సబ్ ఫీచర్

ఇదేం సభ్యత... ఇదేం సంస్కృతి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదులకు ధన సహాయం అందకుండా ‘కట్టడి’ చేయడంలో పాకిస్తాన్ విఫలమైన కారణంగా ‘‘గ్రే లిస్టు’’లోనే కొనసాగించాలని పారిస్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర నిధుల మార్గాలపై కనే్నసి ఉంచి, ఆర్థిక చర్యలను తీసుకునే ఆక్షన్ కమిటీ (ఎఫ్‌ఏటిఎఫ్) మరోసారి సిఫారసు చేసింది. ఈ గ్రేలిస్టునుంచి బయటపడేందుకు పాకిస్తాన్ కొన్ని కంటితుడుపు చర్యలు తీసుకున్నా కమిటీ సంతృప్తి చెందలేదు. దాంతో ఎఫ్‌ఏటిఎఫ్ ఉపసంఘం పాకిస్తాన్‌ను గ్రేలిస్టులోనే కొనసాగించాలని సూచించింది. పాకిస్తాన్ పెట్టుకున్న ఎన్నో ఆశలపై ఈ సిఫారసు నీళ్లు చల్లినట్టయింది. వాస్తవానికి బ్లాక్‌లిస్టులో చేర్చుతారన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి.
ఈ విషయంలోనేగాక ఇంకా అనేక నకారాత్మక విషయాలలో పాకిస్తాన్ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తోంది.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారతదేశంపై విషం గక్కుతూ అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగిస్తూ అభాసుపాలవుతున్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుచేశాక ఇమ్రాన్‌ఖాన్ ఐక్యరాజ్యసమితి, తదితర వేదికలపై భారత వ్యతిరేక మాటల దాడికి పూనుకున్నారు. భారతదేశ అంతర్గత వ్యవహారమైన ఆర్టికల్ 370 రద్దు అంశం అంతర్జాతీయంచేసి లబ్ధిపొందాలని తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రతిచోట ఆయనకు నకారాత్మక స్పందనే ఎదురైంది. తాజాగా భారత పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)పై కూడా ఆయన అనేక వేదికలపై నుంచి విషం గక్కుతున్నాడు. సిఏఏను రద్దుచేయకపోతే ‘రక్తపాతం’ జరిగే అవకాశమున్నదని భవిష్యత్తులో పాకిస్తాన్ దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్నందున అంతర్జాతీయ సమాజం ముందుగానే కలుగజేసుకుని భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇమ్రాన్ పదే పదే వివిధ వేదికలపై కలవరిస్తున్నారు. సీఏఏ భారతదేశ ముస్లింలను ఉద్దేశించి తీసుకొచ్చారని, వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేందుకు ఆ చట్టంచేశారని, భారత ముస్లింలు పెద్దసంఖ్యలో పాకిస్తాన్ చేరుకుంటే తమ దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆయన మొసలికన్నీళ్లు కార్చారు. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కరడుగట్టిన జాతీయవాదిగా మోదీ వ్యవహరిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకుని ఆయనకు కళ్ళెంవేయాలని కోరుతున్నారు. బ్రిటీషు పార్లమెంట్‌లో సభ్యురాలి చేత ప్రచారం చేయిస్తున్నారు.
విచిత్రమేమిటంటే భారత ముస్లింల హక్కులగూర్చి గొంతు చించుకుంటున్న ఇమ్రాన్ తన సొంత దేశంలోని మైనార్టీల హక్కులను పాతాళానికి తొక్కేస్తున్నారు. ఆయనకు ఆ స్పృహలేకుండా మాట్లాడుతూ ఉన్నారు.
పాకిస్తాన్‌లోని కొందరు హిందువులు ఇటీవల తీర్థయాత్ర పేరిట భారత్‌కు వచ్చి తాము తిరిగి పాకిస్తాన్‌కు వెళ్ళమని, తాము భారతదేశంలోనే ఉంటామని, తమ గోడును వివిధ టెలివిజన్ ఛానళ్ళముందు వెళ్ళబోసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ జాతీయ టెలివిజన్ ఛానల్ పాక్‌నుంచి వచ్చిన అనేకమందిని పలుకరించింది. వారు వెల్లడించిన కష్టాలు... బాధలు వర్ణనాతీతం. పాకిస్తాన్‌లో తమను మనుషులుగా పరిగణించే సంస్కృతిలేదని, మతపరంగానేగాక అన్నిరకాల అణచివేతకు పాల్పడుతున్నారని ముక్తకంఠంతో వారు వెల్లడించారు.
ఆ బృందంలో చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) చదివే హిందూ యువతి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు పాకిస్తాన్‌లోనే ఉండిపోయి తమ కుమార్తెను మాత్రం భారత భూభాగంలోకి పంపారు. పాకిస్తాన్‌లో హిందూ-సిక్కు అమ్మాయిలను బలవంతంగా ముస్లింలు కిడ్నాప్ చేసి, పెళ్లిచేసుకుని మత మార్పిడి చేయించి, నానాహింసలు పెడుతున్న సంఘటనలు అసంఖ్యాకంగా జరుగుతున్నాయి. తమ కూతురు అలా కిడ్నాప్‌నకు గురై, దుండగుల బారినపడి మత మార్పిడికి గురై జీవితం నరకప్రాయం కాకూడదన్న ఉద్దేశంతో తమ బిడ్డను వారు భారత్‌కు పంపించారు.
కిడ్నాపైన అమ్మాయిల కుటుంబ సభ్యులు ఎదిరిస్తే, ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరించడమేగాక అన్నంత పని చేస్తున్నారని, అలా చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేయరని, కోర్టులో న్యాయం జరగదని, అక్కడి ప్రభుత్వం పూర్తిగా ఇస్లాం ప్రభుత్వం కావడంవల్ల హిందువులకు న్యాయం జరగదని, ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతున్నా పత్రికల్లో వార్త ప్రచురితంకాదని, టెలివిజన్‌లో విషయం ప్రసారంకాదని ఇట్లా మొత్తం పాకిస్తాన్ అక్కడి మైనార్టీలకు నరకం చూపిస్తోందని ఆ అమ్మాయి తన గోడు వెళ్ళబోసుకుంది.
ఆడపిల్లలను పాఠశాలకు పంపిస్తే అక్కడి నుంచి అపహరించుకుపోయే సంస్కృతి విచ్చలవిడిగా కొనసాగిందని, ఇప్పుడు ఇళ్ళలో నుంచి కూడా ఆడపిల్లలను అపహరించుకుపోయి మతాంతీకరణ చేయించి, వయసు మళ్ళిన మగవారికి అంటగడుతున్నారని వారు పేర్కొన్నారు. హిందు, సిక్కు ఆడ పిల్లలు గౌరవంగా బతికే అవకాశాలు పాకిస్తాన్‌లో లేవని, మైనార్టీలను కాఫిర్లుగా పిలుస్తూ అనేక విధాలుగా మానసిక హింసకు పాల్పడుతున్నారని, మతపరమైన ఉత్సవాలపై అనేక ఆంక్షలు విధించారని, దీపావళి జరుపుకోవాలంటే పోలీసులనుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ తీసుకున్నా ఏదో ఒక సాకుతో వేధించడం షరామామూలు అయిందని వారు వాపోయారు. మతపరమైన దౌర్జన్యం, అణచివేత ఇంతా అంతా కాదని, ఇస్లాంలోకి మారిపోవాలని ఒత్తిడి నిరంతరం తీసుకొస్తారని, మతం మార్చుకుంటే.. సౌకర్యాలు కల్పిస్తామన్న ఆశచూపుతారని, మార్చుకోమని మొండికేస్తే నరకం చూపుతారని, స్వేచ్ఛ, మానవ హక్కులు అన్న మాటకు పాకిస్తాన్‌లో అర్ధంలేదని వారు తమ గోడు వెళ్ళగక్కారు. మరణిస్తే దహన సంస్కారం చేసుకునేందుకు అడ్డంకులు సృష్టిస్తారని, హిందువుల పట్ల ద్వేషభావం అధికంగా ఉందని, మందిరాలు, గుళ్లు కూల్చేసి మానసిక క్షోభకు గురిచేస్తారని వారు వాపోయారు. ఇస్లాం మతం స్వీకరించినా ‘సుఖం’ లేదని, కనీసం ఓటుహక్కు సైతం లేదని, పాఠశాలకెళ్ళే ఆడపిల్లను, అరవై ఏళ్లు దాటిన వ్యక్తికిచ్చి వివాహంచేసి రాక్షసానందం పొందుతారని, హిందు తల్లిదండ్రులకు ఆడపిల్లగా పుట్టడం పాక్‌లో పెద్ద శాపంగా మారిందని వారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
అక్కడి నుంచి భారతదేశానికి రావడం మినహా తమకు మరో మార్గం లేదని, మరో హిందూ దేశం లేదు కాబట్టి తమకు భారత పౌరసత్వం కల్పించాలని వారు కోరుతున్నారు. ముస్లింలు ఒక దేశంగాకపోతే మరో దేశం వెళ్ళేందుకు 50 దేశాలు ఉన్నాయని హిందువులకు అలాంటి సౌకర్యం లేదని భారత ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించాలని వారు విజ్ఞప్తిచేస్తున్నారు. సిఏఏ వ్యతిరేక ఆందోళనకారులు తమ కన్నీళ్ళ గూర్చి తెలుసుకోవాలని, తమకు మరో మార్గంలేదని వారు అంటున్నారు.
ఈ గోడు... గోస... ఘోష పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గాని, మానవ హక్కుల గూర్చి మాట్లాడే పాక్ అనుకూల వ్యక్తులకుగాని పట్టదు. పాకిస్తాన్‌లో మైనార్టీల బతుకు చిత్రం ఎంత దుర్భరమో వారు పట్టించుకుంటున్న పాపాన పోవడంలేదు. భారతదేశంలో మైనార్టీ హోదా అనుభవిస్తూ అన్ని మర్యాదలు అందుకుంటూ, సౌకర్యాలు, హక్కులు అనుభవిస్తూ ఆందోళనల్లో పాల్గొంటూ తమకే తెలియని అన్యాయమేదో తమకు జరిగిపోతోందని, షాహిన్‌బాగ్ లాంటి ఆందోళనలకు ఊపిరిపోయడం ఎంత విడ్డూరం? పాక్‌నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థుల మాటలు... వారి గాథలు వింటే ‘‘ఇస్లాం’’పేర జరుగుతున్న ఘోరకలి తేటతెల్లమవుతున్నది. అటువైపు దృష్టిసారించక ఎంతసేపు భారతదేశాన్ని సైతం ఇస్లాం దేశంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తూ, ఆందోళనలు జరుపుతూ జిహాద్ పేర... ఆజాదీ పేర విద్వేషం చిమ్ముతూ, కలహాలకు ఊపిరిపోస్తున్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) పేర నీలి రంగు దుస్తుల ‘‘సైన్యం’’ తయారుచేసి కవాతు నిర్వహించడం ఎన్నికైన ప్రధాని మోదీని, హోంమంత్రిని బహిరంగంగా తులనాడుతూ, దుర్భాషలాడుతూ ముస్లిం ప్రజల్లో విద్వేష విషం నింపుతూ సభలు-సమావేశాలు నిర్వహిస్తూ, ఊరేగింపులు జరుపుతూ మొత్తం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. షార్జిల్ ఇమామ్, అతని అనుచరుడు దిల్‌నవాజ్ హుస్సేన్ ఇట్లా ఎందరో ముస్లిం యువకులు పగలు-రాత్రి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇస్తున్నారు. జిహాదీకి సిద్ధం కావాలని ముస్లింలకు పిలుపునిస్తున్నారు. దేశం మొత్తంగా ఈ విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. విస్తృత పరుస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని బహిరంగంగా పిలుపు ఇస్తున్నారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చేరవేస్తున్నారు. ఉద్రేకపూరిత ప్రసంగాలను ‘‘పోస్టు’’ చేస్తున్నారు. అమరులు అవ్వడానికి ముస్లిం యువత సిద్ధం కావాలని ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమం విస్తరింపజేయాలని, సీఏఏకు వ్యతిరేకంగా దేశాన్ని అతలాకుతలం చేయాలని, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని వారు విషం నూరిపోస్తున్నారు.
ఇప్పటికే కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, అస్సాం తదితర ప్రాంతాలలో ఈ ఉద్యమం వికృతరూపం బయటపడింది. దీన్ని దేశవ్యాప్తం చేసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వౌలానాలు మసీదులను స్థావరాలుగా చేసుకుని ‘‘ప్రయోగం’’ చేస్తున్నారు. హిందుస్తాన్‌ను పాకిస్తాన్‌గా మార్చాలన్నది వారి బలమైన ఆశ! మరి అది సమంజసమైన ఆకాంక్ష అవుతుందా?

- వుప్పల నరసింహం, 9985781799