సబ్ ఫీచర్

త్యాగశీలతకు గుర్తింపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలెందరో?’ అన్నట్లు భారత స్వాతంత్య్ర సంగ్రామంలోకి దూకి బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడి, తమ మానప్రాణాలను సహితం త్యాగంచేసిన ఘనంగా 70వ స్వతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాం అంటే అది వారి త్యాగఫలమే. కానీ ప్రభుత్వాలు మారుతున్నా, అప్పటి స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో వున్నారు. వారిలో కొందరికి పింఛను, తదితర ప్రభుత్వ పథకాలు అందటం లేదనడం అతిశయోక్తి కాదు. అప్పటి తరంవారైన శ్రీ మదన్‌మోహన్ మాలవ్యా, మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌గార్లను దేశంలో అత్యున్నతమైన ‘్భరతరత్న’ బిరుదుతో సత్కరించారు. ఇది నిజంగా శుభపరిణామం. చాలా సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని మరీ సత్కరించారు. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే బ్రిటీష్‌వారికి ఎదురొడ్డి గుండె నిలిపిన తెలుగువారి ముద్దుబిడ్డ, అప్పట్లో తన లక్షలాది ఆస్తిని, న్యాయవాద వృత్తిని త్యాగంచేసిన త్యాగధనుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు భారతరత్నకు అర్హులుకాదా? ఇది తెలుగువారు నిజంగా చాలా సిగ్గుపడవలసిన విషయం. అలాగే జాతీయ జెండా రూపకర్త జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కురువృద్ధుడు, తన జీవితాన్ని జాతీయ సంగ్రామంకోసం ధారపోసి అవశాన దశలో ఆదుకునేవారులేక ఆర్థిక అవస్థలుపడిన ‘త్రివర్ణ పతాక’ వ్యవస్థాపకుడు పింగళి వెంకయ్యగారు ‘్భరతరత్న’ సత్కారానికి అర్హులుకాదా? ఇదేనా? మనం ఆయనకు ఇచ్చే నివాళి?
తెలుగువారిలో జాతీయ భావాన్ని, సమర శంఖాన్ని పూరించి, బ్రిటీష్‌వారిని గడగడలాడించిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు ‘్భరతరత్న’ సత్కార్యానికి నోచుకోలేదా? నిజంగా తెలుగువారి గుండెలో నిండుగా కొలువైన అల్లూరి సీతారామరాజుకు ఇచ్చే నివాళి ఇదేనా? భారతదేశంలోని 18 జాతీయ భాషలన్నింటిలో దాదాపు ప్రవేశం కలిగి సంస్కృతంనుంచి ‘వేయి పడగలు’ నవలను తెలుగులోకి అనువదించిన పండితుడు, తెలంగాణా ముద్దుబిడ్డ విదేశ వ్యవహారాల శాఖకే వనె్నతెచ్చిన, ఎన్నో సంస్కరణలకు నాందిపలికి, మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు అవలీలగా నడిపిన, ‘అపర చాణక్యుడు’, ‘్భరతరత్న’ పురస్కారానికి అర్హులుకాదా! అలాగే స్వాతంత్ర సమరయోధులు దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్, నావికాదళాన్ని ఏర్పరచి, హిందుఫౌజ్ సంస్థను ఏర్పరచిన స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఈ భారతరత్న పురస్కారానికి అర్హులుకాదా? ఎందరో స్వాతంత్య్ర సమరంలో పాల్గొని ఆస్తులు పోగొట్టుకొని కడు పేదరికంతో దుర్భర జీవితాలను గడిపిన ఎందరో చరిత్రపుటల్లో స్థానం సంపాదించలేకపోయారు. అందుకు వారి నిస్వార్థ దేశభక్తే కారణం. స్వాతంత్య్రసాధన తప్ప మరో తపనలేని త్యాగశీలురు కనుకనే ఎటువంటి ఆడంబరాలకు తావివ్వకుండా నిస్వార్థంగా దేశ సేవలో పునీతులయ్యారు. అటువంటివారిలో ఇంకా జీవించి ఉండి వర్తమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వెలుగులోకి రానివారి గురించి ప్రభుత్వం ఆరా తీసి అటువంటి వారికి స్వాతంత్య్ర సమరయోధుల పింఛనును మంజూరు చేయాలి.
భారతరత్న పురస్కారం దేశంలో ఎంతో త్యాగంచేసి వారి జీవితాన్ని దేశానికి అంకితంచేసిన వారికిచ్చే అత్యున్నత పురస్కారం ఇది. కానీ, కొంతమంది తమవారికి ఇవ్వాలనే సిఫారుసులు అందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వంవారు ‘సేవాతత్పరత’ కలిగిన అత్యున్నత వ్యక్తులకు మాత్రమే ఈ పురస్కారాన్నిఇచ్చి వారిని గౌరవించుకోవడం మన ప్రభుత్వ కర్తవ్యం? అదే నిజంగా వారికిచ్చే నివాళి!’

- యర్రగుంట్లపాటి శేషగిరిరావు