సబ్ ఫీచర్

మా తిండి.. మా ఇష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కొన్నాళ్ల క్రితం కంచె ఐలయ్య అనే షెపర్డ్ ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వహించాడు. ఇదేం ఉత్సవం? అని ప్రశ్నిస్తే మా తిండి మా ఇష్టం అన్నాడు. న్యూఢిల్లీలోని కేరళ హౌస్ వంటి ప్రాంతాల్లో గోమాంసం సర్వ్ చేయటంపై నిషేధం విధిస్తే స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ సపరివారంగా వచ్చి సత్యాగ్రహం చేసి, ‘మా తిండి - మా ఇష్టం’ అని రంకెలు వేశాడు.
ఎవరి తిండి వారి ఇష్టమేనా? మానవుడు సంఘజీవి. నీవు ఒక తినకూడని పదార్థం తింటే దాని ప్రభావం నీ కుటుంబం మీద మాత్రమేకాదు నీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరి మీదా పడుతుంది. కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక విచిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. ‘‘హిందువులు నమస్తే అంటూ చేతులు జోడించి అభివాదనం తెలుపుతారు. ప్రపంచంలోని వారంతా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇలాగే చేయాలి. క్రైస్తవులు షేక్‌హ్యాండ్ ఇస్తారు. ముస్లిము ‘గల్లేలగాహో’ అంటారు. ఇలాచేస్తే అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ మాటలు చెప్పింది హిందూ సాధువులు పరిపూర్ణానంద (కాకినాడ), రాందేవ్ బాబా(హృషీకేశ్) కాదు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థయే.
అంటే మానవులు ఏం తినాలో ఏం తినకూడదో, ఎలా నమస్కరించాలో ఎలా నమస్కరించకూడదో కూడా భారతీయులు నిర్ణయించారు. భారతీయులు అంటే భారతీయ ఋషులు. ఇంతకూ కరోనా వైరస్ ఎలా వస్తుంది? కరోనా అనేది లాటిన్ పదం. గుండ్రంగా ఉండే మెరిసే వస్తువు కరోనా- గబ్బిలాలనుండి ఈ వైరస్ వ్యాపించిందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. గబ్బిలాలను పాములు తిన్నాయి. ఆ పాములనుండి కరోనా పుట్టింది. చైనీయులు గబ్బిలాలను, పాములను కూడా తింటారు. మనం కాకరకాయలో వెల్లుల్లి కారం పెట్టుకుని తిన్నట్లు చక్కగా పందికొక్కులు, ఎలుకలూ తింటారు. ఇదే వారి తిండి- ‘మా కమ్యూనిజం- మా తిండి- మా ఇష్టం’ అంటున్నారు.
ఇప్పటికే మూడు లక్షల కోట్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. ఇందుకు చైనాయే కారణం. ‘‘జన చైనా- నవ చైనా, ఈ విజయం నీదేనా?’’అని లోగడ కమ్యూనిస్టులు మావోలు సేటుంగ్ మీద ఓ పాట వ్రాశారు. ఔను. ఈ కరోనా విజయం జన చైనాదే! చైనానుండి ఇవ్వాళ బయటకు విమానాలు రావు. చైనాకు పోవు. చైనాయే ఒక పెద్ద క్వారంటైన్. క్వారంటైన్ అంటే గుర్తుకు వచ్చింది. పూర్వం హైదరాబాదు నగరం సుల్తాన్‌బజారు వరకే ఉండేది. అందుకని ప్లేగువ్యాధి ఎలుకలనుండి వచ్చినప్పుడు నల్లకుంట ప్రాంతంలో క్వారంటైన్ ఏర్పాటుచేశారు. ఇప్పుడు జనాభా పెరిగి నల్లకుంట క్వారంటైన్ నగర మధ్యలో మురికి మూసీనది గట్టుమీద ఉంది.
తక్షణమే దీనిని నగరానికి దూరంగా తరలించవలసి ఉంది. హైదరాబాద్‌లో ఒక ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. వెల్లుల్లి, లవంగాలు కలిపి ఉడికించి ఆ రసం తాగితే కరోన వైరస్ రాదు- అని చెపుతున్నారు. ఇది ఖర్చులేని ఔషధం.
అపోలో హాస్పటల్‌కు, ఇతర కార్పొరేట్ హాస్పటల్స్‌కు పోతే జలుబు చేసింది అంటే లక్ష రూపాయలు బిల్లువేశారు. మళ్లీ మొదటికి వద్దాం. మానవుడు సంఘజీవి. నా తిండి నా ఇష్టం - అంటే కుదరదు. నీ ఇష్టమైతే పోయి అడవులల్లో జంతువులతోబాటు కలిసి జీవించు-నగరాలల్లో జనుల మధ్య జీవించాలంటే సభ్యసమాజంలో కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా గోవులను తినటం మానండి. గబ్బిలాలను, పాములను తినకండి. చైనాలో పాములను తినటం మొదలుపెట్టేసరికి ఎలుకలు విపరీతంగా పెరిగిపోయి పంట పొలాలను నాశనం చేశాయి. ఎందుకంటే పాము పొలంలో ఉంటే అది ఎలుకలను తింటుంది. దీనినిబట్టి ప్రకృతిలోని సహజ సంతులనాన్ని ధ్వంసంచేస్తే ప్రకృతి పగపడుతుంది. ఆవు సాధుజీవి. గడ్డి తింటుంది. దానికి మాంసం దాణా తినిపించారు. ఫలితంగా మాడ్‌కౌ డిసీజ్ వచ్చి బ్రిటన్‌లో పెద్దసంఖ్యలో ఆమధ్య చనిపోయారు. భారతీయ ఋషులను పరిహసించకండి. వాటికన్ నుండి బీజింగ్ నుండి సౌదీ అరేబియాల నుండి వారి సంస్కృతులను ఆహారపు అలవాట్లను దిగుమతి చేసుకోకండి.
పగలు సూర్యుడు ఉన్నప్పుడు జీర్ణప్రక్రియలు బాగా జరుగుతాయి. పగలు ఉపవసించి రాత్రి తెల్లవార్లూ తినడం అరేబియాలో ఒక పండుగగా మారింది. ప్రపంచ మానవులారా! కుక్కలను, పంది కొక్కులను, పాములను, గబ్బిలాలను తినకండి-
ఈగల్లా రాలిపోతున్న చైనా ప్రజలపై మానవతా దృక్పధంతో సానుభూతి ప్రకటించండి. కాని చైనా ప్రభుత్వాన్ని వారి ఆహారపు అలవాట్లను కమ్యూనిజం అనే కరోనా వైరస్‌ను తిరస్కరించండి.
హైదరాబాద్‌లో పెళ్లిళ్లకు, పొలిటికల్ మీటింగులకు చివరకు సినిమాలకూ, స్కూళ్లకూ పోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఢిల్లీలో స్కూళ్లకు శలవులు ప్రకటించారు. మొన్న మతకల్లోలాలను పాకిస్తాన్ ఒక వైరస్‌లాగా ఢిల్లీలో వ్యాపింపజేస్తే 60మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదికూడా ఒక కరోనా వైరస్‌తో సమానమే. హైదరాబాద్‌లోని వివిధ సాంస్కృతిక మందిరాలల్లోను పర్యాటక స్థలాలల్లోనూ రద్దీ తగ్గింది. ‘నన్ను దోచుకుందువటే వనె్నల దొరసాని’ అంటూ చీకటి పడేసరికి వేదికలెక్కి శబ్దకాలుష్యం సృష్టించే సోకాల్డ్ సంగీత విభావరులకు ఆదరణ తగ్గింది. ఇదంతా కరోనా ప్రభావమే.
***
సుప్రసిద్ధ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. వారికిదే నా అశ్రుతర్పణం. ఆంధ్రభూమి దినపత్రికలో 1962 ప్రాంతంలో గోరాశాస్ర్తీగారు ఎడిటర్‌గా ఉన్నప్పుడు పొత్తూరివారు, జి.ఎస్. వరదాచారిగారు స్ట్ఫాలో ఉండేవారు. పొత్తూరివారు సహృదయుడు. రచయితలను ఎంతగానో ప్రోత్సహించేవాడు. కుర్తాళం పీఠాధిపతులకు సహాధ్యాయ. ఆయనను బీజేపీవారే కాదు కమ్యూనిస్టు, తెలుగుదేశం వారు కూడా ప్రేమించటం ఒక విచిత్రం. పత్రికా రంగంలో విలువలకు కట్టుబడ్డ ఒక తరం కనుమరుగు అవుతున్నది. సెనే్సషనల్ జర్నలిజానికి పొత్తూరివారు వ్యతిరేకి. పత్రికా నిర్వహణ ఒక పవిత్ర యజ్ఞంగా భావించేవారు. ఒక సన్నిహిత మిత్రులను, అన్నగారిని కోల్పోవటం బాధాకరం. ఐనా విధి బలీయం. పుట్టినవారు గిట్టక మానరు. పొత్తూరివారికి నివాళి అర్పించటం అంటే వారి విలువలను పత్రికా రంగంలో ఆచరించటమే!!
***
ఎస్ బ్యాంకు ఎందుకు దివాలా తీసింది? 1960లో పాలై బ్యాంక్ ఎందుకు మూసివేశారు? ప్రజలనుండి డిపాజిట్లు వసూలుచేసి వాటిని బడా బాబులకు వడ్డీలకు ఇస్తారు. వాడు ఎగ్గొట్టటంతో బ్యాంకులు మూతపడుతున్నాయి. వేల కోట్లు మొండి బకాయిలు వసూలుకావటం లేదు. విజయ్‌మాల్యాలు, లలిత్‌మోడీలు విదేశాలకు పారిపోయారు. సుజనాచౌదరి వంటివారి ఆస్తులను జప్తుచేస్తాము అంటున్నారు. ఇదంతా ఒక విషవలయం. కేరళలో భారీగా కోఆపరేటివ్ బ్యాంకులలో గోల్‌మాల్ జరుగుతుంటే వాటిపై విచారణ జరుగకూడదట. ఇది న్యాయమేనా? డెబ్బది సంవత్సరాలుగా రాజకీయ నాయకులు భారత బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేశారు. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో ఎందుకు కలిపినట్లు? ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర అనే పేరు వినపడకుండా చేశారు. పివి నరసింహారావు కొన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితే అర్జున్‌సింగ్, సోనియాగాంధీలు ఆయన మీద పగపట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ, నిర్మలా సీతారామన్‌లను నిద్రపోనీయటం లేదు. ఇక ఈ దేశం ఎలా బాగుపడుతుంది? రాణాకపూర్, ఆయన కుమార్తె రోషనీకపూర్‌లపై కేసులు నమోదు చేశారు. ఇందులో క్విడ్ ప్రోకో కుంభకోణం ఉన్నదని తెలుస్తున్నది. పి.చిదంబరం (మాజీ కేంద్ర మంత్రి) ఈ నేరాన్ని వర్తమాన ప్రభుత్వం మీదికి నెట్టాడు. ఐతే 2004నుండి ఈ కుంభకోణం మొదలైనట్లు సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. అప్పుడు యుపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీనికి పి. చిదంబరం, మన్మోహన్‌సింగ్‌లు కూడా సమాధానం చెప్పాలి. కనుమొజి, నీరవ్ మోడీలు, శరత్‌పవార్‌లు దర్జాగా తిరుగుతున్నారు. సామాన్య మానవుడు నష్టానికి కష్టానికి గురిఅవుతున్నాడు.
***
ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ చూచినా హాస్యోక్తులే విన్పడుతున్నాయి.
‘‘కరోనాకపూర్‌కు స్వాగతం మాస్క్‌లు ధరించి రండి..’’
‘‘కరోనా - రోనా’’ (రోనా అంటే హిందీలో దుఃఖం అని అర్థం)
‘‘కరోనా - డరోనా మత్’’

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్