సబ్ ఫీచర్

కానరాని కంప్యూటర్ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కారు బడుల్లో కూడా డిజిటల్ విద్యాబోధన జరగాలని అప్పటి కేంద్ర సహాయక ఐ.టి. మంత్రి కిల్లికృపారాణి అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. నేటికి రెండు సంవత్సరాలు పైబడినా ఈ పథకం నీరుకారిపోయింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో కంప్యూటర్లను కొనుగోలు చేసినా ఈ కంప్యూటర్లు ఏమయ్యాయో వీటి అతీగతీ లేదు. ఈ పథకానికి సంబంధించి 25 కోట్లను కేంద్రం కేటాయించి అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ డిజిటల్ విద్యావిధానాన్ని అమలుచేయాలని తలంచింది. బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కార్పొరేట్ తరహాలో విద్యను అందించాలనే సదుద్దేశం ప్రభుత్వానిది. పిల్లల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కల్గించి ప్రపంచ దేశాలతో దీటుగా మన విద్యార్థులు కూడా పోటీపడాలని ప్రవేశపెడితే అవినీతి మకిలతో పథకం ఎందుకూ కొరగాకుండా పోయంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వం మారడంవలన ఈ విద్య మూలపడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పథకం ద్వారా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 296 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ కంప్యూటర్లను ఆర్.వి.యం. ద్వారా కొనుగోలుచేసి పాఠశాలలకు అందజేయడం జరిగింది. ఈ కంప్యూటర్లు ఎక్కడ చూసినా నేడు కానరాని పరిస్థితి ఈ కంప్యూటర్లు నాసిరకానికి చెందినవి కావడంతో.. చాలా పాఠశాలల్లో ఇవి పనిచేయకుండా వున్నాయి. కొన్ని పాఠశాలల్లో దుమ్ము, ధూళితో దర్శనమిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక చక్కని పథకాన్ని సక్రమంగా అమలుచేయకపోవడం శోచనీయం.
కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం వున్న డిజిటల్ తరగతులకు దీటుగా ఈ సిటీ ప్రాజెక్టు పాఠశాలల తరగతుల్లో నిర్వహించాలనేది అసలు ఉద్దేశం. పాఠశాలల్లో నెలకొల్పిన కంప్యూటర్లలో విద్యార్థులకు అవసరమైన విజ్ఞానదాయకమైన పాఠ్యాంశాలను వాటిల్లో నిక్షిప్తం చేయడమే కాకుండా, వివిధ అంశాలకు చెందిన విషయ పరిజ్ఞానాన్ని కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావచ్చు. ఇందుకోసం వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన నిపుణులు, ఉపాధ్యాయులచే ఆయా అంశాలను వాటిల్లో భ ద్రపరచి విద్యార్థులకు బోధించవచ్చు. విద్యార్థుల్లోగల ప్రతిభను మెరుగుపరచుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ కంప్యూటర్ డిజిటల్ విద్యావిధానాన్ని 2014 ఫిబ్రవరి నెలలో ప్రారంభించినప్పటికీ ఇంతవరకు తగిన ఫలితా న్నివ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి మారిపోవడంతో ఈ పథకం ద్వారా కంప్యూటర్ల కొనుగోళ్ళలో పెద్దమొత్తంలో కుంభకోణం జరిగిందని ఆరోపణలు వినిపించాయి. ఏది ఎలాఉన్నా బడుగు బలహీనవర్గాలకు వరంగా మారాల్సిన ఈ విద్య.. ‘కంప్యూటర్ విద్య అందని ద్రాక్ష’గా మారిపోయిందనటంలో అతిశయోక్తి లేదు. ఉద్దేశం మంచిదైనా అమలు సక్రమంగా లేకపోయనా, అవినీతి రాజ్యమేలినా ప్రభుత్వం ప్రారంభించే పథకాలు ఎందుకూ కొరగాకుండా పోతాయనడానికి ఈ కంప్యూటర్ విద్యే ఒక ప్రహసనం. కొనుగోళ్లనుంచి, అమర్చే వరకు అవినీతి తాండవిస్తే, కంప్యూటర్లు అలంకారంగా మిగలక మరేమవుతాయ. ప్రస్తుతం అదే జరిగింది. ప్రభుత్వానికి కోట్లు ఖర్చయ్యాయ. కాని లబ్దిదారులైన పిల్లలకు కంప్యూటర్ విద్యమాత్రం అందడం లేదు. రికార్డుల్లో అన్ని సమకూర్చి నట్టుగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి కంప్యూటర్ విద్యపై చిత్తశుద్ధి ప్రదర్శించాలి.
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఈ విద్య విద్యార్థులకు ఎంతో అవసరమని నేటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహిస్తూ ఈ కంప్యూటర్ విద్యపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రతీ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పూర్తి అధ్యాపక బృందాలతో విద్యాబోధన చేపడితే బడుగు, బలహీనవర్గాల విద్యాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిద్దాం!

- ఈవేమన