సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ వున్నా...
బాగా భోంచేస్తావు. మంచి బట్టలు వేసికొంటావు. మంచి యింట్లో వుంటావు. చక్కగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం వచ్చింది. సుఖంగా జీవిస్తున్నావు. ఆరోగ్యం బాగుంది. భద్రంగా వున్నావు. భేష్! కాని యివన్నీ వుండీ శాంతి లేని వాళ్లు ఎందరో వున్నారు. అసంతృప్తిగా బతుకు వెళ్లబుచ్చే వాళ్లు ఎందరో వున్నారు. ఎందుకని? అంతశ్శుద్ధి లేకనే!
శాంతి, హాయి అన్నవి మనిషి అంతశ్శుద్ధిపై ఆధారపడి వుంటాయి. కాని బాహ్య సంపదలపై కాదు.
మారాల్సింది నీవే
మనం పెట్టుకొనే కళ్ల అద్దాల రంగులోనే మనకు లోకం కనిపిస్తుంది. దివ్యత్వం అనే కళ్లజోడు పెట్టుకో, లోకమంతా దైవమయంగా వుంటుంది. నీవు లోకాన్ని మార్చాలని చూస్తున్నావు. ఎందుకు? మారాల్సింది లోకం కాదు. నీవు! ముందు నిన్ను నీవు మార్చుకో. ప్రేమ, శాంతి, సహనాలను అలవరచుకో. అప్పుడు నీకు అందరూ ప్రేమ స్వరూపులుగా, శాంతి, సహనశీలురుగా కన్పిస్తారు.
శాంతము లేక...
ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా స్ఫూర్తినిచ్చే పవిత్ర గ్రంథం రామాయణం. గాంభీర్యం, స్థైర్యం, సమత, శాంతి, ఆత్మబలాన్ని రామాయణ పారాయణం కలిగిస్తుంది.
ప్రశాంతతను మించిన సంపద లేదు. శాంతి లేకపోతే ఆస్తి, అధికారం, కీర్తి, సంపదలెన్ని వున్నా వుత్తదే. శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజు ఆలపించినదందుకే!
శాంతి ఫలాలు
నీ హృదయ క్షేత్రంలో మొలిచిన పిచ్చి మొక్కలను పెరికేయి. నేలను బాగా దున్ని, తయారుచేయి. ప్రేమ విత్తనాలు వెదజల్లు. విశ్వాసం అన్న నీరు పెట్టు. బాగా పెరగనీ, సహనమన్న మొగ్గ తొడగనీ. శాంతి ఫలాలు తప్పక పండుతాయి. ఇదే నీ పని. ఇదే నీ విధి. ఇదే నీ దీక్ష కావాలి.
శాంతి ఎలా లభిస్తుంది?
కీర్తి కాంక్ష, పదవీ కాంక్ష, భోగకాంక్ష యివి ఈ లోకంలో కనిపిస్తూనే వున్నాయి. కాని వీటివల్ల శాంతి చేకూరుతున్నదా? లేదు. డబ్బు శాంతిని కొనలేదు. అధికారం దానిని ఆజ్ఞాపించలేదు. మనశ్శాంతి చేకూరాలంటే అనుసరించాల్సిన మార్గం వేరే వుంది. కఠోర సాధనవల్ల అది లభిస్తుంది. ధ్యానం, నామస్మరణం వంటి నవవిధ భక్తి మార్గాలు అందుకు తోడ్పడతాయి. అంతరిక్షంలో ఏ గ్రహంలోనో వెళ్లి వెదకటం వల్ల శాంతిని కనుగొనలేము. ఇక్కడే రుూ భూమి మీదే, మీ మనసులోనే దానిని కనుగొనాల్సి వుంది.
శాంతి మంత్రం
సంతృప్తి కన్నా స్వర్గం ఎక్కడుంది? చింతను మించిన నరకం ఏది? నీ కోసమే నీ శత్రువు. నీ క్షమమే నీ కవచం. దయ నీ నేస్తం!
‘శాంతిః, శాంతిః శాంతిః’ అని మూడుసార్లంటున్నావా? ఎందుకు? మానవాళి శాంతిగా వుండాలి. ప్రకృతి ప్రశాంతంగా వుండాలి. దేవతలు శాంతినందాలి.
గమ్యం శాంతియే!
మానవ జీవితం ఒక రథం లాంటిది. ఇంద్రియాలే గుర్రాలు. బుద్ధిసారథి. వివేకం, వైరాగ్యం కళ్లాలు. కాలచక్రం, కర్మచక్రం రెండూ రథ చక్రాలు, చక్రానికి ఉండే ఆకులు ధర్మనిబంధనలు. చక్రపు అంచు (రిమ్ము) ప్రేమ, సత్యం ఇరుసు. శాంతి గమ్యం. ఆత్మయే రథి!
ప్రపంచమే ప్రశాంతి నిలయం
ప్రపంచమే ప్రశాంతి నిలయం. మానవుడు దానిని అశాంతి నిలయం చేసికొన్నాడు. ఇంద్రియాలను తన సేవకులను చేసికోవటానికి బదులు వాటికి దాసుడయాడు. బాహ్య సౌందర్యానికీ, ఆడంబరాలకూ దాసుడయాడు. తన శక్తియుక్తులన్నీ విషయ వాంఛలను తీర్చుకొనేందుకే వినియోగిస్తున్నాడు. తాను చేస్తున్న రుూ పనులన్నీ తనకు శాంతిని దూరం చేస్తున్నాయని అతడు గ్రహించటల్లేదు.
సుఖ శాంతులు
ఎక్కడెక్కడికో పోయి సుఖాలను వెతుక్కుంటాడు మానవుడు. ఏకాంతంలో శాంతికోసం చూస్తుంటాడు. సంతోషం ఎక్కడ వుంది? తనలో దాగిన సుఖశాంతి ధారను అతడు కనుగొనలేడు.
చంద్రలోక యానం చేయటానికి వెళ్లినా ఏం ప్రయోజనం? నీ వెంటనే వస్తాయి కదా నీ బాధలూ, భయాలూ, నీ కచ్చలూ, కార్పణ్యాలు!
భగవంతునిలో నమ్మకముంచు, నీతిగా నడుచుకో, చాలు; బతుకు బాటలో కలిమి రానీ, లేమి రానీ కలిగిన దానితోనే తృప్తిపడు. సుఖం, శాంతి నీకు లభిస్తాయి.

ఇంకా ఉంది