సబ్ ఫీచర్

నిజాయితీగా.. ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల వ్యక్తిగత అవసరాలకు ధనాన్ని ఎరగా వేసి ఓట్లు దండుకోవటమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలవారు పోటీలు పడుతున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను, దేశ ఆర్థిక పుష్ఠికి చేయూతనిచ్చే పథకాలకు తిలోదకాలు వదలి తమ గెలుపే ముఖ్యంగా అధికార లాలసనే ధ్యేయంగా ఓటర్లను అమాయకులుచేసి తమ పబ్బాలు గడుపుకుంటున్నారు. దీనివలన ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమై, ద్రవ్యోల్బణానికి దారితీసి, ధనిక పేదల వర్గ యుద్ధాలకు దారితీసి అంతర్యుద్ధాలతో అట్టుడికిపోయి వలసలకి దారితీస్తాయి. ఈ నగ్న సత్యాలను ఇతర దేశాలలో ఎన్నింటికి చూస్తున్నా మనకు కనువిప్పు కలగకపోవడం విడ్డూరంగా ఉన్నది. తమ వరకు ఆ ముప్పు వస్తేగదా అప్పటివరకు మనకు ఎందుకు అనే నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం తాము కూర్చొన్న కొమ్మ తాము నరుక్కొన్న చందమే అవుతుంది.
ఈ ఫిబ్రవరి 2020లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపొందినా, ఆంధ్రలో వైయస్‌ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిగారు అధికారం చేపట్టినా తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. పార్టీకి తిరుగులేని అధికారంతో రెండవసారి గెలుపొందినా ఈ ఉచిత తాయిలాల ప్రభావమే అని చెప్పక తప్పదు. తమిళనాడులో కరుణానిధిగారు టీవీ సెట్‌లు ఇస్తాను అంటే కుమారి జయలలితగారు కలర్ టీవీలు ఇచ్చి ప్రజల ఓట్లు కొల్లగొట్టారు. ఇలాంటి వారికి దేశం సమాజం ఏమైతే వారికి ఏమిటి? తాము అధికారంలో ఉన్నామా లేదా? అనేదే వారికి ముఖ్యం.
సమాజంలోని అన్ని వర్గాల ప్రాంతాల ప్రజలను కుల, మత వర్గాల విచక్షణతో సంబంధం లేకుండా అందరి అభివృద్ధిని, ఉన్నతిని, ప్రగతిని కాంక్షించి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టాలి. నిరుపేదలు, అభ్యాగతులు, కష్టాలలో ఉన్న వారిని తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం వారికి రాజకీయ నాయకులకు ఉంది. ఈ ముఖ్య ఉద్దేశ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇరుసుగా పనిచేసి సంక్షేమ రాజ్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి ప్రాముఖ్యత పెరిగి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించడానికి అవకాశం ఏర్పడుతుదం.
అందువలన ప్రజల యొక్క ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత కలిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక ఆయుధం కన్నా, బలమైన వస్తువుగా మారింది. పూర్వకాలంలో యుద్ధాలతో రాజులను ఓడించి సామ్రాజ్యాలు ఆక్రమించి ప్రభుత్వాలు ఏర్పాటుచేసుకొనేవారు. అదే నేటి కాలంలో ఓట్లు సంపాదించుకొని అధికారాలు చేపడుతున్నారు. అందుకని విలువైన అరుదైన ఓటు హక్కును ఉపయోగించుకొనే వ్యక్తి ఎంతో తెలివిగలవానిగా, ఆదర్శ పురుషునిగా మానవతా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వానిగా ఎదగాలి. తాను వేసే ఓటు తనకు, తన సమాజానికి, తన దేశానికి మంచి జరిగేదిగా ఉంటూ దేశ అభివృద్ధికి, దేశ రక్షణకు పాటుపడే విధంగా ఉండాలి. అప్పుడే ఓటు హక్కుకు సరైన న్యాయం జరిగినట్టుగా భావించాలి. ఈ పవిత్ర ఓట్ల యజ్ఞంలో ప్రజలందరూ చైతన్యవంతులై పాల్గొనటానికి వారికి వివేకముతో కూడిన తెలివితేటలు జ్ఞానము ఎంతైనా అవసరం.
ఇందుకొరకు మన సమాజాన్ని ఈ విధమైన చర్య ద్వారా ప్రేరేపితం చెయ్యడం అవసరముంది.
1. కుటుంబ విలువలను పెంచే విద్యావిధానం అమలుచెయ్యాలి.
2. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే ఆదర్శాలను చిన్నప్పటినుంచీ బోధించాలి.
3. సమాజంలో ఉన్న ఇరుగుపొరుగు వారితో స్నేహభావంతో, సౌశీల్యంతో మెలగుతూ ఆపదలో ఉన్న లేక అవసరమైన వారికి తమకు వీలైన సహాయ సహకారాలను అందించే లక్షణాలను అలవాటు చెయ్యాలి.
4. అన్ని మతాల వారితో ఐకమత్యంగా ఉంటూ తోటి వారిని గౌరవించడం నేర్పాలి.
5. భిన్నత్వంలో ఏకత్వం ఈ ప్రపంచం యొక్క క్షేమానికి, అభివృద్ధికి మూలం. అందులో మన భారతదేశం మొదటి నుంచ ఈ సిద్ధాంతాలకే కట్టుబడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రపంచానికి గురుస్థానంలో ఉండి మార్గదర్శకంగా ఉన్నది. సోదర ప్రజానీకం పట్ల దయ, మానవతా, కరుణ కలిగి ఉండే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దాలి.
6. దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, గౌరవాలు కలిగే విధంగా చిన్న పిల్లలలో ఆలోచనలు, అభిప్రాయాలు కల్పించే విధంగా విద్యాప్రణాళికలు అమలుచెయ్యాలి.
7. ఆత్మగౌరవాన్ని, నీతి నిజాయితీని ప్రబోధించే పాఠ్యాంశాల్ని కథలుగా మలచి ప్రబోధించాలి.
8. అన్యాయం ఎక్కడ జరుగుతున్నా, సమీపంలో జరుగుతున్నా ప్రశ్నించే ధైర్యం, తెగువ ప్రబోధించే విధంగా యువకులలో ఆలోచనలు రేకెత్తించాలి. అప్పుడే అన్యాయం, దుర్మార్గం, మోసాలు, చేసే వారికి సమాజంలోని అధికార వర్గాలలో స్థానం లేకుండాపోతుంది.
9. శ్రమే దైవం, కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్ముతో హాయిగా, ఆనందంగా గౌరవంగా బ్రతికే విధంగా సమయాన్ని సన్నద్ధం చెయ్యాలి.
10. ఉచితాల పేరున రాజకీయ నాయకులు ఇస్తున్న బిస్కెట్‌లాంటి తాయిలాలను తిరస్కరించే విజ్ఞతను, తెలివితేటలను ప్రజలకు కలిగే విధంగా మీడియా ద్వారా తెలియచెయ్యాలి. అప్పుడే దేశ ప్రజల ఉమ్మడి ధనం వ్యర్థమైపోకుండా అరికట్టడానికి వీలవుతుంది.
ప్రజలు ఎప్పుడైతే ఈ విధంగా జాగృతమై తమ ఓటు హక్కును వినియోగించుకొంటారో అవకాశవాద రాజకీయ నాయకులు సోదిలో లేకుండా కనుమరుగవుతారు. అంతేగాదు రాజకీయ నాయకులకు కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. ఏ నాయకుడైతే అవినీతి పరుడవుతాడో ప్రజలు అతన్ని ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పి మూలన కూర్చోబెడతారు.
అందుకని ఉచితాలు, అనుచితాలుగా ప్రజలందరూ అంగీకరించి తిరస్కరించిన నాడే దేశ ప్రగతి ప్రజల సంక్షేమంతో అభివృద్ధిపథంలోకి దూసుకుపోతుంది అనుటలో అణుమాత్రమైన సందేహం లేదు.

- ‘జనశ్రీ’, 7995900497