సబ్ ఫీచర్

రాజ్యాంగ విలువలు - శాస్ర్తియ దృక్పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖండ భారతదేశంలో కోట్లాది ప్రజల అధిశాసన గ్రంథంగా ‘్భరత రాజ్యాంగం’ అమల్లోకిరావడంతో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించడం జరిగింది. రాజ్యాంగం అనే గ్రంథంలో భారతీయ పరిపాలన వ్యవస్థను స్పష్టంగా లిఖింపచేసి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే గొప్ప విలువలను భారతీయ పౌరులకు అందించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌గారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనంచేసి భారతీయుల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమమైన విలువల కలయికతో రాయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో భారత రాజ్యాంగం వైవిధ్యమైన వ్యవస్థల సమాహారంతో విశిష్టలక్షణాల కలయికతో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గ్రంథస్థం కాబడిన ఒక సమున్నత గ్రంథం. రాజ్యాంగం అనే గ్రంథం చారిత్రకంగా సృష్టించిన మానవ నిర్మిత అడ్డుగోడలైన కుల, మత, భాష, ప్రాంతం మరియు లింగ బేధాలను కూకటివేళ్ళతో పెకలించి కోట్లాది ప్రజలకు విముక్తి కల్పించింది. దేశ తలరాతనుమార్చే ‘ఓటుహక్కు’అనే ఆయుధం ద్వారా దేశంలోని పౌరులందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలతోపాటు దేశ సంపదను సమానంగా పంచాలని ఆదేశిస్తూ, హక్కులను, బాధ్యతలను సమపాళ్ళలో పంచిన సమున్నత గ్రంథం. పార్లమెంటరీ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజనతో భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగినది. తద్వారా రాజ్యాంగం అనే గ్రంథం ‘‘నవమాసాలు మోసిన తల్లి ప్రసవించిన వెంటనే మనల్ని నమోదుచేసుకుని 90 ఏళ్లపాటు తన భుజాలకెత్తుకొని రక్షణ కల్పిస్తున్న అది శాసన గ్రంథం’’గా వ్యవహరించడం జరుగుతుంది.
రాజ్యాంగం అమల్లోకివచ్చి 71 వసంతాలు పూర్తయినప్పటికీ రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలుకునోచుకోక ‘రాజ్యాంగ విలువలు’ అనేక రూపాలలో ఉల్లంఘనకు గురికావడం విచారకరం. కోట్లాది ప్రజల రాజ్యాంగ హక్కులైన నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు నోచుకోక, ఆత్మన్యూనతతో జీవిస్తూ రోడ్డునపడుతున్నారు. రాజ్యాంగం సాక్షిగా అధికారపీఠం ఎక్కిన పాలకవర్గం రాజ్యాంగం కల్పించిన అవకాశాలను సామాన్య ప్రజానీకానికి ఆశించిన స్థాయిలో అందించక రాజ్యాంగ వౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తూ, రాజ్యాంగ విలువలపై దాడి చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా కోట్లాది ప్రజల రెక్కలకష్టాన్ని పన్నుల రూపంలో వసూలుచేసిన వేల కోట్లు రూపాయల సొమ్మును కార్పొరేట్ వర్గాలకు రాయితీలిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలకోసం తూతూ మంత్రంగా లక్ష్యాలకు తిలోదకాలిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను పరోక్షంగా బలహీనపరచే విధంగా ఉంటున్నాయి. రాజ్యాంగ ఉన్నత విలువలైన స్వేచ్చ, సమానత్వం, సోదరభావం కాపాడాల్సిన ప్రభుత్వాలు వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తూ కులాల, మతాల, వర్గాల మధ్య విద్వేషభావాలు పెంచి పోషిస్తున్నారు. ప్రజలు ఎజెండా ఆధారంగా జరగాల్సిన ఎన్నికలు ప్రజల భావోద్రేకాలతో, ప్రలోభాలకు గురిచేస్తూ జరుగుతున్నాయి.
రాజ్యాంగ విలువలతోపాటు శాస్ర్తియ దృక్పథంపై కూడా అనేక రూపాలలో దాడి జరుగుతుంది. తద్వారా నేటి శాస్తస్రాంకేతిక యుగంలో సైన్స్‌లో అంతర్భాగమైన సమాజం సైన్స్‌కు దూరమవుతూ మూఢత్వభావాలను విశ్వసించడం జరుగుతుంది. ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూ మానవ ప్రగతికి మూలకారణమైన ‘విజ్ఞానశాస్త్రం’ సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలను చూపుతూ విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలుకుతుంది. తద్వారా దేశం పురోగామి దిశలో ప్రయాణించి, అభివృద్ధి సాధ్యవౌతుందనేది జగమెరిగిన సత్యం. కానీ నేడు భారతీయ ‘విజ్ఞానశాస్త్రం’ రోజురోజుకు కుల, మత, రాజకీయాల ప్రభావానికిలోనై వ్యతిరేక సైన్స్‌కు దారితీస్తూ సమాజాన్ని మూఢనమ్మకాల వైపు తీసుకుపోవడం జరుగుతుంది. అదే విధంగా నమ్మకాలు, విశ్వాసాల పేరుతో ఛాందసభావాలను పెంపొందించబడి, భారతీయ విజ్ఞానశాస్త్రం అజ్ఞానంవైపు నెట్టివేయబడుతుంది. తద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక విధులలో పేర్కొన్న ఆర్టికల్ 15ఎ(హెచ్)లోని ‘శాస్ర్తియ దృక్పథం, వైజ్ఞానిక అభివృద్ధి ‘ప్రజానీకంలో కొరవడి అశాస్ర్తియ, మూఢత్వభావాల విస్తృతి పెరుగుతుంది. దీనికిగల ముఖ్యకారణం రాజ్యాంగం విలువలను విస్మరిస్తూ శాస్ర్తియ దృష్టిని ప్రోత్సహించకపోవడం, ప్రభుత్వ పరిపాలన, విధానాలలో ప్రగతిశీల భావాలు లోపించడం, ప్రముఖ సైన్స్ వేదికల దగ్గర పాలకులే అశాస్ర్తియ అంశాలు మాట్లాడడం, అదేవిధంగా శాస్ర్తియ ప్రగతిని, విజయాలను ఆధ్యాత్మికతతో ముడిపెట్టడం లాంటి కార్యకలాపాలు. కావున ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలతో ప్రభుత్వ పరిపాలన అందిస్తూ, శాస్ర్తియ దృక్పథాన్ని సామాన్య ప్రజానీకంలో పెంపొందించడానికి కృషిచేయాలి. అదేవిధంగా గొప్ప రాజ్యాంగ అధిశాసన గ్రంథం యొక్క స్ఫూర్తిని ప్రభుత్వాలు కొనసాగిస్తూ, శాస్ర్తియ అభివృద్ధినీ ప్రోత్సహించాలి, అప్పుడే దేశం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చెందుతుంది.

- సంపతి రమేష్ మహారాజ్, 9959556367