సబ్ ఫీచర్

వీరిది డిజిటల్ త్రయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం పెరగడమేగాక బలం కూడా పెరిగింది. టెక్నాలజీ రంగంలో, పరిశోధనల రంగంలో అగ్రదేశంగా ఉన్న అమెరికా అండగా ఉంటే భారత అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో మానవాభ్యుదయం ఆధునిక టెక్నాలజీపై ఆధారపడి ఉందన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ట్రంప్ సమక్షంలో పేర్కొన్నారు. వేగంగా మారుతున్న భారతదేశంలో అమెరికాకు మంచి అవకాశాలున్నాయని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. ‘మేడిన్ ఇండియా’ నినాదం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నది. ఇందులో భాగంగా పరిశోధన- అభివృద్ధి రంగంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలున్నాయని ప్రధాని గుర్తుచేశారు.
21వ శతాబ్దంలో ప్రపంచ గమనం ఎలా ఉభయ దేశాల మధ్య సహకారం, భాగస్వామ్యంపై ఆధారపడి ఉందో మోదీ కీలక వ్యాఖ్య చేశారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం, సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొనడం, స్నేహశీలతతో వ్యవహరించడంతో అనేక ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. దీర్ఘకాలిక దార్శనికతతో అడుగులువేస్తూ, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకుంటూ ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి- పురోగతికోసం పాటుపడేందుకు నిశ్చయించారు. శంఖులో పోస్తేగాని తీర్థం కాదన్నట్టు భారతదేశ ప్రగతిని ట్రంప్ నోట వింటే వాస్తవమని భావించినవారూ కనిపిస్తారు. భారత్ 27 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించిందని, ప్రతి గ్రామానికి విద్యుత్ అందుతోందని, 32 కోట్లమంది భారతీయులు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని, జాతీయ రహదారుల నిర్మాణ వేగం పెరిగిందని, 7 కోట్ల గృహాలకు వంటగ్యాస్ లభిస్తోందని, 60 కోట్ల మంది వ్యక్తిగత పారిశుద్ధ్య సౌకర్యం పొందుతున్నారని, ప్రతి నిముషానికి 12 మంది భారతీయులు పేదరికం నుంచి విముక్తి పొందుతున్నారని ట్రంప్ ప్రశంసించారు. ఈ సకారాత్మక అంశాన్ని పసిగట్టక కొందరు ప్రతిఘటనోద్యమాలతో, ఉద్రిక్త పరిస్థితులను ప్రోత్సహించడం దారుణం. భారత సమర్థతను, శక్తిసంపన్నతను, సకారాత్మక వైఖరిని, సాంకేతిక అభివృద్ధిని, ప్రపంచంతో కలిసి బలమైన అడుగులు వేస్తున్న దృశ్యాన్ని తిలకించేందుకు తిరస్కరించడంలో ఇసుమంతైన అర్థం లేదు.
ప్రధాని మోదీ నాయకత్వంలో సంస్కరణలు వేగవంతమయ్యాయని, మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పెరగడం ఎంతో స్ఫూర్తిదాయకమని ట్రంప్ అన్నారు. భారత్ - అమెరికాల మధ్య సహజసిద్ధ దీర్ఘకాల మైత్రి కొనసాగుతోందని చెప్పారు. మోదీ అసాధారణ రాజకీయనాయకుడిగా, దేశంకోసం రాత్రింబవళ్లు పనిచేసే నాయకుడాయన అని కితాబునిచ్చారు. సాధారణస్థాయి నుంచి ప్రపంచస్థాయి నాయకునిగా ఎదగడం ప్రశంసనీయమన్నారు. ప్రపంచంలో అనేక ఆశల్ని, ఆకాంక్షల్ని రేకెత్తిస్తోన్న ఆర్థికవ్యవస్థగా భారత్ ఉబికివస్తోందని, తాము రక్షణ భాగస్వామిగా ఉంటామని ఉగ్రవాదంపై, ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఓ సరికొత్త అధ్యాయంగా నిలిచింది. అదే రోజు ముంబయిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఓ కార్యక్రమంలో కలిసి మాట్లాడారు. దేశ ఆర్థికరంగంపై వారు ఆలోచనలు పంచుకున్నారు. వచ్చే పదేళ్ళలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందుతుందని, డిజిటల్ రంగంలో భారత్ రారాజుగా తన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా డిజిటల్ మయవౌతున్న నేపథ్యంలో భారత సాంకేతిక నిపుణుల చొరవ, నైపుణ్యంతో ఆర్థికవ్యవస్థ అనూహ్యంగా పుంజుకోగలదని ముఖేశ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మొబైల్ నెట్‌వర్క్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా భారతదేశంలో మొబైల్ టెక్నాలజీ వికసించిందని ముఖేశ్ చెప్పారు.
1992లో 300 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థికవ్యవస్థ 2020 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరడం అద్వితీయమని ఆయన గుర్తుచేశారు. భారత వ్యాపారవేత్తలు సొంత సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి పరచుకోవాలని సత్య నాదెళ్ళ సూచించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకుని అగ్రభాగానికి ఎదగాలన్నారు. సమర్థత పెరిగేందుకు, సాధికారత సాధించేందుకు డిజిటల్ టెక్నాలజీ అందరికీ అవసరమని గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్ తన నైపుణ్యాన్ని మధ్య, చిన్న తరహా వ్యాపారస్తులతో పంచుకునేందుకు, వారివద్ద ఉన్న సాంకేతికతను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఓవైపు అహ్మదాబాద్‌లో ట్రంప్ ఉత్సాహపూరిత ప్రసంగం, చారిత్రాత్మక ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమం కొనసాగుతుండగా ఇటు ముంబయిలో ప్రభావశీలురైన ఇద్దరు ప్రముఖులు ఒక కార్యక్రమంలో అభిప్రాయాలను పంచుకోవడం ఉత్ప్రేరకాన్ని అందించింది.
ప్రధాని మోదీ ఐదు సంవత్సరాల క్రితం ప్రకటించిన ‘డిజిటల్ ఇండియా’ పథకంతో స్ఫూర్తిపొంది ముఖేశ్ అంబానీ ‘జియో’కు ప్రాణప్రతిష్ట చేసిన సంగతి అందరికీ తెలుసు. ఆ జియో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటే తప్పు అవదు. 4జీ టెక్నాలజీ పల్లెల్లోకి సైతం తీసుకెళ్ళి డేటా వినియోగం పెంచిన ఘనత జియోకే దక్కుతోంది. కోట్లాదిమంది ప్రజలు ఆధునిక టెక్నాలజీ ఆధారంగా, చౌక ధరలతో డేటా వినియోగిస్తున్నారు. ఇదొక గొప్ప విప్లవంగా ముఖేశ్ అభిప్రాయపడ్డారు.
పెరిగిన.. పెరుగుతున్న సామర్థ్యం, సాధికారతతో ఎందరో తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారని దాంతో ఆర్థికశక్తి పెరుగుతోందని ఆయన అన్నారు. 2020వ సంవత్సరంలో ఈ దశాబ్దంలో సరికొత్త రికార్డులను భారత్ సృష్టించబోతోందని ఆ రకంగా బలమైన ఆర్థికశక్తిగా ఎదగగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. బహుళ జాతి సంస్థల సీఈఓలుగా భారత సంతతివారు పనిచేయడం, దాని స్ఫూర్తితో అనేకమంది తమ సృజనాత్మకను ప్రదర్శిస్తూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు.
కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, తదితర టెక్నాలజీలతో ప్రజాజీవనం శరవేగంగా రూపాంతరం చెందుతోందని, డిజిటల్ ఎకానమీ విస్తృతం కానున్నదని అందులో భాగంగా అనేక ఆవిష్కరణ జరుగుతాయని అవి ప్రజాజీవనాన్ని కమ్మేస్తాయని, ప్రజల జీవనం ఇప్పటికన్నా అనేకరెట్లు మెరుగ్గా ఉంటుందని, గత పాతిక సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికన్నా వచ్చే ఐదు - పది సంవత్సరాలలో చోటుచేసుకోనున్నదని, బ్లాక్‌చైన్ లాంటి సాంకేతికతో పారదర్శకత పెరగనున్నదని, ఏవిధంగా చూసినా అన్నిరంగాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని దాంతో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరుగగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
ముఖేశ్ అంబానీ కేవలం పారిశ్రామిక వేత్తనేగాక, ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక నిపుణులతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి, బిల్‌గేట్స్, స్టీవ్ సమకాలికుడు కావడం గేట్స్‌తో మంచి పరిచయం ఉండటంవల్ల ఆగామి సాంకేతికత ఏ మలుపు తీసుకోబోతోందో ఊహించగలుగుతున్నారు. తన ఆలోచనల్ని నిపుణులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన లైఫ్ సైనె్సస్‌లో సాంకేతికత ఆధారంగా సరికొత్త ఆవిష్కరణలకోసం ఆయన బృందం పనిచేస్తోంది. పెట్టుబడిదారుడని వామపక్షవాదులు నిందాపూర్వకంగా మాట్లాడినా ఆయన దృష్టికోణంలో దేశం ఆర్థికంగా ఎదగాలన్న అభిలాష అపారంగా కనిపిస్తోంది. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నందువల్లనే తన పరిశ్రమలను సరైన దారిలో నడిపిస్తున్నారు. ఉద్యోగితను పెంచుతున్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై, సదస్సుల్లో ఆయన ప్రసంగాలు విస్తుపోయేలా ఉంటాయి. రెండు దశాబ్దాల ముందుచూపుతో ఆయన పథకరచన చేయడం గొప్ప విషయం. తాజాగా ట్రంప్‌తో కలిసినవారిలో ఆయన ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా నరేంద్రమోదీ డిజిటల్ ఆలోచనలను తన శక్తిమేరకు ఆచరణలో పెట్టేందుకు ముఖేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయనను దగ్గరగా పరిశీలించినవారు చెబుతారు. దేశాభివృద్ధి విషయంలో వారిద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపిస్తోంది. ట్రంప్ పర్యటనతో వీరిద్దరిలో మరింత ఉత్సాహం, ఉత్ప్రేరకం చూడొచ్చు.

- వుప్పల నరసింహం, 9985781799