సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిత్యం, అసుఖం లోకాన్..
సృష్టికి లక్షణాలు రెండు. ఒకటి అది అనిత్యం. నశిస్తుంది. రెండవది అసుఖం. సుఖం లేనిది. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఆ సంగతే చెబుతూ ‘అనిత్యం అసుఖం లోకాన్ ఇమాం ప్రాప్య భజస్వమాం’అన్నాడు. ఈ లోకం నశించేది. సుఖం లేదు. ఇందులో ఏదీ నీకు శాశ్వతానందాన్ని ఇవ్వలేదు. ఆత్మే శాశ్వతం. అదే శరణ్యం. శాశ్వతానందాన్ని యిచ్చేది ఆత్మే. అనిత్యమైన లోకాన్ని సర్వస్వంగా భావించుకుంటూ, ఆత్మను మరచిపోవటం శుద్ధ తెలివితక్కువ. అలాచేస్తే శాంతి ఎలా లభిస్తుంది?
గమ్యానికి చేరేందుకే కారు!
కారు ఎందుకు కొంటారు? అద్దాల గారేజీలో వుంచి అందంగా ప్రదర్శించటానికా? కాదు. నీ గమ్యానికి నిన్ను వేగంగా, భద్రంగా చేర్చటానికి.
నీ శరీరం కూడా కారు వంటిదే. బ్రతుకు ఒక యాత్ర. దానికి శరీరం ఒక వాహనం. కాని మనిషి చేరాల్సింది ఎక్కడికి? కాటికా? ఊరికే చనిపోతే ఉపయోగం లేదు. కన్ను మూయకముందే నిన్నునీవు తెలుసుకో. నిజాన్ని గ్రహించు. అంతులేని ఆనందంలో మునకలు వేయి! ఈ దేహాన్ని మంచి కండిషన్లో వుంచటానికి ఎంత తినాలో, అంతే తిను. సత్యాన్నీ, దైవాన్నీ అనుభవ పూర్వకంగా గ్రహించటానికి ఈ శరీరాన్ని వినియోగించుకో. మంచి ఆలోచనలతో మంచి పనులతో నీ జీవితంలో ప్రతి క్షణాన్ని పునీతం చేసికో!
అక్రమంనుండి త్రివిక్రమానికి
దేహ వాహనాలవల్ల మమకారం వదిలేది కాదు. ఎంత ప్రయత్నంచేసినా, కుక్క తోక వంకర అన్నట్లుగానే తయారవుతుంది. నిజంగా మనిషి సంఘాన్ని విడిచిపెట్టగలిగితే. సుఖ దుఃఖాలూ, మంచి, చెడులూ అతడిని అంటలేవు. సమదృష్టీ, స్థైర్యం చేకూరుతాయి.
అంతా దేవుని రూపమే అన్న సత్యం అతనికి అనుభవంలోకి వస్తుంది. అంతా ఆనందమే! అంతా ప్రేమే! అంతా వరదుని దివ్యలీలే! లోకంగా, అనేకంగా భాసిస్తున్న ఆ దివ్యతత్వం తానే అని అతడు తెలుసుకుంటాడు. అనంత విశ్వాన్ని పారజూచేలా తన వ్యక్తిత్వాన్ని మనిషి విస్తరింపజేసుకోడమే వామనుడు పెట్టే త్రివిక్రమ పాదం! ఆ దివ్యపదమే అఖండానందానికి ఆలంబన! మునులూ, ముముక్షువులూ ఏళ్లతరబడి తపస్సుచేసేది దాని కోసమే!
ఆనంద స్వరూపం
అంతా ఆయనకు వదిలేసి, మీ తల బరువు దింపుకోండి! మీ మనసుకు మేత...‘సత్సంగం, సత్ప్రవర్తన, సర్వేశ్వర చింత!’ ఆనంద స్వరూపుడను నేనే! నావద్దకు రండి! ఆనందం పొందండి! మీమీ పనులు చేసికొంటూ కూడ, మీరా ఆనందాన్ని అనుభవించవచ్చు. శాంతిని పొందవచ్చు.
గద్ద, కోతి, చీమ
భగవంతుని చేరే మార్గాలు మూడురకాలుగా వున్నాయి.
మొదటిది గద్ద పద్ధతి. గద్ద ఆకాశంలో పైన ఎక్కడో విహరిస్తుంటుంది. కాని దాని దృష్టి, కింద ఏ పాముమీదనో, కోడిపిట్ట మీదనో వుంటుంది. ఉన్నట్లుండి అది సూటిగా తన లక్ష్యంపై అత్యంత వేగంగా దిగిపోయి దాడి చేస్తుంది. ఆ వేగం, ధాటివల్ల ఆ పిట్టో, పామో సందడి పసిగట్టి తప్పించుకొని పోవడం కూడా కద్దు.
రెండవది కోతి విధానం. కోతి ఒక కొమ్మపైనుండి మరో కొమ్మపై దూకుతుంది. ఏ పండు బాగుందో, ఏ పండు బాగులేదో తేల్చుకోలేదు. ఊగిసలాటలో పడుతుంది.
మూడవ రకం చీమ. నిదానంగా వెళ్లినా, చీమ తాను మంచిదనుకొన్న వస్తువువైపు సూటిగాపోతుంది. పండును గట్టిగా కొరికి రాలిపోయేలా చేయదు. కనిపించిన పండ్లన్నీ కొరకదు. తనకు కావల్సిన పండును కూడా తానారగించ గల్గినంతవరకే కొరుకుతుంది.
భగవంతుడిచ్చిన ఆయువును బట్టలూ, నగలూ కొనటానికీ, బజార్లవెంట తిరగటానికీ, చిల్లర సరదాలకూ వృధాచేయకండి! ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి కూర్చొని, అంతర్ముఖులు అయేదెప్పుడు? అప్పుడప్పుడన్నా ఏకాంతాన్ని వెతుక్కోండి! వౌనంగా కూర్చోండి! ధ్యానమగ్నులు కండి! ఆత్మానందాన్ని అనుభవించండి!
జన్మసార్థకం చేసుకో
అనేక జన్మల పుణ్యంవల్ల మనిషి జన్మ లభించింది. పూర్వజన్మ సంస్కారంవల్ల సాయిదర్శనం అనే అనన్యసామాన్యమైన అదృష్టం కలిగింది. సంసార సాగరంలో మునిగి నీవు సాహసంతో వెలికితీసిన అపురూప ముత్యం సాయికృప! దానిని చేజార్చుకొని తిరిగి సముద్రంపాలు చేయకు! దానినే గట్టిగా నమ్ముకో! దానిని శాశ్వతంగా అనుగ్రహించమని ప్రార్థించు. అది అందించే ఆనందంతో తన్మయుడవు కా! నీ జన్మసార్థకం చేసుకొనే మార్గం యిదే!
ఇంకా ఉంది