సబ్ ఫీచర్

ఇక చాలు మీ సారథ్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెహ్రూ గాంధీల సారథ్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదు, ఇది ఒకప్పటి మాట. పార్టీలోనే కాదు, మేథావులు, రాజకీయ విశే్లషకులు, సామాన్య ప్రజలు అందిరిలోనూ ఉన్న అభిప్రాయం. అందుకే, 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, గాంధీ నెహ్రూ కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి సూచించినా, సీనియర్లు ససేమిరా అన్నారు. ఆయన రాజీనామాను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు. నిజానికి, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఇంకా ఇతర కారణాలు ఉన్నప్పటికీ, రెండో చారిత్రిక ఓటమికి మాత్రం రాహుల్‌గాంధీనే కారణం. రాహుల్‌గాంధీ కారణంగానే పార్టీ ఘోరంగా ఓడిపోయిందనేది తిరుగులేని నిజం. ఆ పరాజయానికి మూల కారణం అయిన రాహుల్‌గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరుకున్నారు. ప్రాధేయపడ్డారు. అయినా, ఆయన అంగీకరించక పోవడంతో, అనివార్యంగా తాత్కాలికంగా బాధ్యతలు సోనియా గాంధీ నెత్తికి ఎత్తుకున్నారు. అందుకు కారణం.. కొందరు నాయకులు పనికట్టుకుని ‘్ఫ్యమిలీ లేనిదే పార్టీ లేదని’ సాగించిన ప్రచారం. సృష్టించిన భయం, భ్రమ.. అయితే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత ఆ భ్రమలు తొలిగి పోయాయేమో గానీ, పార్టీ అధ్యక్ష పదవిపై పార్టీ లోపల, వెలుపల చర్చ మొదలైంది. ‘్ఫ్యమిలీని పక్కన పెడితేనే పార్టీ బతుకుతుంది’ అనే కొత్త నినాదం ప్రచారంలోకి వచ్చింది. అయితే, సోనియాగాంధీ, ఆమె చుట్టూ ఉన్న కోటరీ మాత్రం పార్టీ అధ్యక్ష పదవిని చేజారకుండా వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీ పగ్గాలను మళ్ళీ రాహుల్ గాంధీకి అప్పగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మార్చిలో ముహూర్తం ఉంటుందని సోనియాగాంధీ సీనియర్లకు ఉప్పందించారు. మరోవంక రాహుల్‌గాంధీకి సీనియర్ల పొడ గిట్టడం లేదు. వాళళు ‘తనంత’ తెలివిగలవారు, మేధావులు కాదని ఆయన నమ్మకం. అలాగే, మరోవైపు నుంచి ‘దశమ గ్రహం’ రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రాను ముందుంచి పార్టీని, తన మెడకు చుట్టుకుంటున్న అవినీతి ఉచ్చునుంచి రక్షించే కవచంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి, 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ ఎందుకోసం, గాంధీ నెహ్రూ కుటుంబం వెలుపలి వ్యక్తి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుకున్నారో గానీ, ఇప్పడు పార్టీ మనుగడ సాగించాలంటే ఫస్ట్ ఫ్యామిలీ తప్పుకోవడం ఒక్కటే మార్గం, అదే మందు అనేమాట పార్టీలో బలం పుంజుకుంటోంది. పార్టీ పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి సోనియా కోటరీనే కారణమని, అ కోటరీ ప్రభావం నుంచి పార్టీ బయట పడాలంటే, కుటుంబం బయటి వ్యక్తి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అనివార్యం అని, పార్టీనే నమ్ముకున్న నేతలు, నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే, గతంలోనే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు కొంత ఉత్సాహం చూపిన, కేంద్రమాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ శశి థరూర్ ‘పార్టీ ఎదుర్కుంటున్న పెద్ద సవాల్ నాయకత్వ సమస్య’ అని కుండ బద్దలు కొట్టారు. ఫస్ట్ ఫ్యామిలీ నాయకత్వానికి కాలం చెల్లిందని చెప్పకనే చెప్పారు. అంతే కాదు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ నాయకత్వం, కుటుంబం చేతుల్లోంచి పార్టీ నాయకుల చేతుల్లోకి రావలసిన అవసరం ఉందని, అందుకోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తక్షణమే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుర్గతికి ఇంకా ఆనేక కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, ప్రధాన కారణం మాత్రం ఫస్ట్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ 2014లో సాధించిన (44సీ) చారిత్రక ఓటమికి సైతం ఫ్యామిలీ, కోటరీలే కారణం. చారిత్రక ఓటమికి ముందు పదేళళు అధికారంలో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్‌ను బొమ్మను చేసి గాంధీలు బాధ్యతలు లేని అధికారాన్ని చెలాయించారు. ఆ విధంగా సోనియా, రాహుల్‌గాంధీలు అవినీతికి పాల్ప డడం వల్లనే మన్మోహన్ ప్రభుత్వం ‘అవినీతి’కి పర్యాయపదంగా మారింది. ఫలితంగానే పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది అని పార్టీ నాయకులు అప్పుడు కాకపోయినా ఇప్పడు అంగీకరిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును ‘నానె్సన్స్’ గా పేర్కొంటూ రాహుల్ గాంధీ బహిరంగంగా చించి పారేశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని అనుకున్నారని అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూ వాలియా ఇటీవల ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పదేళ్ళలో జరిగిన ప్రతి కుంభకోణంలో ఫ్యామిలీ, కోటరీ ప్రమేయం ఉందని, పార్టీ నాయకులు కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. గుర్తించడం కంటే, గుర్తు చేస్తున్న సందర్భాలను గమనిస్తే, రాహుల్‌గాంధీకి మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీలోనే కాదు, రాజకీయ విశే్లషకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు ‘‘రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేకపోవడం ఒక్కటే పార్టీ దుస్థితికి కారణం కాదు, ఆయనకు, ఆయనేమిటో తెలియదు. దేశ చరిత్ర, పార్టీ చరిత్ర మాత్రమే కాదు కుటుంబ చరిత్ర కూడా తెలియదు. అందుకే ఆయన తనంతటి మేధావులను ఎంచుకుని చుట్టూ పేర్చుకున్నారు. ఈ ‘‘మేధావులు’ రాసిచ్చిన చెత్తంతా చదివేసి, ఆయన చిక్కుల్లో పడడమే కాదు, పార్టీనీ చిక్కులోకి నెడుతున్నారు’’ అని కొందరు విశే్లషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారం లో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ వేసిన చిందులు పార్టీని శిధిలదశకు చేర్చాయ. అయినా ఆయనలో మార్పు రాలేదు, ఇప్పటికీ చరిత్ర తెలుసుకోకుండా చిందులు వేస్తున్నారు. అందుకే పార్టీలో కొత్త నేత కోసం అనే్వషణ ప్రారంభమైంది. రాహుల్ రాజీనామాను వెంటనే ఆమోదించి, ప్రత్యాన్మాయ నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తే, ఢిల్లీ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి తప్పేదని సందీప్ దీక్షిత్ వంటి కొందరు నాయకులు బహిరంగంగానే పేర్కొం టున్నారు. అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేష్, మిలింద్ డియోరా వంటి నాయకులు పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ విషయంలో పార్టీ స్టాండ్‌ను తప్పు పట్టడమే కాదు, మారుతున్న ప్రజాభిప్రాయానికి అనుగుణంగా విధానాలను మార్చుకోకపోతే ముందు ముందు ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్ తదితరరాష్ట్రాల్లో ఢిల్లీ పరిస్థితి పునరావృతం అయితే, పార్టీ కోలుకోవడం అసాధ్యం అని పార్టీ నేతలు, విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం నాయకత్వ మార్పు. అదికూడా కంటి తుడుపు చర్యగా కాకుండా.. ఫస్ట్ ఫ్యామిలీ ప్రమేయం లేకుండా సంస్థాగతం, సిద్ధాంత పరంగా పార్టీని పునఃనిర్మించే ఆలోచన, ఆకాంక్ష, పట్టుదల ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా వాద్రా గాంధీ తెర మీద ఉన్నత వరకు హిందూ వ్యతిరేక లౌకికవాదం ముసుగులో సాగిన నెహ్రూల చరిత్ర, ఇందిరాగాంధీ నియంతృత్వ చరిత్ర, సోనియా, రాహుల్ కొనసాగించిన రాజీవ్‌గాంధీ అవినీతి చరిత్ర గుర్తుకొస్తూనే ఉంటుంది. నిజానికి, జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నట్లుగా, పాత వాసనలు వదలకనే కాంగ్రెస్ పార్టీ ఇలా దిన దిన ప్రవర్థమానంగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం. ఆ వాసనలు వదలాలంటే ఫస్ట్ ఫ్యామిలీ పక్కకు తప్పుకోవడం ఒక్కటే మార్గం. కాదంటే.. గాంధీ కన్న కల నిజమవుతుంది. కురు వృద్ధ పార్టీ కథ ముగుస్తుంది.

- రాజనాల బాలకృష్ణ, 9985229722