సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతే సంగతులు
నీవు ఇంకొకరికి ఎదురుబదురుగా నిలబడు. ఏం కనిపిస్తుంది? అతని కంటి పాపలో నీవు కనిపిస్తావు? నీ కంటి పాపలో అతనికి తన ముఖం కనిపిస్తుంది. ఇది నీవెప్పుడూ గమనించలేదా? అంటే, అర్థం ఏమిటి? నీ వాయనలో వున్నావు. ఆయన నీలోవున్నాడు. నేను మీలో వున్నాను. ఈ సంఘటన చాటే సత్యం యిదే!
ఈ సంగతిని నీవు నమ్మితే, నీవు ప్రేమను పెంపొందించుకోగల్గుతావు. వినయం, బ్రతుకంటే ఆరాధనాభావం, క్షమ, సహనం నీలో పెంపొందుతాయి. నీవు సరయిన దారిలో నడవగలుగుతావు. దానిని తప్పావో, ఇక ఇంతే సంగతులు! దైవకృపను అందుకోవాలి అంటే సరయిన దారిలోనే నడవాలి.
ప్రేమలో జీవించు
సంపదలవల్లా, సంసారంవల్లా మానసికంగా ప్రశాంతి కలుగుతుందని అనుకోటం చాలా తప్పు. అలాంటి ప్రశాంతత కలిగేది భగవత్కృప వల్లనే. ప్రేమను మించిన బలం ఏది? ప్రేమ వున్నచోట అన్నీ వున్నట్లే. ప్రేమలో జీవించు. అన్నీ సరిగానే వుంటాయి. నీవే కాదు. యితరులను కూడ ప్రేమగా జీవించేలా చేయి.
కర్మబంధం
కాలం గడుస్తూనే వుంటుంది. కర్మ చక్రానికి కట్టుబడిన జీవి పుడుతూ చస్తూ వుంటున్నాడు. దానినుండి బయటపడే మార్గం తోచక తన్నుకుంటున్నాడు. తాను పడే బాధలవల్ల మనిషేమయినా మారాడా? తెలివి తెచ్చుకున్నాడా? నమ్రత పొందాడా? లేదు. గర్వంతో ద్వేషం, దౌష్ట్యం పెంచుకొంటున్నాడు. తన క్రౌర్యానికీ, పాపకార్యాలకూ తానే మురిసిపోతున్నాడు. అవినీతి అన్నా, అసత్యం అన్నా అపవిత్రమైన ఆపేక్షతో పశువులకన్నా హీనస్థాయికి అతడు దిగజారుతున్నాడు.
ప్రేమే నా సందేశం
ప్రేమను పెంపొందించుకుంటే కక్షలూ, కార్పణ్యాలకు చోటుండదు. శాంతి, ప్రశాంతత వికసిస్తాయి. నా ప్రబోధమే ప్రేమ. నా సందేశమే ప్రేమ. నా నడతే ప్రేమ. నా జీవిత విధానం ప్రేమ. మనిషికి దొరికే వానిలో ప్రేమకన్న విలువైన వస్తువు లేదు.
ప్రేమను పెంచు
సద్గుణాలకు ప్రేమే తలమానికం. ప్రేమ శీలానికి పునాది. నీకెన్ని సంపదలున్నా. శీలం లేకుండా, ప్రేమలేకుండా శాంతి లభించదు. డబ్బు ఈరోజు వస్తుంది. రేపుపోతుంది. కాని శీలమో? వస్తుంది. పెంపొందుతూ వుంటుంది. ప్రేమతో నీతిని పెంచుకో. అప్పుడే నీకు న్యాయం, భద్రత, శాంతి లభిస్తాయి. జనంలో ప్రేమాభిమానాలు సడలిపోతే అశాంతి ప్రబలుతుంది. మానవజాతి బలహీనపడుతుంది. దెబ్బతింటుంది.
గొడవల కుంపటి
ఈరోజుల్లో ఎక్కడ చూసినా గొడవలు కన్పిస్తున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు; స్కూల్లో టీచర్ల మధ్య గొడవలు; ఊళ్లో ముఠా గొడవలు. సమాజం ఇలా దిగజారిపోయింది.
కుటుంబంలో కలతలులేకుండా శాంతి, సౌఖ్యాలతో వుంటే అది గ్రామంలోనూ, సమాజంలోనూ శాంతికి దోహదం చేస్తుంది. కుటుంబంలో శాంతి కావాలంటే ముందు కుటుంబ సభ్యులలో మనశ్శాంతి వుండాలి. మనశ్శాంతి లభించాలంటే ప్రేమతత్వాన్ని పెంచుకో, సేవాభావాన్ని పెంపొందించుకో.
మొక్కులు
పూజలూ, అర్చనలూ అన్నీ భక్తికోసమే. కాని భక్తి ఏది? బేరంలోకి దిగింది. ‘నాకు యిట్లా జరుగుతే, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతా’ ఇదీ బేరం. ఈ గుడికన్నా ఆ గుడిలో మొక్కుతే మంచిదనిపిస్తే, ఈ దేవుడిని వదిలేయటం. ఆ దేవుడికోసం పోవటం! అక్కడ కాకపోతే యింకొక చోటికి. ఇవీ కొందరు తమ తమ ఆదుర్దాకొద్దీ పెడుతున్న పరుగులు!
అన్నీ ఆయనకే వదిలేయి
నీ కోరికలనూ, నీ బుద్ధినీ, నీ కలలనూ, నీ వూహలను, అపోహలనూ అన్నిటినీ భగవంతునికి సమర్పణచేయి. అన్నీ ఆయనకే వదిలేయి. ఆయన నిన్ను సదా సుఖసంతోషాలతో, శాంతిసౌఖ్యాలతో నడిపిస్తాడు. క్షణ భంగురమైన సుఖాలవెంట పడకు. భగవత్సంకల్పం ఎలాగున్నా స్వీకరించు. దానితోనే తృప్తిపడు.
వాల్మీకి
రత్నాకరుడు దోపిడీ దొంగ. వందలాది మందిని సంకోచంలేకుండా చంపిన క్రూరుడు, కోపోద్రేకాలకు దాసుడు. ఒకరోజు అతనికి దొరికిన బాటసారులు సప్తఋషులు. వారి బోధలు విని శాంతం, సహనం, అలవరచుకొన్నాడు. ఆత్మవిచారం ప్రారంభించాడు. కామాన్ని వదిలి రామాన్ని చేపట్టాడు. వాల్మీకి మహర్షిగామారి రామాయణం రచించి అమరజీవి అయాడు.
సంగీత మాధుర్యం
సంగీతం శాంతిదాయకం. అందరికీ సంగీతం యిష్టమే. ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిః’అన్నారు. గాన మాధుర్యానికి పిన్నలు, పెద్దలు, స్ర్తిలు, పురుషులు, పశువులు, పాములు అన్నీ పరవశిస్తాయి. సంగీతాన్ని ఆశ్రయించి భక్తిమాధుర్యం మరింతగా పెరుగుతుంది. శాంతి రసంలో పర్యవసిస్తుంది.

ఇంకా ఉంది