సబ్ ఫీచర్

కరోనా! కరోనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డొనాల్డ్ ట్రంప్ రాక కొందరికి ఇంపు- మరికొందరికి కంపు. ఐనా రాక తప్పదు.
2020 ఫిబ్రవరి 24నాడు అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినప్పుడు న్యూఢిల్లీలో భారీగా మారణకాండ జరిగింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతోబాటు 50 మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. అందులో అంకిత్‌శర్మ అనే సిఐడి కూడా ఉన్నాడు. ఇతడు 27 సంవత్సరాల యువకుడు. అరవింద కేజ్రీవాల్ అనుచరులు నడుపుతున్న రహస్య రసాయనిక ఆయుధాల ఫ్యాక్టరీ రహస్యాలు ఈయన బయటపెట్టాడు. అందుకని కేజ్రీవాల్ అనుచరులు అంకిత్‌శర్మను 400సార్లు కత్తిపోట్లకు గురిచేసి డ్రైనేజీలో పడేశారు. ఇప్పుడు చెప్పండి ఆప్ పార్టీ ఢిల్లీని పాలించడానికి అర్హమైనదేనా?
ఆప్ పార్టీయే ఒక పెద్ద కరోనా విస్తరించింది తన ఎరీనా- దానిని నియంత్రించటంలో బిజెపి విఫలమయింది. కేజ్రీవాల్, మనీష్ శిశోదయా, హాజీ జాహిద్ హుస్సేన్, కపిల్‌గజ్జర్, అరుంధతీరాయ్ వీరిపై ఏవేవో శిక్షాస్మృతుల కింద కేసులు నమోదు అయినాయి. ఐనా అవి అనతి కాలంలో నీరుకారిపోయాయి. ఎందుకంటే మహారాష్టల్రోని భీంకోరేగాం కేసులోని వందలాది ఎఫ్‌ఐఆర్‌లను నిన్న శరత్‌పవార్ తాను అధికారంలోకి రాగానే రద్దుచేయించాడు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద కేసు బనాయించాడు. శరత్‌పవార్ మీద కేంద్రం కొన్ని కేసులు పెట్టింది. అయినా అతనిని కాని, సుప్రియాసూలేనుగాని అరెస్టుచేసే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదు. దేశంలో ఎందరో వ్యక్తులు ఎనె్నన్నో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఉద్ధవ్‌థాకరే అనే శివసేన నాయకుడు హిందుత్వ అనే నినాదంపై పార్టీని నిర్మించాడు. అంటే ఇక్కడ హిందూత్వమే ఆయన వ్యాపారపు ముడిసరుకు. భారతదేశంలో ఎందరో థాకరేలు, కమల్‌నాథ్‌లు ఉన్నారు. వీరే కరోనా వైరస్‌లు. భారత రాజకీయాలను కలుషితం చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఏం జరిగింది? బిఎస్‌పి శాసనసభ్యులను కమలనాథ్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు బిజెపివారు కాంగ్రెస్‌ను చీలుస్తున్నారు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అంటే ఇదే. ఓటర్లను కొనటంకన్నా ఎం.ఎల్.ఏలకు కొనటం లాభసాటి వ్యాపారం, ఇదే రాజస్థాన్‌లో యుపిలో తెలంగాణాలో కర్నాటకలో ఏపిలో జరిగింది.
***
కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని ఓ సామెత ఉంది. హైదరాబాద్‌లో మార్చి 15వ తేదీ (2020)నాడు జరుగవలసిన బిజెపి నాయకుడు అమిత్‌షా సభను రద్దుచేయండి అని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ కోరారు. ‘అమిత్‌షా వస్తే ఇక్కడ కూడా మత కల్లోలాలు వస్తాయి’ అని వారి వాదం.
ఐతే కరోనా వైరస్ కారణంగా బిజెపివారు తమ బహిరంగ సభను తామే రద్దుచేసుకున్నారు. ఇది టిఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు వర్గాలకు సంతృప్తిని కలిగించింది.
ఇంతకూ ఈ కరోనా వైరస్ ఇండియాలోకి ఎక్కడినుండి ప్రవేశించింది? చైనాలోని యూహాన్ ప్రావిన్స్‌నుండి చైనీయులు వివిధ దేశాలకు ప్రయాణం చేశారు. వారినుండి ఈ అంటువ్యాధి వివిధ దేశాలను చేరింది. ముఖ్యంగా తైవాన్, హాంగ్‌కాంగ్, ఇరాన్‌లు బాగా దెబ్బతిన్నాయి. నిజం చెప్పాలంటే చైనాయే ఒక పెద్ద కరోనా వైరస్. మొత్తం ఆసియాను ఆక్రమించుకోవాలని ఈ దేశం ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు చైనాకు చీడపీడలు పట్టుకున్నాయి. అక్కడ మరణించిన వారి సంఖ్య లక్షల మీద ఉన్నప్పటికీ పూర్తి వివరాలు బయటకు రాకుండా దాచిపెడుతున్నారు.
ప్రార్థన ద్వారా అన్ని రోగాలను నయం చేయవచ్చునని క్రైస్తవులు టి.సతీశ్‌కుమార్‌లు పాస్టర్లు మనలను నమ్మిస్తున్నారు. ఇందులోని నిజం ఎంత?
మరి వాటికన్ పోపు ఫ్రాన్సిస్‌గారికి నిన్న ఎందుకు జ్వరం వచ్చింది?
‘అది కరోనా వైరస్ కాదు’ అని ఒక ప్రకటన విడుదల చేశారు. సంతోషం. కరోనాకు కన్నీళ్లు రావు. హిందూ ముస్లిం క్రైస్తవ భేదాలను యమధర్మరాజు పాటించడు. అందుకే ఆయనను సంస్కృతంలో సమవర్తి అనే పేరు ఉంది. కరోనా ప్రస్తుతం తెలంగాణాలోకి ప్రవేశించింది. ‘్భయపడకండి పుకార్లు నమ్మకండి’ అని ప్రభుత్వం హామీ ఇస్తున్నది.
లోగడ స్వైన్‌ఫ్లూ, ఇప్పుడు కరోనా ఇలా అంటువ్యాధులు ఎందుకు వస్తున్నాయి? అంటే వైదిక జీవనం మరచిపోవటంవల్ల.
ఆహితాగ్నుల ఇంటికి వైరస్‌లు రావు. ఇది ఎప్పుడో స్వామిదయానంద సరస్వతి చెప్పాడు.
నిన్నటివరకు ఐదు రూపాయల ఖరీదైన మాస్క్‌ల ధర హైదరాబాద్‌లో 10 రూపాయలకు చేరింది. మానవులు ఎంతటి స్వార్థపరులో దీనినిబట్టి గమనింపవచ్చు. చైనాలో నిన్న ఒక సంఘటన జరిగింది. కరోనా సోకిన తమ దేశ పౌరులను వాళ్లు కాల్చి చంపేశారు. ఇది పత్రికలో వచ్చిన వార్తయే- ప్రకాశ్‌కారత్, బృందాకారత్, ఏచూరి సీతారామయ్యలు, కన్నయ్యకుమార్‌లు దీనికి ఏం సమాధానం చెపుతారు?
ఇటలీనుండి భారతదేశానికి వచ్చిన వారి వలన కరోనా వైరస్ వ్యాపించినట్లు నిర్ధారించారు. నిన్న హైదరాబాద్ సమీపంలోని కొంపల్లిలోని ఒక లాడ్జిలో ఇటలీ మహిళను అరెస్టుచేశారు. ఇటలీయే ఒక పెద్ద కరోనా- ప్రపంచ దేశాలకు ముప్పు. వారిని నెత్తినెక్కించుకోవటం తప్పు.
హైదరాబాద్‌లోని కోటి మంది ప్రజలు ఇప్పుడు హోమియో షాపుల మీద పడ్డారు. ఉచిత హోమియో వైద్యం చేస్తున్నారు. ఐతే దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం భారతదేశం ఆర్షజీవనాన్ని అనుసరించి యజ్ఞాలు చేయటం శ్రేయోదాయకం. యజ్ఞం సర్వరోగ నివారిణి.
న్యూఢిల్లీ విమానాశ్రయంనుండి నేరుగా గురుగ్రాం- సఫ్‌దర్‌జంగ్ హాస్పిటల్స్‌కు ఇటాలియన్ యాత్రికులను తరలించారు. వీరి సంఖ్య 30 (16+14) ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా గురించి అన్ని దేశాలను హెచ్చరించింది.
ఆగ్రాలో తాజ్‌మహల్ చూడడానికి వచ్చే విదేశీయులవల్ల ప్రత్యేక సమస్యలు కలుగుతున్నాయి. వారికి ప్రత్యేక పరీక్షలు చేసి అనుమానితులను క్వోరంటైన్‌లో చేరుస్తున్నారు. శత్రుదేశాలు కరోనా వ్యాధిగ్రస్తులను భారత్‌పై ప్రయోగిస్తున్నారా? టూరిస్టుల పేరుతో వారు ఇండియాలో ప్రవేశించారా? అనే కోణంలో ఈ సమస్యను అధ్యయనం చేయాలి.
హైదరాబాదుకు సంబంధించినంతవరకు హైటెక్ సిటీలో శలవు వాతావరణం నెలకొన్నది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ ఇంటినుండే పనిచేయవచ్చునని చెపుతున్నారు. టూరిజం మీద ఆధారపడిన కేరళ, కర్నాటక, బృందావనం, సిమ్లా వంటి ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే చైనాలో వలెనే కేరళ ఆర్థికవ్యవస్థ కూడా ఇబ్బందులలో పడింది.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్