సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతృప్తియే సంపద
శ్రీరాముడు అరణ్యవాసమునకు పోయేముందు తన సమస్త వస్తువులనూ సర్వులకూ దానంచేస్తూ వచ్చాడు. అది విని అనేకమంది బ్రాహ్మణులు వచ్చారు అందులో ఒక బ్రాహ్మణుడు నడువలేక నడువలేక కూర్చుంటూ పడుతూలేస్తూ వచ్చాడు. దీనిని గమనించాడు రాముడు. దగ్గరకు వచ్చిన తరువాత ‘విప్రోత్తమా! దేనికోసమొచ్చావు? ఏం కావాలి? అని అడిగాడు రాముడు. ‘నాకు ఏమీ అక్కరలేదు. నాకు వయస్సు అయిపోయింది. ఈ దేహమును ఏ నిముషంలో వదలుతానో! ఏమిటో! తమరు 14 సం.లు పాటు అరణ్యాలకు వెళ్ళుతున్నారట. తమరు అయోధ్యకు తిరిగి వచ్చేటప్పటికి నేను బ్రతికి వుంటానో! లేదో! అందువలన తమర్ని కనులారా చూచి వెళ్లుదామని వచ్చాను’అన్నాడు ఆ విప్రుడు. అప్పుడు శ్రీరాముడు ‘ఓ విప్రోత్తమా! నీ పవిత్రమైనటువంటి హృదయము నా హృదయాన్ని కరిగించింది. కదిలించింది. నీకేమికావాలో కోరుకో!’’ అన్నాడు. ‘నాకేమి అక్కరలేదన్నాడు’ ఆ విప్రుడు. అతని పేరు త్రిజటుడు. ఒక కర్రను అతనికి యిచ్చి, బలంకొద్దీ కర్రను విసురు. ఎంతవరకు పోతే అంత ప్రదేశమును, ఆ ప్రదేశంలోని సమస్త సంపదలను యిస్తానని చెప్పాడు శ్రీరాముడు. ‘ఓ రామా! నాకు కోరిక లేనప్పటికినీ, నీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. భగవంతుని ఆజ్ఞ శిరసావహించాలి. ఇది నా కర్తవ్యము’అని విప్రుడు ఆ కర్రను తీసుకొని ‘రామా!’ అని విసిరాడు. మహాబలవంతుడు కూడా విసరలేనంత దూరం ఆ కర్రను విసరగలిగాడు.
రామశక్తియే దీనికి మూలకారణమని భావించాడు. అప్పుడు శ్రీరాముడు ఆ ప్రదేశమును, దానిలోనున్న సిరిసంపదలను ఆ బ్రాహ్మణునికి యిచ్చి వేశాడు. అప్పుడు ఆ త్రిజటుడు ‘ఇదంతా నాకెందుకు స్వామీ! నేనీ స్థితిలో వుండటం చేతనే నిన్ను అనేక విధముల స్మరిస్తూ కూర్చున్నాను. నా గతి, నా స్థితి, నా మతి, నా సంపత్తి సర్వమూ శ్రీరామచంద్రుడే. అందువలననే నిన్ను చూడటానికి వచ్చాను. సుందర విగ్రహమును చూస్తూంటే సమస్తమునూ మరచిపోయాను. ఈ ఆనందమును నా జీవితముండినంతవరకు నాకు అందించు. ఇది చాలు’ అన్నాడు.
నిలిచేది ఏది?
నమ్రతను అలవరచుకో. క్రమశిక్షణ, కరుణ వీటిని పెంచుకో. ఇంత వాడిననీ గర్వాన్ని వదిలేయి. ‘నేనింత పెద్ద ఆఫీసర్ని. నేనింత పెద్ద వ్యాపారస్థుడను, నేనింత పండితుడిని, నేనింత పరువూప్రతిష్ఠా కలవాడిని. ఈ దరిధ్రుల వెంటా, దీనుల వెంటా తిరగాల్నా? అనుకోవద్దు. అటువంటి పిచ్చిపిచ్చి సందేహాలు పెట్టుకోవద్దు. హంస లేచిన మరుక్షణం నీ వింతగా గర్వపడే రుూ హోదాలూ, అర్హతలూ, యోగ్యతలూ అన్నీ చెల్లు! ఇంకా మాట్లాడితే, అంతకుముందే అవి రద్దయినా ఆశ్చర్యం లేదు. నీవు యితరులకు చేసే సహాయం, అందువల్ల పొందే తృప్తీ, ఆనందం యివి నీ తోటే వుంటాయి.
సత్యానే్వషణకు లోపం
బ్రహ్మాండం అంతా సత్, చిత్, ఆనందంతో నిండివుంది. సత్ పదార్థంగా వుంటున్నది. మనం చిత్స్వరూపం అయిన తెలివిని కలిగి ఆనందాన్ని పొందాలి. సత్, చిత్, ఆనందమనే మూడే దైవత్వం. అది మనలో గూఢంగా వున్నా బలీయంగా వుండే శక్తి. సత్యాన్ని తెలుసుకోకుండా అనేక భావనలను చేయటం వాటిని గొప్పగా ప్రదర్శిస్తూండటం జరుగుతుంది. మానవాళి భయంతో ద్వేషంతో బాధపడుతున్నది. దీనివలన సత్యానే్వషణకు లోపం కలుగుతూ వుంది.
అద్భుత దైవశక్తి
చిన్నతనంనుండే భజన, ప్రార్థన, ధ్యానం వంటివి నేర్చుకోవాలి. భగవంతుని సృష్టిలో అద్భుతాలను గురించి పిల్లలు మననంచేసేలా వారిని ప్రోత్సహించాలి. పుట్టపర్తి సాయిబాబా నీకేం యిస్తాడో దానిని లెక్కలేసుకుంటూ కూర్చోకు. నీవు నాదగ్గరకు రావాలి అని నిన్ను ఆకర్షించటానికి కాదు, నేను నీకు ఏదైనా యిచ్చేది నిన్ను ఆనందంలో ఓలలాడించటానికే. ఆనందాన్ని వర్షించటమే నా పని. మీరు నన్ను ప్రస్తుతించాలని నాకు లేదు. మీరు నాపట్ల విశ్వాసం వుంచితే నాకు చాలు. నిగూఢమైన, వర్ణనాతీతమైన అద్భుత దైవశక్తి నేడు మీకు దగ్గరగా వచ్చింది. ఫలవంతం కాని ఏ పనీ అది తలపెట్టదు.
ఇంకా ఉంది