సబ్ ఫీచర్

తల్లిదండ్రులే తొలి గురువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ ఉపాధ్యాయుడు ఉత్తమ విద్యార్థిని తయారుచేస్తాడు. మరి ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి, ఎవరు తయారుచేస్తారు? అతని తల్లిదండ్రులు మాత్రమే. చిన్నప్పటినుండి వారి తల్లిదండ్రులు, తమ పిల్లలను క్రమశిక్షణ, వినయవిధేయతలతో ఉండే సంస్కారవంతునిగా తయారుచేస్తారు. నేడు మనకు కనిపించే ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రపంచఖ్యాతి పొందిన మన దేశ నాయకులు ఇద్దరు. ఒకరు దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ కాగా, మరొకరు అబ్దుల్‌కలాం. వీరిద్దరూ తల్లిదండ్రుల వద్ద క్రమశిక్షణ, వినయ విధేయతలతో పెరిగి సంస్కారవంతులుగా తయారైనట్లు చెప్పుకున్నారు. వీరిద్దరూ ఉత్తమ ఉపాధ్యాయులేకాక ఒకరు ఆధ్యాత్మికవేత్త, మరొకరు శాస్తజ్ఞ్రాన పండితుడు. వీరిద్దరూ అనుక్షణం అలసటను పట్టించుకోకుండా దేశంకోసం, ప్రజలకోసం, భావితరాల విద్యార్థుల భవిష్యత్తుకోసం ఎంతో కృషిసల్పి కీర్తిశేషులయ్యారు. వీరిద్దరూ మన దేశ రాష్టప్రతులు.
వీరిద్దరూ ఉపాధ్యాయ వృత్తి ఎంత ఉన్నతమైనదో మనకు తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవప్రధానమైనదో తెలియజేసేందుకు గుర్తుగా సర్వేపల్లి రాధా కృష్ణన్ జన్మదినమైన 5 సెప్టెంబర్‌ను ఉపాధ్యాయ దినంగా పాటిస్తున్నాం. ఒక వ్యక్తిని ఉత్తముడిగా తీర్చిదిద్దటంలో ముఖ్యకారకులు వారి తల్లిదండ్రులు. పిల్లవాడికి మొదటి గురువు తల్లి. ఆమె పిల్లవాడికి నడక వచ్చేదాక, పోషణచేస్తూ సామాన్య జ్ఞానాన్ని అందజేస్తుంది. తరువాత నడక సమయం, మూడవ సంవత్సరం, తండ్రికి వప్పజెబుతుంది. ఆయన ఐదవ సంవత్సరంవరకు పుస్తకం జ్ఞానం కలుగజేస్తాడు. ఐదేండ్లకు పాఠశాలలోని ఉపాధ్యాయుడికి అప్పగిస్తారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఉత్తముడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాడు. కళాశాలలో ఆచార్యుడు జ్ఞానబోధ చేస్తాడు. ఇది సంప్రదాయం. అప్పుడు విద్యార్థి పూర్తిగా సంస్కారవంతుడవుతాడు. అంటే భవిష్యత్తులో వినయవిధేయతలు భక్తిశ్రద్ధలుగల వ్యక్తిగా మరో ఉత్తమ ఉపాధ్యాయుడిగా కానీ మరే సమా జ శ్రేయోభిలాషుడైన ఉత్తమ నాయకుడిగా అధికారిగా తయారుకావడానికి అప్పుడే బీజాలు పడతాయ.
ఎంత చదువుచదివినా సంస్కారంలేని చదువు వ్యర్థం అవుతుంది. గురువుల ఎడ, పెద్దల ఎడ, దైవం వద్ద, తల్లిదండ్రులవద్ద తల వంచటం సంస్కారం. వ్యక్తి ఏ అధికారంలో ఉన్నా సంస్కారవంతుడైతే అతనికి విద్యనేర్పిన ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడవుతాడు. విద్యార్థి ఉత్తముడిగా ఎదగటానికి ముఖ్య కారణం, వినయం. మన పురాణాలలో కూడా వినయం, భక్తిశ్రద్ధలుగల శిష్యు లే కీర్తిప్రతిష్టలు పొందారు. మనకు ఆరాధ్యదైవాలైనారు. అందులో ముఖ్యంగా ఆంజనేయుడు, నంది వీరిద్దరూ దైవం ఎడల గురువుల ఎడల భక్తిశ్రద్ధలు కలిగి ఉన్నారు.
ఆంజనేయుడు వినయ విధేయతలుగల వానరుడు. రామకార్యంలో శ్రద్ధ్భాక్తులు, రామపాద సేవలో మనకు కనిపిస్తుంది. దేవాలయాల్లో గానీ, శ్రీరామపట్ట్భాషేక పటాలలో గానీ, ఆయన రామపాదాలవద్ద రెండు చేతు లూ వుంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మరేచో ట గానీ పక్కకు తిరిగినట్లు కనిపించడు. ఆయన నిరంతర రామపాదసేవాదురంధరుడు. అతడు వినయం సహనంగలవాడు కనుకనే నిరంతరం పరిభ్రమించే సూర్యుని గురువుగా స్వీకరించి ఆయనతో పాటే తిరుగుతూ విద్యనేర్చుకున్నాడు. తన అద్భుతమైన మాట చతురతతో శ్రీరాముడి ఆలింగన భాగ్యం పొందగలిగి అదృష్టవంతుడైనాడు.
అదేమాదిరి వినయం సహనంగల వాడు నందీశ్వరు డు. ఆయన చూపుకూడా శివాలయంలో శివలింగం వైపే చూస్తూ ఉంటుంది. శివుడి దృష్టి మనపై పడాలంటే, నందీశ్వరుడి కొమ్ములు పట్టుకుని మధ్యగా చూస్తే దర్శనం అవుతుందని చెబుతారు. నందివున్నచోట నుండి శివలింగం ఉన్నచోట వీరిద్దరిమధ్య నడవవద్దని చెబుతారు. హను మంతుడు, నంది..వీరిద్దరూ హరిహరుల భక్తులు. ఎంతో శక్తివంతులు. వినయంతో భక్తిశ్రద్ధలతో ఉత్తమ ఆరాధ్య దేవతలుగా కీర్తిపొంది పూజింపబడుతున్నారు. చరిత్రలో ఛత్రపతి శివాజీ వీరోచితముగా కూడా మాతృపితృ గురువుదైవం ఎడమ భక్తిశ్రద్ధలతో వినయంతో సంస్కారవంతుడైనందున కీర్తిప్రతిష్టలు పొందాడు. హైం దవ జాతిని కాపాడాడు.
ఏ ఉత్తముడుకైనా మొట్టమొదటి గురువు తల్లి. తల్లి సంస్కారవంతురాలు, విద్యావంతురాలు అయతే పిల్లలు కూడా ఆ లక్షణాలను పుణికి తెచ్చుకొని పెద్దవారయ్యాక నైతిక నిష్టతో కూడిన జీవనాన్ని గడుపుతారు. అంతేకాదు తండ్రివద్ద నేర్చుకునే క్రమశిక్షణ వారు తమ జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉపయోగ పడుతుంది. వివిధ దశల్లో గురువుల వద్ద పొందిన విద్య విశాల దృక్పథాన్ని, సమాజ హితాన్ని పెంపొందిస్తాయ. తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న సంస్కారాలు, వీరిలో జ్ఞాన తృష్ణను, ప్రపంచం పట్ల వాస్తవిక దృక్పథాన్ని అలవరచు కునేవిధంగా చేస్తాయ.
పెద్దవారైన తర్వాత జీవితానుభవాలతో కూడిన స్వాధ్యా యం వ్యక్తుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. నలుగురికి మార్గదర్శకులయ్యేంతటి సంస్కారాన్ని పెంపొందింప జేస్తుంది. భారతీయ సంస్కృతిలోని గొప్పదనం ఇదే. భారత్‌లో జన్మించిన ఎందరినో ఇక్కడి సంస్కృతి ఉత్త మమైన సామాజిక చోదకులుగా తీర్చిదిద్దింది. అహింస, సహనం, నిస్వార్థం, నైతికనిష్ఠ వంటి ఉత్తమ లక్షణాలను పుణికితెచ్చుకున్న ఈ మహాత్ములు దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలిపారు.
ప్రపంచానికి అహింసను బోధించిన పవిత్ర భూమి మనదే. హింస, జంతుబలులు వంటివి మనసును కలచి వేయగా గౌతముడు నిండు వయసులో భార్యను వదలి సన్యాసాన్ని స్వీకరించి, సామాజ శ్రేయస్సుకోసం ఎంతగా నో శ్రమించి అహింసా మార్గాన్ని బోధించాడు. సామా న్యులకు కూడా అర్ధమయ్యే భాషలో అహింను బోధించి ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. ఎందరినో మంచి పథంలోకి నడిపాడు. అహింసకు విశ్వగురువుగా నిలి చాడు. తర్వాత కొన్నివేల సంవత్సరాలకు మహాత్ముడు జన్మించి అహింసను బోధించి, ఆచరించి దేశానికి స్వాతం త్య్రం తెచ్చిపెట్టాడు. శంకరాచార్యుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు, తులసీదాస్ వంటి ఎందరో మహాను భావులు మనదేశాన్ని తమ బోధనలతో పావనం చేశా రంటే అది మన సంస్కృతిలోని గొప్పతనం మాత్రమే. తల్లి, తండ్రి, గురువు అనే ఈ ముగ్గురు కనిపించే దైవా లుగా భావించే సంస్కృతి మనది. అటువంటి ఈ గడ్డపై ఉత్తములు ప్రభవించారు. పునీతం చేశారు.

- జె. ప్రసాదరావు