సబ్ ఫీచర్

మద్యపాన నిషేధమే సామాజిక జీవనానికి మనుగడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక శాసనసభ్యుల మెజారిటీతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రలో భాగంగా ప్రజలకు నవరత్నాల ఎన్నికల నిబంధనలమేరకు మహిళలకు ఇచ్చిన హామీలలో భాగంగా మద్య నిషేధాన్ని అంచెలువారిగా అమలుపర్చడంలో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలను, పట్టణ, హైటెక్ సిటీలలో బార్లు సంఖ్యను కుదించడంలో సర్కారు ఫలప్రదమైందనే విషయంలో ఏమాత్రం సత్యం గోచరించడం లేదని విషయ పరిశీలకులు బాహాటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
మద్యపానం అలవాటువలన చిన్న, మధ్యతరగతి కుటుంబాలవారు ఆర్థికంగా అడుగంటిపోయి వీధినపడుతున్నారనే విషయం నగ్నసత్యమైనా, ప్రభుత్వంకానీ, వారి తరఫున విషయ విజ్ఞానాన్ని అందిస్తున్న అత్యున్నత అధికారుల భావనలు ఏమాత్రం సరికానివని విషయ పరిజ్ఞానం కలిగిన సామాజిక సంస్థల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం దుకాణాలు, బార్లు సంఖ్యలను తగ్గించినంతమాత్రాన మద్యం వినియోగదారుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని సామాజిక అధ్యయనంలో వెల్లడవుతున్నట్లు పలువురు సామాజిక కార్యకర్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మద్యం షాపులు, గ్రామాలలో అక్రమంగా వెలసిన మద్యం దుకాణాలు, బార్లు సంఖ్యను ప్రభుత్వం తమ అదుపాజ్ఞలతో తగ్గించగలిగారే కానీ, అక్రమ తయారీ సారాను నిరోధించలేక పోతున్నారనే బహిరంగ సత్యాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదనే విషయంపై సామాజిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్‌లు కానీ, వినియోగదారుల ఆర్థిక పరిస్థితికి సరిపోయే మద్యం ధరలు మితిమీరి ఆకాశాన్నంటుతున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సందట్లో సడేమియా అంటూ వివిధ లేబుళ్ళను అతికించి మద్యం తయారీదారులు 50 శాతానికి పైగా దండుకుంటున్నారని, మద్యం తయారీపై గానీ, బాటిళ్లలో అమర్చిన మద్యం ద్రవ్యంలో కానీ ఆల్కహాల్ సమర్థతపై అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడి జ్యూస్ ద్రవాల బాటిల్స్‌కు కూడా వివిధ పేర్లుతో లేబుళ్లు అతికించి అధిక ధరలకు విక్రయిస్తున్నా అడిగే నాథుడే లేడని వినియోగదారులు ఆక్రోశాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీనికంటే నూతన ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి ఉంటే వ్యసనపరులకు ఎంతో ఊరట కలిగి డబ్బువృధా, ఆరోగ్య పరిరక్షణను ప్రభుత్వం కలిగించే అవకాశం ఉండేదని వినియోగదారులు, ప్రజలు భావిస్తున్నారు.
మద్యం మత్తుకు అలవాటుపడి బానిసలైనవారు, మద్యం ధరలను భరించలేక, పల్లెపట్టులలో అక్రమసారా తయారీకి అలవాటుపడి, అనారోగ్యాలకు ఆలవాలమైన నాటుసారా తయారీకి వినియోగించే రసాయనిక ఎరువులైన యూరియా, తదితరాలు, వినియోగించిన బ్యాటరీ సెల్‌లు, కోళ్ల ఫారాలలో కోళ్లు విసర్జించిన రెట్ట, మత్తును కలిగించే మందుల షాపులలో విక్రయించే మత్తు మాత్రలను వినియోగించి, అప్పటికప్పుడే సిద్ధంచేసిన హాట్‌హాట్ నాటుసారా ధరల పరంగా తక్కువగా ఉండడంవలన గొంతుకలను త్రాగి త్రాగి మొదట కంటి చూపు, ఆపై నిస్సత్తువతో అనారోగ్యం, ఆకలి మందగించడం, అల్సర్, చక్కెర వ్యాధులు, రక్తహీనతతో పేద, మధ్యతరగతి మందుప్రియులు సంసారాలను చక్కదిద్దటం, పిల్లల ఆరోగ్యం, విద్య, వారి పురోగతిని వదలి మద్యం మహమ్మారికి బలై, వారు చావడమే కాకుండా కుటుంబాలకు, కుటుంబాలనే కడగండ్లు పాలుచేస్తున్నారని బాధిత కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యము, విద్య, వైద్య సదుపాయలు, సామాజిక సంక్షేమం, ఆకలి బాధల్ని తీర్చడం, సామాజిక న్యాయంచేకూర్చడం, భద్రత కల్పించాలి కానీ, అగమ్యగోచరమైన, అంచెలంచెల మద్యపాన నిషేధం విధించడంవలన మద్యపానప్రియులు, ప్రజలు త్రిశంఖు స్వర్గంలో పడి మత్తులో జోగిసలాడుతూ, మద్యం ఖర్చు భరించలేని ఆర్థికలేమితో, వ్యసనాన్ని వదులుకోలేని బానిసత్వంతో జీవిత గమనానే్న పణంగాపెట్టి, అనారోగ్యంతో, అయినవారికి దూరమై సంసారాలను దుర్భరంచేసి బ్రతుకులు చాలించడం ఏ ఆరోగ్య హేతువుకు, సమసమాజ హితానికి నిదర్శనమో ప్రభుత్వం, ఉన్నతాధికారులు దార్శనికతతో ఆలోచించి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే సమాజానికి ఆరోగ్యం, మానవ మనుగడకు హేతువుకాగలదని సామాజిక విశే్లషకులు భావిస్తున్నారు.

- దాసరి కృష్ణారెడ్డి