బృందం ఏర్పాటుచేసుకోకుండా, ఆందోళనకారుల మందరం ఆమాత్యుని ఇంటికి వెళతామనడం ఎంతటి అనాగరికమో అర్థమవుతోంది. ఈ మొండి మూర్ఖ వైఖరితోనే నెలలపాటు కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం సహనం వహిస్తోంది. షాహీన్‌బాగ్ ప్రజలకు, స్థానిక వ్యాపారులకు, పాఠశాలల విద్యార్థులకు, కార్యాలయాల సిబ్బందికి తీవ్ర ఇబ్బంది కలుగుతున్నా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తినా సహనంతో ప్రభుత్వం మిన్నకున్నది. దీన్ని అలుసుగా తీసుకుని, ఇది ప్రభుత్వ బలహీనతగా భావించి రెచ్చిపోవడంలో ఇసుమంత కూడా అర్థం లేదు.
షాహీన్‌బాగ్ శిబిరంలో మహిళలు, పిల్లలు, వృద్ధులను సమీకరించి వారిచేత మోదీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇప్పిస్తూ, పాకిస్తాన్ అనుకూల నినాదాలు మార్మోగేలా చేస్తూ ఉండటం ఏ దేశభక్తిగల పౌరుడు అంగీకరిస్తాడు? సిఏఏ వ్యతిరేకత వెనుక ‘పెద్ద కుట్ర’ దాగుందన్న సంగతి ఎప్పుడో తేటతెల్లమైంది. వివాదాస్పద సంస్థలనుంచి, వ్యక్తులనుంచి ఈ ఆందోళన కొనసాగింపునకు నిధులు అందుతున్నాయని తెలుస్తోంది. ముస్లిం మతోన్మాదం రెచ్చగొట్టే శక్తులు ఇందులో చొరబడి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని ఆధారాలు లభించాయి. దేశాన్ని మరోసారి విభజించే కుట్ర ఆనవాలు సైతం కనిపించింది. ఆమేరకు నినాదాలు యధేచ్ఛగా చేశారు. మీడియాలో అవి ప్రచారమయ్యాయ. జిన్నాను ప్రస్తుతిస్తూ, అల్లాహో అక్బర్... అంటూ అమాయకులను ఆకర్షిస్తూ వేర్పాటువాద దారి వేయడం ఏమేరకు ఆమోదనీయం?
దేశం నలుమూలలా, కోల్‌కత్తా, కేరళ, కోయంబత్తూర్, హైదరాబాద్ ఇట్లా అనేక నగరాలలో చేతిలో త్రివర్ణ జెండా, గుండెల నిండా పాకిస్తాన్ జెండా నింపుకుని గుంపులు గుంపులుగా ఊరేగడం కనిపించింది. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి. వేర్పాటువాద వాతావరణం పిసరంత ఎక్కువే అక్కడ దర్శనమైంది. చివరికి షెర్జిల్ ఇమామ్ లాంటి వాళ్ళు జైలుపాలయ్యారు. షెర్జిల్ ఇమా ఇచ్చిన నినాదాలనే సిఏఏ వ్యతిరేకులందరూ ఇచ్చారు. ఇస్తూ ఉన్నారు. అంటే వారంతా దేశద్రోహానికి పాల్పడుతున్నారనే అర్థం!
అదే ఢిల్లీలో కేజ్రీవాల్ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పేద ప్రజల పక్షపాతిగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదం కావాలని కోరారు. రాజకీయ విరోధిత్వం విస్మరించి దేశ రాజధాని ఢిల్లీ ప్రజల సంక్షేమం అభివృద్ధికోసం పనిచేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అశేష ప్రజాసమూహం ముందు ప్రకటించారు.
ఇదేకదా నేటి అవసరం. రాజకీయం చేయాల్సిన సమయంలో చేసి, మిగతా సందర్భంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజల జ్ఞానాభివృద్ధికై పాటుపడాల్సిన విషయం విస్మరించి విద్వేష పూరిత ప్రసంగాలు, నినాదాలు, వేర్పాటువాద వాతావరణం సృష్టించే పనులకు పాల్పడితే అదెలా ఆహ్వానించదగ్గ అంశమవుతుంది?
కేజ్రీవాల్ మోదీ వ్యతిరేక శిబిరంలో కొనసాగినా, కొన్ని విధానాలను విభేదించినా ప్రజల అభివృద్ధి- సంక్షేమం విషయానికొచ్చేసరికి సమన్వయంతో పనిచేస్తామని, రాజకీయ విరోధితత్వం తాత్కాలికమని సుస్పష్టంగా పేర్కొన్నారు. బెంగాల్‌లో మమత గాని, కేరళలో విజయన్ గాని, తెలంగాణలో కేసీఆర్ గాని మరింత విజ్ఞతతో, సంతుష్టీకరణ పద్ధతిలోగాక దేశ ప్రయోజనాలు అత్యంత కీలకమన్న అవగాహనతో అడుగులు ముందుకేస్తే ‘‘అభ్యుదయం’’ అందరి లోగిళ్ళలోకి తొంగి చూస్తుంది.

- వుప్పల నరసింహం, 9985781799