సబ్ ఫీచర్

అల్లర్లు - అభివృద్ధి నిరోధకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశమంతటా అగ్నిగుండంగా మారింది. ఎటు చూచినా అల్లర్లే- ఆందోళనలే పోలీసు కాల్పులే- ఐనా దేశం ఈ నష్టాన్ని భరించింది. స్వరాజ్యంకోసం ఎన్నికష్టాలనైనా, నష్టలనైనా భరిస్తాము అన్నారు. జలియన్‌వాలాబాగ్‌లూ, మనె్నం తిరుగుబాట్లు, పెదనందిపాడు సత్యాగ్రహాలు, ద్రవిడోద్యమాలు జాతి జీవనాడులను ధ్వంసం చేసింది. తెలంగాణలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటాల వల్ల రజాకార్ల రాక్షస కృత్యాల వల్ల వేలాదిమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ధోరణి ఆగలేదు. 1947 స్వాతంత్య్రం వచ్చినా ప్రత్యేక రాష్ట్రంకోసం అల్లర్లు, ఆంధ్రప్రదేశ్ అవతరణ ముందు అల్లర్లు, తెలుగుజాతిని విభజించాలని మళ్లీ అల్లర్లు- రాజధానిని అమరావతి నుండి తరలిస్తుంటే అల్లర్లు, బ్రహ్మానందరెడ్డిని గద్దె దించటంకోసం చెన్నారెడ్డి చేసిన ఉద్యమంలో 500 మంది సామాన్యులు పోలీసు కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1500 మంది అసువులు బాశారు. నిన్న ఆర్‌టిసీ కార్మికుల సమ్మెలో పాతిక మంది పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (్ఫబ్రవరి 2020) మళ్లీ నిప్పుల కుంపటిలా మారింది. తెరవెనుక పరదాల చాటున గౌరవంగా బ్రతికే మహిళలు నడిరోడ్డుమీద వంటవార్పు చేస్తున్నారంటే అందుకు ఇటు కేసీఆర్ అటు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలి. ఫిబ్రవరి 24, న్యూఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు వస్తే ఢిల్లీకి నిప్పుపెట్టారు. ఈ పని చేయించింది షాహీ ఇమాం అబ్దుల్లా బుఖారీ, అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ విన్సీ, ఏచూరి సీతారామయ్య, మణిశంకర్ అయ్యర్, కపిల్ సైబల్, ప్రశాంత్ కిశోర్‌లు- దీనిని ప్రజాస్వామ్యం అనే అంటారా?
ఆంధ్రప్రదేశ్ అనాథ రాష్ట్రంగా మారిపోయింది. అభివృద్ధి స్తంభించిపోయింది. వంగవీటి మోహన్‌రంగా హత్య సందర్భంగా విజయవాడను తగలబెట్టారు. ఇప్పుడు అమరావతి ఎందుకు మండుతున్నది? భైంసా ఎందుకు తగలబడింది? చత్తీస్‌గఢ్‌లో నిరంతరం ఎందుకు నరమేధం జరుగుతున్నది? చెన్నైలో జర్నలిస్టు గురుమూర్తి మీద స్టాలిన్ ఎందుకు దాడి చేశాడు?
‘‘మామిడి’’లో నివాసముండే నరుూం ఒక వ్యక్తికాదు. ఒక రాక్షస వ్యవస్థ- తాచుపాముల్లా బుసకొడుతూన్న అక్బరుద్దీన్‌లూ, అసదుద్దీన్ ఒవైసీలూ, కన్నయ్యకుమారులూ, హార్థిక్‌పటేల్, జిగ్నేశ్‌మెమానీలూ తిరుగుతుంటే మహాఘనత వహించిన ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలను రాజ్యాంగ వ్యవస్థల మీద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతున్నది- సరిగ్గా ఇదే మన శత్రుదేశాలు ఆశిస్తున్నారు. ఎక్కడ అల్లర్లు జరిగినా ముందుగా పోలీసులు బలవుతున్నారు. మొన్న జమియా అల్లర్లల్లో ఒక పోలీస్ కన్ను పోగొట్టుకున్నాడు. నిన్న ఈశాన్య ఢిల్లీలో రతన్‌లాల్ అనే కానిస్టేబుల్‌ను అల్లరి మూకలు దహనం చేశాయి. పోలీసులు మనుషులు కారా? వారికి భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఉండవా? పోలీసుల దమనకాండ నశించాలి అంటూ భారత్ బంద్‌లకు పిలుపులనిచ్చే వామపక్షాలపై కేంద్రం ఎందుకు నిషేధం విధించలేదు? ఇండియా మన కళ్లముందే మరొక సిరియాలాగా మరొక గాజాపట్టీ - పాలస్తీనా లాగా మరొక జాఫ్నాలాగా మారిపోయింది.. వీటిని భరించండి- టి. సతీశ్‌కుమార్ హలలూయలు వింటూ నిద్రపోండి!
మరో విషయం!
ఒక్క అమరావతి ముఖానే్న పొద్దుపొడిచిందా?
అధికార వికేంద్రీకరణ ఇతర రాష్ట్రాలకు వర్తించదా?
దశాబ్దాలుగా నాగపూర్ రెండవ రాజధాని కావాలనే ఉద్యమం నడుస్తున్నది- మధురై రెండవ రాజధాని కావాలని తమిళనాడులో ప్రజలు కోరుకుంటున్నారు. వారణాసి రాజధానిగా తూర్పు ఉత్తరప్రదేశ్ ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు. ఇవేవీ లేదు- అమరావతి, విశాఖ, కర్నూలు అనే ఈ ప్రతిపాదన ఏమిటి? ఇది ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి నాందీ గీతం అవుతుంది. ఇప్పుడు కేంద్రం తప్పించుకోజాలదు. వెంటనే జోక్యం చేసుకొని తెలుగు జాతిని రక్షించండి. లేకుంటే తెలుగుజాతి తెలుగు భాష సరీసృపాలవలె గత చరిత్ర అవుతుంది.
ఢిల్లీలో జఫ్రాబాద్, యమునా విహార్ ఇత్యాది ప్రాంతాలలో 30 మంది (పోలీసులతో సహా) ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య పెరుగుతున్నది. 135 మంది గాయాలతో హాస్పటల్లోనూ చేర్చబడ్డారు. 100కు పైగా వాహనాలు దహనమైనాయి. 35 గృహ దహనములు జరిగాయి. 80 షాపులు పరశురామ ప్రీతి చేయబడ్డాయి. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేశారు. ఇదంతా ఎందుకు జరిగింది? అతిథిగా వచ్చిన ట్రంప్ చూడాలని, ఈ దుర్మార్గులు భారతీయులేనా?
వారిస్ పఠాన్ ఇలా అన్నాడు.
‘‘15 కోట్ల మంది ముస్లిములు సంఘటితమైతే నూరు కోట్ల మంది అసంఘటిత హిందువులను ఇండియా నుండి తరిమివేయగలము’’. ఢిల్లీలో ఒక మసీదు దగ్ధమయిందని పుకారు వ్యాపింపజేసినదెవరు? సంజయ్ నిరుపమ్ కావచ్చు, అసదుద్దీన్ (ఎంఐఎం) కావచ్చు. షంషీద్ (సీపీయం) కావచ్చు, ఇమాం బుఖారీయే కావచ్చు. ఎవరో ఇనె్వస్టిగేషన్‌లో తేలుతుంది. పాకిస్తాన్ బహిరంగంగా ఇండియాపై యుద్ధం ప్రకటించింది. ‘ఒక మసీదును ధ్వంసం చేశారు’ అనే అసత్య వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేసిందెవరు? వారిపై చర్యలేమిటి?
27 ఫిబ్రవరి నాటికి కాల్పుల్లోను రాళ్లు రువ్వటంవల్లనూ మరణించిన వారి సంఖ్య 40 దాటింది. దీనికి రాహుల్‌గాంధీ, ఒవైసీ, ఏచూరి సీతారాం, కేజ్రీవాల్, ప్రశాంత్ కిశోర్ బాధ్యత వహిస్తారా? జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులను ఎదుర్కొన్న శ్రీవాత్సవ అనే పోలీసు అధికారి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గమనింపవలసిన మూల సూత్రం ఒకటి ఉంది. ఈ దేశంలో కొన్ని వర్గాలకు భారతదేశం అభివృద్ధి చెందటం ఇష్టం లేదు. అందుకని వాళ్లు దేశానికి నిప్పుపెడుతూ ఉంటారు. ఇదే దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాము.
ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే మరొకడు చుట్టముట్టించుకున్నాడని తెలుగులో సామెత. శవ రాజకీయాలు జరపటం మన వారికి పరిపాటియే. ఇందిరాగాంధీ మరణం ప్రచారం చేసుకొని రాజీవ్‌గాంధీ భారీ మెజారిటీ తెచ్చుకోవటం, శవ రాజకీయం అంటారు. న్యూఢిల్లీలో శ్రీమతి సోనియాగాంధీ ఇటీవల (26-2-2020) మాట్లాడుతూ ఢిల్లీ అల్లర్లను బాధ్యత వహించి హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలి అనటం శవ రాజకీయాలు కావా? నిజానికి ఈ అల్లర్లు రాహుల్‌గాంధీ, గులాం నబీ ఆజాద్‌లు సృష్టించినవే. వారిపై అమిత్‌షా తక్షణమే చర్య తీసుకోవాలి.
1984లో ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేశారు? పైగా సజ్జన్‌కుమార్, జగదీశ్‌టైట్లర్, కమలనాథ్ వంటి కాంగ్రెస్ నాయకులే ఈ సిక్కులను నడిరోడ్డులలో చంపించారు. వారిని తర్వాతి కాలంలో శ్రీమతి సోనియాగాంధీ మంత్రులను చేసింది!
మహమ్మద్ హుస్సేన్ ఆప్ పార్టీ నాయకుడు అంకితశర్మ అనే పోలీసు(నిఘా) విభాగానికి చెందిన వ్యక్తిని చంపి కాలువలో పడేశాడు. ఇప్పుడు అర్థమయింది కదా ఢిల్లీ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో? ఇంత జరిగినా కేజ్రీవాల్, మనీష్ శిశోదయా (సీఎం- డిప్యూటీ సీఎం) తమ ఎయిర్ కండిషన్డ్ గదులలో నుండి బయటకు రాలేదు!
ఢిల్లీ అల్లర్లల్లో తప్పెవరిది?
కాంగ్రెస్, బీజేపీ ఆప్ కమ్యూనిస్టు వర్గాలు టీవీ ఛానల్స్‌లో పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఎవరు ఎంత అరిచినా ఇదొక కంఠశోష- శుంఠ ఘోష-
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా (2020) ఉన్నప్పుడు ఢిల్లీలో అల్లర్లు జరిగాయి కాబట్టి బాధ్యత బీజేపీ వహించాలి అని శ్రీమతి సోనియాగాంధీ (26-2-2020) ప్రకటించింది. మరి 1984లో ఢిల్లీలో 4000 మంది సిక్కులను చంపించింది స్వయంగా ఆమె భర్త రాజీవ్‌గాంధీయేనని చరిత్ర సాక్ష్యమిస్తున్నది. తప్పు కాంగ్రెస్‌ది కాదు బీజేపీది కాదు భారత ప్రజలది. ఎవరీ ఆంటోనియోమైనో, స్వతంత్ర భారతంలో కూడా ఇండియాను ఇటలీ పాలించాలా? హైదరాబాదులో ఒకాయన డొనాల్డ్ ట్రంప్‌కి, మరొకాయన సోనియాగాంధీకి గుడులు కట్టారు.
ఇదేమిటి?
‘‘అమెరికా అధ్యక్షాయనమః’ అని అష్టోత్తరాలు- ‘‘రాహులప్రియ మాత్రేనమః’ అని శతమానాలు..
తప్పెవరిది? బానిస బుద్ధులుగల భారతీయులది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణజిత్‌సింగ్ సుర్జీవాలా ఇటీవల (27-2-2020) నాడు మాట్లాడుతూ ఢిల్లీ హైకోర్టు జడ్జిల మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? కమ్యూనిస్టులు మరొక అడుగు ముందుకువెళ్లి.. ట్రంప్ ముందు మోడీ ప్రభుత్వం కావాలనే ఈ అల్లరను సృష్టించి ముస్లిములను తీవ్రవాదులుగా చిత్రీకరించిందే అని వ్యాఖ్యానించారు. దీనికి భారతజాతి ఎలా స్పందిస్తుందో చూడాలి..

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్