సబ్ ఫీచర్

మోడీ సత్వర చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓచెట్టుకింద మల్లయ్య తపస్సు చేసుకుంటున్నాడు. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు.
‘నా శత్రువు పుల్లయ్య ఆ సరస్సువద్ద తపస్సు చేసుకుంటున్నాడు- వాడి దగ్గరికి వెళ్లి మళ్లీ రండి స్వామీ’ అన్నాడు పుల్లయ్య.
‘మళ్లీ రాను- నీకేం కావాలో ఇప్పుడే కోరుకో’ అన్నాడు పరమశివుడు.
‘ఐతే వాడికి ఇచ్చే వరఫలం నాకు డబుల్ రావాలి’ అన్నాడు మల్లయ్య. ‘తథాస్తు’ అని శివుడు వెళ్లిపోయాడు. తర్వాత పుల్లయ్య దగ్గరికి వెళ్లాడు. ‘స్వామీ- ఆ మల్లయ్య నా శత్రువు. వాడికి ఏం వరం ఇచ్చారు?’ ‘నీకేది వస్తే వాడికి అది డబుల్ వస్తుంది.’
‘ఐతే నాకు ఒక కన్నుపోయేటట్లు వరం ఇవ్వండి’ అన్నాడు పుల్లయ్య.
తథాస్తు అన్నాడు పరమశివుడు. ఇది చాలా వింత కథ.
న్యూఢిల్లీలో 2020 ఫిబ్రవరి మొదటివారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో ఆప్ అనే ప్రాంతీయ పార్టీ ఘన విజయం సాధించింది. 70 సీట్లలోను 62 సీట్లు ఆప్ గెలుచుకోగా 8 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం మిఠాయిలు పంచిపెట్టాడు. ఎందుకు?? బీజేపీ ఓడిపోయినందుకు- నిజానికి జరిగిందేమిటంటే 70 సంవత్సరాలుగా బలమైన పునాదులతో న్యూఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అడ్రసు లేకుండాపోయింది. శీలాదీక్షిత్ కాలంలో దేదీప్యమానంగా వెలిగిన కాంగ్రెస్ సోదిలోకి రాకుండాపోయింది. లోగడ ఎన్నికలలో 40 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఈసారి 4 శాతం కూడా సంపాదించలేకపోయింది. మరి పి.చిదంబరం ఎందుకు స్వీట్లు పంచిపెట్టినట్లు?? పి.చిదంబరం ఆయన కొడుకు కార్తి చిదంబరం కరడుకట్టిన ఆర్థిక నేరస్థులు. వారి రహస్య సంపదలు వర్జిన్ ఐలాండ్స్‌లోను పెనామాలోను మారిషస్‌లోను అనంతపురంలోని రహస్య ప్రదేశంలోను స్విట్జర్‌లాండ్‌లోను ఇలా ఎనె్నన్నో ప్రదేశాల్లో ఉన్నాయి. ఇద్దరూ తీహార్ జైలులో కూర్చుని వచ్చారు. ఇప్పుడు ఆప్ అనే పార్టీ గెలిస్తే వీళ్లు స్వీట్లు పంచిపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోబాటు ప్రజలు పి.చిదంబరం, ఆనందశర్మ సాందీప్ దీక్షిత్ రాహుల్‌గాంధీ సోనియాగాంధీ రాబర్ట్ వద్రా, ప్రియాంక గాంధీల నాయకత్వాన్ని తిరస్కరించినట్లే ఇప్పుడు కపిల్‌సైబర్, అభిషేక్ సింగ్‌సింఘ్వి, మణిశంకర్ అయ్యర్‌లు నోరెత్తలేదు. ఐనా మిఠాయిలు ఎందుకు పంచిపెట్టుకున్నారు. బ్రాహ్మణులతోబాటు ఒకప్పుడు ముస్లిం లు, క్రైస్తవులు, దళితులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. మరి ఈ వర్గాలన్నీ కాంగ్రెస్‌కు దూరమై బిజెపికి-వివిధ ప్రాంతీయ పార్టీలకు దగ్గర అయినాయి. న్యూఢిల్లీలో ముప్పది శాతం ముస్లింలు ఒక శాతం క్రైస్తవులు ఉన్నారు. వారంతా అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేశారు.
కాంగ్రెసు ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు మహిళా నాయకురాలు షర్మిలా ముఖర్జీ ప్రకటించుకొని ప్రియాంక గాంధీపై నేరం పడకుండా చూచారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమే అని ప్రతాప్‌సింగ్ బజవా సమర్ధించుకున్నారు. ఇక కమ్యూనిస్టులయితే మరొక అడుగు ముందుకు పోయి ఇది మోదీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేక ఓటు- అని ప్రకటించారు. అంటే ఆర్టికల్ 370 రద్దు- ట్రిపుల్ తలాఖ్ రద్దు- అయోధ్య రామాలయం ఇవేవీ చైనా వర్గీయులు స్వాగతించటం లేదు అని సారాంశం. భారతదేశంలోని కమ్యూనిస్టులు ఇక మారరు. బిజెపికి సీట్లు తగ్గినా 40 శాతం ఓట్లు ఢిల్లీలో వచ్చాయి. మరి తాము మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో మొన్న ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చాయి?? సిద్ధాంతపరంగా కమ్యూనిజం పరాజితమైనా వారు ఒప్పుకోవటం లేదు. న్యూఢిల్లీ చుట్టుపక్కలవందలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి- వాటన్నింటినీ కూల్చివేయకుండా ‘రెగ్యులరైజ్’ చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చాడు. ‘మీరు కష్టపడ నక్కరలేదు ఉచితంగా అన్నీ మీ ఇంటికి చేరుస్తాను’ అన్నాడు. ఈ థియరీ సరైనదేనా? కాంగ్రెస్ పార్టీ డెబ్బది స్థానాలల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా గెలువలేదు సరికదా 63 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కొన్నికొన్ని నియోజకవర్గాలల్లో రెండువందలు మూడు వందలు- ఇలా ఓట్లు వచ్చాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటుకు పోటీచేసిన పనబాక లక్ష్మి, కిల్లికృపారాణి వంటి వారికి వందలలో ఓట్లు వచ్చాయి. అలా న్యూఢిల్లీలో జరిగింది. దీనిని చూచుకొని పి.చిదంబరం ఎందుకు సంతోషించాడో తెలియదు. నరేంద్రమోదీ మెతక వైఖరివల్లనే పి.చిదంబరం, శశిధరూర్, పినరాయ్ విజయన్, మమతాబెనర్జీలు పెట్రేగిపోతున్నారు. వీరంతా కరడుకట్టిన నేరస్థులు. ఐనా శిక్షలు లేవు. ఇదీ మన న్యాయవ్యవస్థ పద్ధతి. వాయిదాల మీద వాయిదాలు ఇలా దశాబ్దాలు సాగుతుంది. న్యూఢిల్లీ ఆప్ పార్టీ గెలిస్తే పాకిస్తాన్‌లో ఎందుకు ఇమ్రాన్‌ఖాన్ మిఠాయిలు పంచిపెట్టుకోవాలి?? ఇండియాలో హిందువులు ముస్లిములు కలిసి సహజీవనం చేయలేదా?? న్యూఢిల్లీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. కామన్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టాలి. మతం మార్పిడులు జరిగిన తర్వాత ఒక వ్యక్తి షెడ్యూల్ కులం పేరుతో ఆర్థిక రాయితీలు ఆరక్షణ (రిజర్వేషన్) పొందకుండా చూడాలి. తెలంగాణాలోని కాళేశ్వరం, ఎపిలో పోలవరం వంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాలి. ఎ.పిలో మూడు రాజధానుల వివాదంలో వెంటనే జోక్యం చేసుకోవాలి. బెంగాల్‌లోని మాల్దా జిల్లా ప్రాంతంలోని 2 కోట్ల మంది చొరబాటుదారులను బంగ్లాదేశ్ పంపించాలి. అస్సాంలో రోహింగ్యాలను మయన్మార్ పంపివేయాలి. చైనాతో అన్ని రకాల ఆర్థిక సంబంధాలు స్తంభింపజేసి అక్కడినుండి ఎవరినీ ఇండియాలోకి రాకుండా చేయాలి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై కేంద్రం మీద తిరుగుబాటు చేయాలని అనుకుంటున్నాయి. ఆలస్యం చేయకుండా సత్వర చర్యలు చేపట్టండి!!
14 క్రిమినల్ కేసులున్న మనీష్ శిశోదయా న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎలా అయినాడో ఆలోచించండి. మన ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సమూలంగా మార్చివేయాలి.
బెంగాల్‌లోని మమతాబెనర్జీ తెలంగాణలోని కెసిఆర్ మహారాష్టల్రోని శరత్‌పవార్, న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన రాహుల్‌గాంధీ కూడా తాము భారత ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది జరిగే పనేనా?? ఫెడరలిజం పేరుతో విజృంభిస్తున్న ప్రాంతీయ పార్టీల రెక్కలు కత్తిరించి కేంద్రాన్ని బలపరిస్తే తప్ప జాతీయ సమైక్యత సాధ్యంకాదు. 2012 గాంధీ జయంతినాడు అరవింద కేజ్రీవాల్ స్థాపించిన పార్టీకి నేటి పార్టీకి ఎట్టి సంబంధమూ లేదు. యోగేంద్రయాదవ్ వంటి వారెందరో కేజ్రీవాల్ క్రేజీ పోకడలను సహించలేక బయటకు వెళ్లిపోయారు. హర్యానాలో, పంజాబ్‌లో ఈ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. ఐతే న్యూఢిల్లీ విజయానికి కారణం మూకుమ్మడిగా కాంగ్రెస్ + ముస్లిం ఓటర్లు తమ ఓట్లను కేజ్రీవాల్‌కు బట్వాడా చేయటం. దీనిని రెలిజియస్ పోలరైజేషన్ అంటారు.
షాహిన్‌బాగ్ అల్లర్లను సమర్ధించినవారు, జెఎన్‌యులోని ఉగ్రవాదులు అరవింద కేజ్రీవాల్‌కు బహిరంగంగా మద్దతు నిచ్చారు. జామీయా మిలియాలోని మతోన్మాదులు కేజ్రీవాల్‌కు కార్యకర్తలుగా పనిచేశారు. ఇక బిజెపి విషయానికి వస్తే జాట్ వంటి కొన్ని కులాల ఓట్ల మీదనే ఆధారపడింది. హిందూత్వం వద్దు- ఫ్రీ మెట్రో ముద్దు అన్నారు ప్రజలు.
న్యూఢిల్లీ ఎన్నికల ప్రభావం బెంగాల్ మీద పడింది. మమతాబెనర్జీ ‘్ఫ’లు ప్రకటించటం మొదలుపెట్టింది. ఎందుకంటే 2021లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలయింది. అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పి.చిదంబరం ప్రకటనలను మహిళా నాయకురాలు శర్మిష్టముఖర్జీ ఖండించింది. ‘ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ తోక పార్టీగా బ్రతుకదలిస్తే ఇక పార్టీ కేంద్ర కార్యాలయం మూసివేసుకోవటం మంచిది’’ అని (12-2-2020) ఆమె ఘాటుగా పి.చిదంబరాన్ని విమర్శించింది.
అరవింద కేజ్రీవాల్ విజయం వెనుక ప్రశాంత కిశోర్ అనే వ్యూహ రచయిత ఒకడున్నాడు. ఇంకా కపిల్‌సైబాల్, అహ్మద్‌పటేల్, రాహుల్ విన్సీ వంటి కాంగ్రెస్ నాయకులు, ఏచూరి సీతారాం, రాజా, ప్రకాశ్‌కారత్, కన్నయకుమార్, ఢిల్లీ ఇమాం బుఖారీ వంటివారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పనిచేశారు. బిజెపి దాదాపు పది స్థానాలల్లో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే హిందువులు అనబడే ఈ నందులు పోలింగ్ బూత్‌లకు కదలడానికి మొరాయించారు. ఈ అలసత్వమే భారత జాతిని మళ్లీ పారతంత్య్రంలోకి దింపుతుంది.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్