సబ్ ఫీచర్

భారతదేశంలో కౌరవ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ఒక తెలుగుదేశం నాయకునికి కోపంవచ్చి ఆలీబాబా- నూట యాభై దొంగలు అన్నారు. ఇది ఎవరిని గురించో వేరే చెప్పనక్కరలేదు. ఐతే ఈ పోలిక సరిగ్గా లేదు. ఎందుకంటే ఆలీబాబా దొంగల నాయకుడు కాడు. నలభై మంది దొంగలకు వేరే నాయకుడు ఉన్నాడు. అందుకని ఆధునిక భారతదేశంలో కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు నేడు కూడా పాండవులూ, కౌరవులూ ఉన్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పోలిక కాదు.
కేరళ తీసుకుందాం.
అక్కడ పినరాయ్ విజయన్ అనే నరహంతకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ‘ప్రతిపక్షాల వారిని చంపి ఉప్పుబస్తాలల్లో కుక్కి కాలువల్లో పడేయండి’ అని బహిరంగంగా ప్రకటించాడు. ఇక తిరువనంతపురంలో శశిధరూర్ అనే పార్లమెంటు సభ్యుడు ఉన్నాడు. ఇతడు భార్యా హంతకుడు. సునందపుష్కర్ మర్డర్ కేసులో మొదటి ముద్దాయి. కేరళలోని వైనాడ్ నుండి గెలిచిన రాహుల్ విన్సీ నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్టుఅయి బెయిల్ మీద తిరుగుతున్నాడు. కేరళలోని బాలకృష్ణపిళ్లె మీద ఎన్నో క్రిమినల్ కేసులున్నాయి. ఇక కర్ణాటకలో గాలి జనార్ధన్‌రెడ్డి, యడ్యూరప్ప, డి.కె.శివకుమార్, హెచ్.డి.కుమారస్వామి, కీ.శే.జాఫర్ షరీఫ్ (షరీఫ్ అంటే నిజాయితీపరుడు అని ఉర్దూలో అర్ధం). వీరంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే.
తమిళనాడులో కరుణానిధి కుటుంబం తీహార్ జైలులో కూర్చొని వచ్చింది. జయలలిత, కరుణానిధిని అరెస్టుచేసి చిప్పకూడు తినిపించింది. జయలలితను అరెస్టుచేసి, బెంగుళూరు జైలులో ఉంచారు. వి.కె.శశికళ జైలులోనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు నేటి ముఖ్యమంత్రితోబాటు విజయసాయిరెడ్డి పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తెలుగుదేశం ముఖ్యమంత్రిగారి కార్యదర్శి వద్ద నిన్న ఐటి సోదాలో రెండువేల కోట్లు దొరికాయి. దీనిని టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ అన్నారు. తెలుగులో ‘ఉల్లిపొర’ అన్నారు. అమరావతిలోని ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో 4000 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ‘సిట్’ విచారణ రెఫరెన్స్- వీరి పేర్లు చాలా పెద్ద జాబితా ఉంది. అందులో ఫిలిం నటులు, పారిశ్రామికవేత్తలు బీనామీలు, పత్రికాధిపతులు కూడా ఉన్నారు.
గుంటూరు సింహం రాయపాటి సాంబశివరావు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి బ్యాంకులకు ఎగగొట్టిన ఋణాల నిమిత్తం వారి ఆస్తులు జప్తుచేసి వేలంవేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. టిటిడి వారి ఎస్‌వి భక్త్ఛినల్ డైరెక్టర్ స్వయంగా లైంగిక కేసులో ఇరుక్కొని సస్పెండ్ అయినాడు. లైంగిక నేరాల్లో కేరళలో క్రైస్తవ బిషప్పు ప్రాంకోములక్కల్ ఇంకా ఐదుగురూ, విచారణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో నిత్యానందస్వామి, కల్క్భిగవాన్ నేర చరిత్రకలవారే! తెలంగాణలో నరుూం అనుచరుల జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘గొంతుమీద కత్తి పెట్టినా సరే నేను వందేమాతరం పాడను, భారత్‌మాతాకీ జై అనను’ అని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించాడు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ 1984 సిక్కుల ఊచకోత (4000 మంది) కేసులో ప్రధాన నిందితుడు. చత్తీస్‌గఢ్‌లో రమణసింగ్ కొడుకుకు విదేశాల్లో రహస్య ఖాతాలున్నట్లు కాంగ్రెస్‌వారు ఆరోపించారు. ఈ ఆరోపణ నిజమే కావచ్చు. ఎందుకంటే జూలియస్ బసాంజే విడుదల చేసిన సినీతారల రష్యా, చైనా, బ్రిటన్ దేశాధిపతుల పేర్లు కూడా ఉన్నాయి.
ఇక ఉత్తరప్రదేశ్‌లో నేర చరిత్ర లేనివాడు లేనే లేడు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అంతా రకరకాల కేసులలో ఇరుక్కున్నవారే. హేమావతినందన్ బహుగుణ, మాయావతి, ములాయంసింగ్‌యాదవ్, అఖిలేష్‌యాదవ్, అమరసింగ్, కల్యాణ్‌సింగ్, అజిత్‌సింగ్ ఇలా ఒకరేమిటి అంతా నేరుస్థులే.
‘సల్మాన్‌ఖుర్షీద్ డెబ్బది లక్షలు తిన్నాడని అరవింద కేజ్రీవాల్ ఆరోపిస్తే ‘‘ఇది అబద్ధం- ఖుర్షీద్ భార్య 70 లక్షల చిన్న మొత్తం కోసం కక్కుర్తిపడే రకం కాదు. డెబ్బది కోట్లు అంటే నమ్ముతాము అని నవ్వుతూ కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానించాయి. అరవింద్ కేజ్రీవాల్ రక్తం కళ్ల చూడండి అని బహిరంగంగా ఖుర్షీద్ చేసిన ప్రకటన గుర్తుండే ఉంటుంది.
బీహారు అంటే ఒకప్పటి కర్పూరీ ఠాగూరు రాజేంద్రప్రసాద్‌ల రాష్ట్రం కాదు. ఇదొక జంగిల్ లా అమలులో ఉన్న అరాజక ప్రాంతం. లల్లూప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలుకుపోతే తన భార్య రాబరీదేవిని గద్దెనెక్కించి, జైలునుండి పరిపాలన సాగించాడు. తేజస్వీ యాదవ్ నిరక్షరాస్యుడు- గూండాల నాయకుడు. ఇతడు ఉప ముఖ్యమంత్రి ఎలా అయినాడు?
రాజస్థాన్‌లోని భ్రామరీదేవి హత్యోదంతం ఇంకా గుర్తుంది. ఆమెను కాంగ్రెస్ నాయకులు సజీవంగా తగలబెట్టి చరిత్ర సృష్టించారు. బెంగాల్‌లోని కమ్యూనిస్టు శకం ముగిశాక, వారి బ్రతుకు పెనం మీది నుండి పొయ్యిలోకి పోయినట్లయింది. మమతాబెనర్జీ అనే ఒక మానసిక వికలాంగురాలు రాష్టాన్ని బంగ్లాదేశ్ చొరబాటుదారులకు తాకట్టు పెట్టింది. ప్రత్యర్థులను హత్యలు చేయించి చెట్లకు ఉరి తీయించింది. బెంగాలీలకు ఇష్టమైన దుర్గా పూజలు, రామనవములపై నిషేధం విధించింది.
బీహారీబాబు శతృఘ్నసిన్హా తనకు బిజెపిలో సముచితస్థానం దొరకలేదని కాంగ్రెస్‌లో చేరి పాకిస్తాన్‌ పోయి నిన్న మాజీ పాక్ ప్రధానమంత్రితో రహస్య సంభాషణలు జరిపాడు. పంజాబుకు చెందిన నవజోత్‌సింగ్ సిద్దూ అలాగే చేశాడు. మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి దునియా టీవీలో ఇలా చెప్పాడు. ‘‘మీరు (ఐఎస్‌ఐ పాక్ సైనికులు మాతో (కాంగ్రెస్‌తో) సహకరించకపోతే మనం నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపలేము’’. ఇప్పుడు నరేంద్ర మోడీని మనం అడుగవలసిన ప్రశ్న ఒక్కటే. ఈ మణిశంకర్ అయ్యర్‌లు నవజోత్‌సింగ్ సిద్దులను శశిధరూర్‌లను కపిల్ సైబాల్‌లను మీరెందుకు అరెస్టు చేయలేకపోయారు? ఒక బిజెపి నాయకుడు నాతో ఇలా అన్నాడు. ‘‘సోనియాగాంధీపై చర్య తీసుకోవాలనే ఉంది. కాని దానివలన ఆమెకు సానుభూతి ఎక్కువై కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది’’ అని ఇందిరాగాంధీని అరెస్టు చేసినప్పుడు ఆమెకు సానుభూతి రావడాన్ని గుర్తు చేశాడు.
మరి క్రిస్ట్ఫర్ మిషేల్ వాంగ్మూలం ఏమయినట్లు?
లండన్‌లోని రాహుల్‌గాంధీ హౌస్ కేసు ఏమయినట్లు?! జలాంతర్గాముల కేసులు హెలీకాప్టర్ల కొనుగోలు కేసులు, బొగ్గు గనుల వేలం కుంభకోణం, మహారాష్ట్ర ఆదర్శహౌసింగ్ కుంభకోణం, హర్యానా అక్రమ నిర్మాణాల కేసులు నేషనల్ హెరాల్డ్ కేసులు ఇలా పాతిక కేసులున్నాయి. ఇలాంటి కేసులను కొన్నింటిని గురుమూర్తి అనే తమిళనాడు జర్నలిస్టు బయటపెడితే ఆయన మీద మొన్న డిఎంకె గూండాలు దాడిచేశారు. 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఒక మార్గదర్శక ప్రకటన చేస్తూ రాజకీయాల్లో నేరస్థులు ఉండకూడదు అని సూచించింది. ఇదే అంశాన్ని మళ్లీ 2020 ఫిబ్రవరిలో పునరుద్ఘాటించింది. మంత్రాలకు చింతకాయలు రాలవు- తాటాకు చప్పుళ్లకు అవినీతి కుందేళ్లు బెదరవు. న్యూఢిల్లీలోని షాషీన్‌బాగ్‌లో నిరసనలు, అల్లర్లు నెలల తరబడిగా ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ల పౌరసత్వాలేమైనా రద్దుఅయినాయా? డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఎవరు మంటలు పెట్టారు? భారత ప్రతిష్టను ఎవరు దెబ్బతీశారు? ఇది నిస్సందేహంగా చైనా-పాకిస్తాన్‌ల కుట్ర అని తెలుస్తూనే ఉంది. రతన్‌లాల్ అనే నిజమైన ‘్భరతరత్న’ ఒక కానిస్టేబుల్ - విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు (24-2-2020) ఈ పని చేయించింది కాంగ్రెస్- ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అని ఢిల్లీ ప్రజలకు తెలుసు, మరి మోడీగారు ఈ కౌరవ సంతతిని ఎందుకు శిక్షించలేదు?
‘మాది పేదల పక్షం’ అంటూ ఎప్పుడూ చొంగ కార్చే మన సూడోలు, అభ్యుదయ కవులూ రతన్‌లాల్‌పై ఎందుకు ఒక ఎలిబీ వ్రాయలేదు?? ఎక్కడ దాక్కున్నారు రాహుల్ విన్సీలు, కపిల్ సైబల్‌లూ, మణిశంకర అయ్యర్‌లూ-
ఔను- బిజెపి నాయకులు జి.పుల్లారెడ్డి మిఠాయిలు మరిగి రామభజన చేస్తుంటే ఇండియాను అంచెలంచెలుగా ఒకవైపు పాకిస్తాన్ మరొకవైపు చైనా ఆక్రమించుకుంటున్నది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాక్షిగా న్యూఢిల్లీలో జరిగిన అల్లర్లల్లో పది మంది దుర్మరణం పాలైనారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రాహుల్‌గాంధీ, గులాంనబీ అజాద్, అసదుద్దీన్ ఒవైసీ, జిన్‌పింగ్- ఇమ్రాన్‌ఖాన్, కేజ్రీవాల్, గోపాలరాయ్ (్ఢల్లీ అసెంబ్లీ హోంమంత్రి) ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పండి?!

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్