సబ్ ఫీచర్

‘‘కా’’ అంటే కాకిగోల కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్‌లో 28-2-2020నాడు భారత హోంమంత్రి శ్రీఅమిత్‌షా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. అందులో వారు భారతదేశాన్ని ఒక శతాబ్దంగా పట్టిపీడిస్తున్న సమస్యలను వివరంగా ప్రస్తావించారు.
1947లో బ్రిటీషువారి పుణ్యమా అని భారతదేశం ఇండియా, పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని మూడుగా విభజింపబడింది. ఆ తర్వాత లక్షలాది హిందువులు హతమార్చబడ్డారు. మరి కొందరు కాందిశీకులై ఇండియాలోకి శరణార్థులుగా ప్రవేశించారు. వీరికి రక్షణ కల్పించాలని ఆనాడు సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్, వౌలానా అజాద్, అంబేద్కర్, మహాత్మాగాంధీ కూడా కోరారు. ఐతే జవహర్‌లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు. బ్రతికినాచచ్చినా మీరు పాకిస్తాన్‌లోనే ఉండాలి అని అన్నారు. ఈ విధంగా ఎట్టి మానవత్వం లేకుండా కోట్లాది హిందువులు అన్యాయానికి గురిఅయినారు.
భారతదేశాన్ని 2014 వరకు పరోక్షంగా బ్రిటన్ పాకిస్తాన్‌లే పరిపాలించాయి. 2014లో తొలిసారి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక ఈ శరణార్థుల సమస్యపై దృష్టిసారించింది. తాత్కాలికంగా సి.ఎ.ఎ. అనే పౌరసత్వ చట్టం తెచ్చింది. దీనివలన శరణార్థులకు చట్టబద్ధత లభిస్తుంది. అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యాలు బంగ్లాదేశీలు మాత్రం ప్రత్యేకంగా గుర్తింపబడుతారు.
2020 ఫిబ్రవరిలో న్యూఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు భారీస్థాయిలో విద్రోహశక్తులు అల్లర్లు జరిపి విధ్వంసం సృష్టించారు. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీనిని ప్రేరేపించింది టెర్రరిస్టులేననేది సుస్పష్టం.
ఐతే వీరు ట్రంపు రాకను నిరసిస్తున్నారా? ‘‘కా’’కు వ్యతిరేకంగా కాకిగోల చేస్తున్నారా? న్యూఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఈ అల్లర్లల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. మహమ్మద్ జాహిర్ హుస్సేన్ ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్త నేటి న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌కు కుడి భుజం. ఇతడు ఒక ఆయుధాల ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. అంకిత్‌శర్మ అనే నిఘా విభాగం యువకుణ్ణి 400సార్లు పొడిచి చంపి కాలువలో (డ్రైనేజీ) పారేయించింది ఈ ఆప్ కార్యకర్తగారే. ఇక సోనియాగాంధీ మరొక అడుగు ముందుకు వేసి అల్లర్లను అదుపు చేయలేకపోయినందుకు భారతహోంశాఖా మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని కోరుతూ భారత రాష్టప్రతికి ఒక వినతిపత్రం సమర్పించి వచ్చింది. కలకత్తాలో మమతా బెనర్జీ, చెన్నైలో స్టాలిన్, హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ, ‘‘కా’’ చట్టానికి వ్యతిరేకంగా కాకిగోల మొదలుపెట్టారు. ఇది ముస్లిములకు వ్యతిరేకం అన్నారు. ‘‘ఇండియన్ ముస్లిములకు భారత పౌరసత్వం రద్దు అయిపోయింది’’ అని న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్టు వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాయించారు. బుర్షాదత్ రాజదీప్ సర్దేశాయి, ప్రశాంత్‌రాయ్ వంటి టీవీ (ఆంగ్ల) ఛానల్స్‌లోని ప్రముఖులు ‘‘కా’’ చట్టానికి వ్యతిరేకంగా ప్రసారాలు చేశారు. రాహుల్‌గాంధీ, ఆనందశర్మ, ప్రశాంత్ భూషణ్, ప్రశాంత్‌కిశోర్, మల్లికార్జున ఖర్గే, మణిశంకర్ అయ్యర్, మనీష్ తివారీ, ప్రియాంకవాద్రా ‘‘కా’’కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భారతదేశానికి నిప్పు అంటించటంలో యశోచితంగా తమ పాత్రను సమర్థవంతంగా పోషించాయి. అమిత్ చేసిన ప్రసంగం వీరెవరికీ కనువిప్పు కలిగించలేదు. ఎందుకంటే రాజ్యాధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీజేపీని అపఖ్యాతిపాలు చేసేందుకు ‘‘కా’’ చట్టాన్ని దుడ్డుకర్రగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంలో నరేంద్రమోడీ సత్వర చర్యలుతీసుకోవాలని ఈ వ్యాస రచయితతోబాటు ఎందరో ప్రముఖులు లోగడ కోరారు. అది జరిగి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. న్యూఢిల్లీ తగలబడి ఉండేది కాదు. మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెసు నాయకుడు నవజ్యోత్‌సింగ్ సిద్దూ, శత్రుఘ్నసిన్హా అనే నటుడు న్యూఢిల్లీ నుంచి పాకిస్తాన్ వెళ్లి అక్కడి ఐఎస్‌ఐ వర్గాలతో మంతనాలు జరిపినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? శశిథరూర్, అయ్యర్, ఒవైసీ సోదరులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పుడు వారిని ఎందుకు కట్టడి చేయలేదు? సరికదా.. ఇస్లామిక్ ఫండమెంటలిజానికి బహిరంగంగా మద్దతునిచ్చి మహారాష్టల్రో ఐదు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన శరత్‌పవార్‌కు పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చింది మరెవరో కాదు బీజేపీ కేంద్ర ప్రభుత్వమే.
శశిథరూర్ అనే హంతకునికి కేంద్ర సాహిత్య అకాడమీ 2020 పురస్కారం ఇచ్చి గౌరవించారు. ఈ పనిచేసింది కేంద్ర ప్రభుత్వమే.. ఇట్లా ఎందుకు జరిగిందో సమాధానం చెపుతారా? పౌరసత్వ చట్టం అనేది విద్రోహులకు ఒక సాకు మాత్రమే. ఇది కాకపోతే మరొకటి.
భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాత్రింబవళ్లు చైనా, పాకిస్తాన్‌లు కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్‌తో లక్షలాది మంది ప్రజలు చైనాలో దుర్మరణం పాలవుతున్నా వారికి బుద్ధిరాలేదు.
కరోనా, కమ్యూనిజం.. కవల పిల్లలు. కమ్యూనిజం, కమ్యూనలిజం.. తోడుదొంగలు, చైనా పాకిస్తాన్‌లు ఇక మారరు. కాశ్మీరు నుండి తరమబడిన పండిట్ల సంఖ్య ఐదు లక్షలు... ఈ శరణార్థులకు కాశ్మీరులో పునరావాసం కల్పించండి. ఆక్రమిత కాశ్మీరును పాకిస్తాన్ కబంధ హస్తం నుండి విముక్తం చేయండి. ‘‘కా’’ (పౌరసత్వం) చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న టి.ఎం.సి., డి.ఎం.కె., ఎం.ఐ.ఎం. వంటి పార్టీలపై నిషేధం విధించండి. వీలైతే భాషాప్రయుక్త రాష్ట్రాలను రద్దుచేసి ‘‘యూనిటరీ’’ రాజ్యాన్ని ఏర్పాటుచేసి కఠోర నిర్ణయాలు తీసుకోకపోతే ఈ వారిస్ పఠాన్‌లూ, కన్నయకుమార్‌లు, మమతాబెనర్జీలూ భారతదేశాన్ని ఇంకా విచ్ఛిన్నం చేస్తారు.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్