సబ్ ఫీచర్

ఆశగా.. చూస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్క సినిమా షూటింగ్‌లో -ఎక్కడ కలిసినా నారాయణరావు పద్మను ఎత్తుకొని తిప్పేసేవాడట. ఏంటండీ ఇలా చేస్తున్నారని అడిగితే.. ఇలాంటి సీన్లు సినిమాలో చాలా ఉన్నాయిగా. ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ నవ్వేసేవాడట. చివరికదే ఆ షూటింగ్ మొత్తం అలవాటుగా మారిందట.
కెరీర్ తక్కువ కాలమే సాగినా -నటి పద్మ చెప్పే ముచ్చట్లు తక్కువేం కాదు. ‘డైలాగ్స్ చదవడం ఇష్టముండేది కాదు నాకు. ఎవరన్నా చిదివితే విని ఉన్నదున్నట్టుగా చేప్పేసేదాన్ని. ఇక నటన అంటారా? నాకొచ్చినట్టు చేసేదాన్ని’ అంటూ నిజాయితీ నవ్వేసింది నటి పద్మ. ‘విముక్తికోసం చిత్రం షూటింగ్‌లోనూ సాయిచంద్ ఓ మంచి స్నేహితుడిగా ఉండేవాడంటూ’ నటి పద్మ గుర్తు చేసుకున్న ఆనాటి ముచ్చట్లు ఈవారం కూడా.
శారదతో మా తెలుగు తల్లి షూటింగ్ జరుగుతోంది. నాకు పెట్టిన విగ్గు ఊడిపోయింది. మళ్లీ ఎలా పెట్టుకోవాలో తెలీక, సెట్లో చిన్నగా ఏడుస్తూ కూర్చున్నా. అది గమనించిన శారద వెంటనే హెయిర్ డ్రెస్సర్‌ను పిలిచారు. విగ్గును సరిచేసి, క్లిప్పులు పెట్టమన్నారు. ‘ఇపుడే పెట్టానండి, కానీ ఊడిపోయింది’ అన్నాడతను. ఆడపిల్లలయ్యా అలాగే ఉంటారు. నువ్వెళ్లి ముందు విగ్గు సెట్ చెయ్’ అంటూ ఆమె గద్దించి విగ్‌ను చక్కగా పెట్టేలా చేశారు. నిజానికి ఇప్పుడాలోచిస్తే చాలా చిన్న విషయం. కానీ, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లా అంతా అయోమయంగా ఉండేది. అలాంటి ముచ్చట్లు నాకు చాలా గుర్తు -అంటూ నవ్వేశారు పద్మ.
రాకీ చిత్రం షూటింగ్‌లో రంగనాధ్, రమాప్రభల కూతురిగా నటించింది పద్మ. విగ్ ఊడిపోయే అలవాటు ఎప్పుడూ ఉంది కనుక ఈ షూటింగ్‌లో కూడా ఊడిపోయేది. వెంటనే అక్కడున్న రమాప్రభ ఎవరయ్యా, చక్కగా వున్న మొహానికి ఇంత విగ్గు పెడతారా అంటూ, ఆ విగ్గు తీసేసి రెండు జడలు వేసి మురిసిపోయేది. ఇపుడు చూడండి ఎంత బాగుందో అంటూ కామెంట్ కూడా చేసేవారు రమాప్రభ. షూటింగ్‌లో ఎక్కడున్నా అన్నపూర్ణమ్మ తల్లిగా నటిస్తూ అనేక టిప్స్ చెప్పేవారు. వెట్రి షూటింగ్ విజయ్‌కాంత్‌తో జరుగుతుంది. ఓ సీన్‌లో పద్మను ఎత్తుకొని తిప్పాలి. అలా తిప్పిన వెంటనే విజయ్‌కాంత్ ఈ అమ్మాయిని హీరోయిన్‌గా చేయండయ్యా, నేను నటిస్తా అన్నారు. నెక్ట్స్ మూవీలో ఆమె హీరోయిన్ అంటూ దర్శక నిర్మాతలు చెప్పడం చాలా ఆనందాన్నిచ్చిందంటారామె.
ఓసారి అంబరీష్‌తో షూటింగ్. బెంగుళూరులో జరుగుతున్న ఆ షూటింగ్‌లో ఆయనకు చెల్లెలుగా నటిస్తోంది పద్మ. కన్నడలో డైలాగ్‌ను ప్రాక్టీస్ చేయించారు. అదొక విషాద సన్నివేశం. అందులో బాగా చేయాలని దర్శకుడు ముందే చెప్పాడు. సరే.. పద్మను ఆటపట్టిద్దామని అంబరీష్ కెమెరాను తన వెనుక సెట్ చేయించాడు. అతని ముఖం కెమెరాలో కనపడదు. అతని ఎదురుగా నుంచున్న పద్మ యాక్షన్‌ను తీస్తున్నారు. ఏడుస్తూ వల వల కన్నీళ్లు కారుస్తూ నటించాలి పద్మ. కానీ ఆమె ఎదురుగా నుంచున్న అంబరీష్ మాత్రం కొంటె కోణంగిలా రకరకాల హావభావాలతో పద్మను వెక్కిస్తున్నాడు. అది చూస్తూ పద్మ ఆ విషాద సన్నివేశాన్ని పండించలేకపోతోంది. విషాదం బదులు గలగలా నవ్వేస్తోంది. అదేంటమ్మా.. నువ్విప్పుడు ఏడుస్తున్నట్టు నటించాలి అంటూ దర్శకుడు మరో టేక్ తీశాడు. మరో టేక్‌లో కూడా అంబరీష్ అదే ప్రయోగం చేసేసరికి నవ్వు ఆపుకోలేకపోయింది పద్మ. ఏమైంది నీకు అంటూ అరిచినంత పనిచేశాడు దర్శకుడు పద్మను. సార్ నవ్విస్తున్నారండీ అని చెప్పింది పద్మ. సరే.. నెక్స్ట్ ఇంకో షాట్ తీయండి, చేస్తానన్నది. ఈసారి షాట్‌లో అంబరీష్ ముఖం చూడకుండా పక్కనచూస్తూ డైలాగ్ చెప్పి ఏడ్చేసింది. అందుకు దర్శకుడు ఒప్పుకోలేదు. నువ్వు నీ అన్న అయిన అంబరీష్‌ను చూస్తూ డైలాగ్ చెప్పాలి, ఎటో చూస్తూ చెబితే ఎలా అంటూ ప్రశ్నించాడు దర్శకుడు. నావల్ల కావడంలేదండి. హీరోగారు నవ్విస్తున్నారు అంటూ మళ్లీ ఫిర్యాదు చేసింది పద్మ. పెద్ద హీరో కదా, ఆయన్ను ఏమనలేదు దర్శకుడు. నువ్వే కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఈ సీన్ పండించమని దర్శకుడు చెప్పడంతో జాగ్రత్తగా ఆయన ముఖ కవళకలు చూడకుండా ఆ సీన్ పూర్తిచేసింది పద్మ. అది ఇపుడు తలచుకుంటే చాలా నవ్వొస్తుందంటారామె.
సెట్‌లో వున్నపుడు చిరంజీవి కూడా అలాగే జోవియల్‌గా వుండేవారని, తనతోపాటువున్న మిగతా నటీనటుల మేకప్‌ను కూడా చూసి టచప్‌లు చేయించేవారని గుర్తుచేసుకున్నారు పద్మ. అంబరీష్‌తో సినిమా హిట్ అవ్వడంతో బెంగుళూరు కన్నడ చిత్రసీమలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అంత దూరం పోయి ఏం చేస్తాములే అన్నట్టు లైట్ తీసుకున్నారు పద్మ. ఓ రకంగా మంచి అవకాశాలను నేనే దూరం చేసుకున్నానేమో అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటా అంటారామె. కృష్ణ, శ్రీదేవి నటించిన కంచుకాగడా చిత్రంలో శ్రీదేవి చెల్లెలిగా నటించారు పద్మ. కోయగూడెంలో వుండే బిజిలీ అనే అమ్మాయి పాత్రలో నాకు మంచి పేరొచ్చింది అంటూ గుర్తుచేసుకున్నారు. ఆ షూటింగ్ అంతా పెద్ద అడవిలో చేశారు. చివరి క్లైమాక్స్‌లో ఈ బిజిలీ నీదిరా మామ అంటూ సాగే పాటలో నేనే డాన్స్ చేస్తూ నటించాలి. ఓ ఐదు రోజులు ఆ పాట కోసం డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాను. కానీ పాట విన్న తర్వాత శ్రీదేవి ఈ పాట నాకు బాగా నచ్చింది, నేనే డాన్స్ చేస్తానంటూ ముందుకొచ్చారు. దర్శక నిర్మాతలు చెప్పిచూశారు. ఇది బిజిలీ అనే పాత్రకు సంబంధించిన పాట అని. కానీ శ్రీదేవి తానే చేస్తానని పట్టుబట్టడంతో ఆ పాట ఆమెపైనే చిత్రీకరించారు. పెద్ద హీరోయిన్‌కదమ్మా, ఏం చేస్తాం అనడంతో, పోనీలే చేసుకోనివ్వండి అన్నాను నేను. అయినా అంత పెద్ద హీరోయిన్‌తో మనం పోటీ పడలేం కదా అంటూ నవ్వేశారామె.
మొండిఘటం చిత్రానికి సంబంధించిన రేప్ సీన్ షూటింగ్ చేస్తున్నారు. ఆ సీన్‌లో నేను, ప్రసాద్‌బాబు ఉంటాం. నాకు మాత్రం ఓ రేప్ సీన్ షూటింగ్ చేస్తున్నామని చెప్పారు కానీ మరేం చెప్పలేదు. ఓ గదిలో ప్రసాద్‌బాబు, నేను ఆ షూటింగ్‌లో పాల్గొనాలి. ఆయన నాపై దూకి నటిస్తున్నారు. నాకు చాలా భయమనిపించింది. వెంటనే ఆ రూమ్‌లోనే అటూ ఇటూ చిక్కకుండా పరిగెత్తాను. ఓ కుండమీద పడిపోయి గాజులన్నీ పగిలిపోయి నాకు గుచ్చుకుపోయాయి. షాట్ నాచురల్‌గా వచ్చిందని దర్శకుడు అన్నాడు. కానీ గుచ్చుకున్న గాజుపెంకులు మాత్రం బాధపెట్టాయి. హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆ గాజుపెంకులన్నీ తీయించారు. కానీ ఒకటి లోపలే ఉండిపోయింది. ఆ గాజుపెంకు ఇప్పటికీ నా శరీరంలోనే వుంది. అప్పటినుంచి ఎటువంటి టాబ్లెట్స్ తీసుకున్నా వెంటనే రియాక్షన్ వచ్చేది. నాకేదైనా బాగోకపోతే జాగ్రత్తలతోనే తగ్గించుకోవాలి కానీ టాబ్లెట్లు వేసుకోవడానికి లేదు. ఒక్కోసారి ఇవన్నీ తలచుకుంటే బాధనిపించేది.
నేటి భారతం టి.కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అందులో కూడా ఓ పాత్రలో నేను నటించాను. మొదట్లో రేప్ సీన్ నాపై చిత్రీకరిస్తారని చెప్పలేదు. నాకు మొండిఘటం షూటింగ్‌లో జరిగిన భయానక దృశ్యాలన్నీ గుర్తొచ్చాయి. ఇప్పటికి కూడా చేతిలో వుండి సలుపుపెట్టే గాజుపెంకులు గుర్తొచ్చాయి. వెంటనే ఆ సీన్‌లో నటించనని మొండికేశాను. దర్శకుడు, నిర్మాత బ్రతిమిలాడారు. ఏం కాదని బుజ్జగించారు. బ్రతిమిలాడారు. ఈ సీన్‌లో నటించకపోతే మాకెంతో నష్టం అని, మీరన్నా నచ్చచెప్పండని మా నాన్నను బామాలారు. అయినా నేను మాత్రం ససేమిరా అని ఆ సినిమానే వదులుకున్నాను. ఆ తరువాత ఆ చిత్రం సూపర్‌హిట్ అయింది. ఇప్పటికీ అప్పటి మేకప్‌మెన్, నిర్మాత ఎ.ఎం.రత్నం కలిస్తే, నేటిభారతంలో నటించాల్సింది నువ్వు అంటూ గుర్తుచేస్తే బాధనిపిస్తుంది. సరే.. జీవితమంతా బాధలతోనే గడిచిపోయింది, ఇదొక లెక్కా అంటూ నవ్వేసుకుంటాను నేను. నా కెరీర్‌ను నాశనం చేయాలనుకున్న అదృశ్యశక్తులు మాత్రం నా వెనుకే పనిచేశాయి. ఇప్పటికీ నాలో నటించే సత్తా వుంది. అమ్మ, బామ్మ, వదిన అలాంటి ఏ పాత్రలు ఇచ్చినా సిద్ధమే. పరిశ్రమలో అందరూ మంచివారే. కానీ నా వెనకున్న అదృశ్యశక్తులే నాకు ఏ అవకాశాలు రానివ్వడంలేదు. స్టోరీతో లింకు వున్న పాత్రల కావాలని అడుగుతాను నేను. తలా తోకా లేని పాత్రలు ఎన్నో నటించమంటూ వచ్చారు. కానీ వాటిని తిరస్కరించాను. ఇప్పటికీ నాకు వేరే పెళ్లయిందని, పిల్లలున్నారని అదృశ్యశక్తులు ప్రచారం చేస్తున్నారు. నేను ఏ పెళ్లి చేసుకోలేదు. నాకు పిల్లలు లేరు. నా వెనుకవున్న అదృశ్యశక్తులు డూప్లికేట్ పద్మలతో పిచ్చి వాగుళ్లు వాయించి, అవి నా మాటలే అని ప్రచారం చేస్తారు. తెలియనివాళ్లు అదే నిజమనుకుంటారు.
ఇపుడుంటున్న ఇల్లు కూడా నా తమ్ముడు కొనిచ్చాడు. అతను నెలకు ఇంత అని ఇస్తే, ఆ డబ్బులుతోనే బ్రతికేస్తున్నా. ఇపుడున్న ఇంట్లోనుంచి కూడా నన్ను వెళ్లగొట్టాలని వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెళ్లి పెటాకులవ్వడంతో దానిపై ఎలాంటి ఆశలు లేవు. వేరెరినీ నా జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నాను. ఓ నాలుగు అవకాశాలు ఇచ్చి నా జీవితం నేను బ్రతికేలా ప్రోత్సహించమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. కానీ ఎవరూ కనికరించడంలేదు. అలాగని జూ. ఆర్టిస్టుగా నటించమంటే నేను నటించనూ లేను అంటూ ముగించారు కుక్క పద్మ.
*

-సరయు శేఖర్, 9676247000