సబ్ ఫీచర్

అంతటా అభివృద్ధి వీచికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లెట్ రైలు వేగానికి, అభివృద్ధికి చిహ్నం. ఇప్పుడు అది అహ్మదాబాద్- ముంబాయి మధ్య పరిగెత్తనున్నది. పనులు ప్రారంభమయ్యాయి. అంటే దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది.
మరో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్ట్ పద్ధతిని దేశంలో ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల అత్యంత వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. దీనికి సంబంధించి ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. తొలుత పూణె-ముంబాయి మధ్య ఈ మార్గాన్ని వేయనున్నారు. వెలుగులు పంచనున్నారు.
అంతేనా? కాదు భారత మాల... సాగర మాల ప్రాజెక్టుల పనులు ప్రాంభమయ్యాయి, పురోగతిలో కనిపిస్తున్నాయి. నీటి అడుగుభాగాన మెట్రోరైలు ప్రయాణం కోల్‌కతా ప్రజలు చేయనున్నారు. బుల్లెట్ రైలు సైతం కొన్ని కిలోమీటర్లు నీటి అడుగు భాగంలో ప్రయాణిస్తుందని భావిస్తున్నారు ఇది అద్భుతమేకదా? ఆనందదాయకమే కదా?
యూరప్‌లో ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి ఇక్కడా విశాలమైన రోడ్లపై ఎలక్ట్రిక్ కేబుల్ ఆధారంగా ట్రక్కులు, బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ-ముంబాయి మధ్య అనేక కోట్లు ఖర్చుచేసి ఈ ప్రాజెక్టును పూర్తిచేయనున్నారు. ఇది భారత దేశ మొట్టమొదటి ఈ (ఎలక్ట్రానిక్) హైవే అవుతుంది. ఈ ప్రాజెక్టువల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది, సంప్రదాయ ఇంధన వాడకం తగ్గుతుంది. ప్రయాణ వేగం పెరుగుతుంది. సరకులు త్వరగా గమ్యస్థానం చేరుతాయి. దారిపొడవునా సరికొత్త, ఆధునిక ‘‘వాతావరణ’’ సృష్టి జరగబోతున్నది. వినోద కూడళ్లు, హోటళ్లు, కమ్యూనికేషన్ సెంటర్లు రానున్నాయి.
మార్గమధ్యంలోని అనేక ప్రాంతాలను, గ్రామాలను దీనికి అనుసంధానం చేస్తారు. సహజంగా ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధిచెందుతాయి. ఆధునికతతో తులతూగుతాయి.
‘్భరత మాల’ పేర భారతదేశ నలుమూలలకు జాతీయ రహదారులను కలిపే గొప్ప కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గుజరాత్‌నుంచి మిజోరామ్ వరకు జాతీయ రహదారులను కలపడం, విస్తరించడం, అనేక వంతెనలు నిర్మించడమంటే సాధారణ పనికాదు. ఇక ఇదే కానె్సప్ట్‌తో ‘సాగర మాల’ను చేపట్టారు. దేశంలోని వివిధ ఓడరేవుల అభివృద్ధితో వ్యాపార - వాణిజ్య పెరుగుదలకు కృషి జరుగుతోంది. అటు భారత మాల, ఇటు సాగర మాల వల్ల దేశం మొత్తంగా వౌలిక సదుపాయాల రంగంలో సరికొత్త విప్లవం చోటుచేసుకోబోతోంది. కొత్తతరం ఆశలు విచ్చుకునేలా పనులు జరుగుతున్నాయి. ఆరులేన్ల, ఎనిమిది లేన్ల రోడ్లు... జాతీయ రహదారులు ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకోవడమంటే అదేమి మామూలు విషయం కాదు.
ఆయా నగరాలలో కొత్తగా మెట్రోరైళ్లు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, పూణె... ఇట్లా అనేక నగరాల్లో కొత్తగా మెట్రో రైళ్లు ప్రజల జీవన విధానాన్ని మార్చాయి. పాట్నా, బొంబాయితో సహా ఇంకా అనేక నగరాల్లో మెట్రోరైళ్లు పరుగుదీయనున్నాయి.
ఇక అంతర్జాతీయ విమానాశ్రయాలు సైతం కొత్తవి నిర్మాణంలో ఉన్నాయి. నయా బొంబాయిలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. నయా రాయపూర్‌లోనూ రానున్నది. తాజాగా స్మార్ట్ నగరాలు, నాలెడ్జి నగరాలు దేశంలో రూపుదిద్దుకుంటున్నాయి.
జమ్మూ-కాశ్మీర్‌లో ప్రతిష్టాత్మకమైన రైల్ టన్నల్‌ను... రోడ్డు టన్నల్‌ను నిర్మించారు. శ్రీనగర్‌నుంచి కార్గిల్‌కు వెళ్ళేందుకు దీనివల్ల సులువవుతుంది. మంచు కురిస్తే దారులు మూసుకుపోయి ఇబ్బంది పడకుండా వేగంగా గమ్యంచేరుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇది పీర్ పంజాల్, బనియాల్ ప్రాంతాలను కలుపుతుంది. సైనికులకిది వరప్రదాయినిగా మారింది.
దక్షిణాదికొస్తే తమిళనాడులోని రామేశ్వరం- ధనుష్కోటిని కలిపే పాత వంతెన స్థానంలో కొత్త వంతెనను నిర్మించనున్నారు. అలాగే చెన్నై- బెంగళూరు కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఇదొక కమర్షియల్ హబ్‌గా రూపొందనున్నది. ఆర్థిక ఎదుగుదలకు ఇది దోహదపడనున్నది. దీనిపై దక్షిణ భారతానికి ఎన్నో ఆశలున్నాయి. కేరళలోనూ ప్రతిష్టాత్మక రీతిలో వౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. అలాగే ఢిల్లీ-మీరట్ కారిడార్, కాశీ విశ్వనాథ్ కారిడార్‌ల పనులు ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల పెద్దపెద్ద ప్రాజెక్టులు, కారిడార్లు, జాతీయ రహదారుల అనుసంధానం, జలమార్గాల అభివృద్ధి, ఓడరేవుల అభివృద్ధి జరుగుతోంది. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లోనూ రిషికేష్- కర్నోప్రయాగ్ రైలుమార్గం పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. చార్‌ధామ్ పర్యాటకులకు చార్‌ధామ్ వికాస్ పరియోజన పేర మెరుగైన మార్గాలను రూపొందిస్తున్నారు. స్వర్గంలాంటి ఆ ప్రాంతం లో రైలుమార్గం రావడం సాధారణ ప్రజలకు సైతం మేలుకలుగుతుంది. వారణాసిలో గంగానది శుద్ధి కార్యక్రమం నమామి గంగ పేర పెద్దఎత్తున జరుగుతోంది.. స్వచ్ఛ్ భారత్ సరికొత్త ఆలోచనలకు స్ఫూర్తినిస్తోంది. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. చెత్తనుంచి సంపదను సృష్టించండి అన్న నినాదం అందర్ని ఆకర్షిస్తోంది. మురుగునీటిని సైతం శుద్ధిచేసి ఇతర అవసరాలకోసం, పరిశ్రమలకోసం పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. ఆ రకంగా నీటిని ఆదాచేస్తున్నారు. ఇలాంటి అనేక పనులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. బయో ఫెర్టిలైజర్ తయారీ పెరిగింది. విదేశాలనుంచి క్రిమిసంహారక మందుల దిగుమతి తగ్గించుకోవాలన్న స్పృహ పెరిగింది. డీజిల్, పెట్రోల్ బదులు ఇథనాల్ ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇథనాల్ తయారీకి విశేషకృషి జరుగుతోంది. సంప్రదాయ ఇంధనాలకు దూరం జరగాలన్న స్పృహ కనిపిస్తోంది. సౌర విద్యుత్, పవన విద్యుత్‌పై అవగాహన పెరుగుతోంది.
పటిష్టమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు ఈ వౌలిక సదుపాయాల కల్పనతోపాటు సహజంగానే విద్య-వైద్యం, వినోదం - పర్యాటకం ఇతర రంగాల అభివృద్ధి వేగవంతమవుతున్నది. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న అంశాలు. ఒక రంగంలో జరిగే అభివృద్ధి ప్రభావం ఇతర రంగాలపై పడుతుంది. ఆ రకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ చైతన్యవంతంగా ముందుకు కదిలేందుకు వర్తమాన ప్రాజెక్టులు... పనులు... పరిశ్రమ దోహదపడుతోంది. ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబాయి, పూణె, నాసిక్, నరుూ ముంబాయిలో అనేక కార్యక్రమాలు జోరందుకున్నాయి. ముంబాయిలోనే ‘‘నమస్తే టవర్’’ పేర ఓ పెద్ద ఆకాశ హర్మ్యం నిర్మాణమవుతోంది. దీన్ని ఓ దుబాయి కంపెనీ రూపకల్పన చేసింది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్టుగా దీన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఎలిఫెంటా ద్వీపానికి రోప్‌వేను వేస్తున్నారు. నాసిక్-పూణెల మధ్య హైస్పీడ్ రైలుమార్గం రానున్నది. ఇట్లా కనెక్టివిటీ పెరగడమంటే ఉద్యోగాలు పెరగడం, విద్య పెరగడం, సాంకేతికత పెరగడం, పేదరికంనుంచి బయటపడటం అన్న విషయం అందరికీ తెలిసిందే!
ఒడిశాలో సువర్ణరేఖ ఓడరేవును పెద్దఎత్తున ఆధునీకరించబోతున్నారు. మరిన్ని వౌలిక సదుపాయాలు అక్కడ అభివృద్ధి చెందనున్నాయి.
దేశ రాజధానిలో అంతర్జాతీయస్థాయి ఎక్స్‌పో సెంటర్‌ను నిర్మిస్తున్నారు. సదస్సుల నిర్వహణకు, వినోదానికి సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గౌహతిలో ట్విన్‌టవర్ ట్రెడ్ సెంటర్ నిర్మాణంలో ఉంది. సిలిగురి- గ్యాంగ్‌టాను కలిపే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కొనసాగుతోంది. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మోతెరాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాక సందర్భంగా అందరు చూశారు. ఆ స్టేడియం అతి త్వరలో పూర్తిగా అందుబాటులోకి రానున్నది.
ఇట్లా గుజరాత్ నుంచి మిజోరామ్‌కు, కమ్మూకాశ్మీర్ నుంచి కన్యాకుమారి... రామేశ్వరం వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. బుల్లెట్ రైలు, హైపర్ లూప్ మెట్రో రైళ్లు, ఈ (ఎలక్ట్రానిక్) హైవే లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తయితే, సాగర మాల, భారత మాల కల సాకారమైతే, మెట్రో నగరాలు, నాలెడ్జి హబ్‌లు పూర్తయితే, బృందావన్‌లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న చంద్రోదయ మందిర నిర్మాణం పూర్తయితే, ‘ఇస్రో’ గగన్‌యాన్ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రతిష్ట ప్రపంచంలో పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అందుకు అందరూ ఏకోన్ముఖులై కదలడమే ముఖ్యం. ఎలాంటి కుంభకోణాల గోల లేకుండా ‘‘దేశం ఫస్ట్’’ అన్న కానె్సప్ట్‌తో కదలడం అత్యంత గౌరవనీయం. అందుకే నమస్తే భారత్ అందాం!

- వుప్పల నరసింహం, 9985781799