సబ్ ఫీచర్

చిత్రం! భళారే విచిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హలో! రాణాగారూ! నేను మిలింద దేవరను మాట్లాడుతున్నాను’.
‘దేవరగారూ కులాసాగా ఉన్నారా?’
‘కులాసాగా ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఫోను చేస్తాను? పీకల మీదికి వచ్చింది?’
‘ఏమిటి విశేషం?’
‘రాజకార్యం? ఉదయమే రెండు కోట్ల రూపాయలు కావాలి.’
‘జోక్ వేయకండి సార్. ఎందుకు కావాలో ఎవరికి కావాలో ఏరకమైన లోన్ రూపంలో కావాలో చెప్పకుండా రెండు కోట్లు అంటే ఎలా?’
‘‘అవన్నీ చెప్పే తీరిక లేదు. రేపు ఉదయం డబ్బు సిద్ధంచేసి ఉంచండి.’
‘‘మిలింద్‌గారూ- అందుకు బాంక్ రూల్స్ ఒప్పుకోవు.
‘నీ ముఖం రూల్స్. ఈ రూల్స్ మొత్తం బడుగు, సామాన్య వర్గాలకోసం. అంతేకాని రాజ కుటుంబానికి కాదు.
‘కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి’
‘శ్రీమతి ప్రియాంకా వాద్రా సిమ్లాహౌస్ ఏర్పాటుచేసింది. ఆమెకు అర్జంటుగా డబ్బుకావాలని నాకు కబురుచేశారు.
‘నేను ఏ ఖాతాలో నుండి ఇవ్వాలి?’
‘మీ ఎస్‌బ్యాంకులో నుండి గిఫ్టుగా ఇవ్వండి.’
‘గిఫ్టుగా ఎట్లా ఇస్తాము? లోన్‌గా తీసుకోవచ్చు. ఏదైనా హామీ (తాకట్టు) చూపించి తీసుకోండి.
‘రాణాకపూర్’ నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసునా? తాకట్టు- నీపిండాకూడూ. అలాంటివేమీ ఉండవు. నీకు రెండు బొమ్మలు పంపుతాను. వాటిని నీవు బ్యాంకు పక్షాన కొన్నట్లు రసీదు వ్రాయి.
‘ఏం బొమ్మలు?’
‘ఒకటి రాజీవ్‌గాంధీ బొమ్మ. రెండవది ఆయన కుమారుడు రాహుల్‌గాంధీ బొమ్మ.
ఈ బొమ్మలు ఎవరు గీచారు?
‘హెచ్.ఎఫ్.హుస్సేన్ అనే చిత్రకారుడు.
‘మిలింద్‌గారూ పికాసో- రవివర్మ వంటి వారి చిత్రాలకే అలాంటి రేట్లు ఇస్తారు. మొనాలిసా లాస్ట్ సప్పర్ వంటి చిత్రాలకు వెల పలుకుతుంది. కాని రాహుల్‌గాంధీ బొమ్మను రెండు కోట్ల రూపాయలు పెట్టి కొన్నానంటే బ్యాంకు బోర్డు ఒప్పుకుంటుందా?
‘బాగానే ఒప్పుకుంటుంది. ఇలా చేసిన తర్వాత నీవు 600 కోట్లు నీ కుమార్తె రోషన్‌కపూర్ పేరున ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. రాణా ఫోనులో మాట్లాడలేదు. ‘రాణా! మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలి. తిని తొంగుంటే మనకూ జంతువులకూ తేడా ఏమిటి? అన్నాడొక తెలుగు నటుడు.
‘సర్! ఆ బొమ్మ హుస్సేన్ గీచి మన ప్రధాని రాజీవ్‌గాంధీగారికి పార్టీ శత జయంతి కానుకగా ఇచ్చాడు. అంటే అది తోఫా ఖానాకు చెందుతుంది. అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. రాష్టప్రతిగా ఉన్న ప్రతిభాపాటిల్ తోఫాఖానాకు చెందిన ఎన్నో బహుమతులను తన ఇంటికి తరలించుకొని పోవటం మనకు తెలుసు. కాబట్టి ఈ చిత్రం ఒరిజినల్ అనీ దీనిని మీ ఎస్ బ్యాంకుకు సేల్ చేస్తున్నామనీ ఒక లేఖను రేపు మీ బ్యాంకుకు పంపుతాము. వెంటనే రెండు కోట్లు విడుదల చేయండి అని మిలింద్ దేవర ఫోను పెట్టేశాడు. అది 2010వ సంవత్సరం. అప్పుడు యుపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది.
మిలింద్ దేవర సూచన ప్రకారం రెండు కోట్ల రూపాయలూ రాణాకపూర్ విడుదల చేశాడు. 2020 మార్చి 10వ తేదీ అధికారంలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణ జరిపింది. రాణాకపూర్‌ను ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. దివాలా తీసిన ఎస్ బ్యాంక్‌కును ఎస్.బి.ఐ. 49 శాతం వాటాలు కొని తన కిందికి తెచ్చుకున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాణాకపూర్‌ను విచారిస్తే ‘నా మీద రాజ కుటుంబం నుండి వత్తిడి వచ్చింది. అందుకే నిధులు విడుదల చేశాను’ అని సాక్ష్యమిచ్చాడు.
దీనిపై ఓ టీవి ఛానల్‌లో విశే్లషకులు 10-3-2020 నాడు వ్యాఖ్యానిస్తూ ఇది ఉల్లిపొర మాత్రమే (టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్) అన్నారు. పి. చిదంబరం అనే మాజీ కేంద్రమంత్రి మాట్లాడుతూ ఎస్ బ్యాంక్ దివాలా తీయడానికి ఎన్‌డిఏ ప్రభుత్వమే కారణం అన్నాడు.
నిజమేనా?
బ్యాంకు నిధులు దుర్వినియోగం చేయబడింది 2014కు ముందు. అప్పుడు మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు సిమ్లాహౌస్, లండన్‌హౌస్ జప్తుఅవుతున్నాయా? లండన్ హవుస్‌కు నిధులు కేటాయించినవారు (క్విడ్ ప్రోనో) బదులుకు బదులుగా డిఫెన్సు కాంట్రాక్టులు పొంది, అందలి కుంభకోణాలల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ లండన్‌హౌస్ ఎవరి పేరుమీద రిజిస్టర్ చేయబడింది? దీనికి దుబాయినుండి స్పెషల్ షాండ్లియర్ అలంకారాలు రాహుల్‌బాబు ఆర్డర్ ఇచ్చి తెప్పించి డెకరేషన్ చేశారు.
ఇప్పుడు చెప్పండి..
సామాన్య ప్రజల కోసమే జీవిస్తున్నాము అని చెప్పుకునే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏం సమాధానం చెపుతారు? హిందూ ఉద్ధవ్ థాకరేలు పద్మవిభూషణ్ శరత్‌పవార్‌లు, తమిళనాడు స్టాలిన్‌లూ, లెనిన్‌లూ, అశోక్‌గెల్హెట్‌లు భార్యా హంతకులు శశిధరూర్‌లు పాక్ ఏజెంట్ మణిశంకర్ అయ్యర్‌లూ ఏం సమాధానం చెపుతారు? పాలై బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఎందుకు దివాలి తీశాయి?
విజయమాల్యాలు, లలిత్‌మోడీలు విదేశాలకు ఎలా పారిపోయారు? రాత్రికి రాత్రి స్పెషల్ విమానంలో ఇటలీ ఆయుధాల వ్యాపారి ఖత్రోచీని ఎవరు విదేశాలకు పంపించారు? భారతదేశంలో గత నాలుగు దశాబ్దాలుగా జరిగిన లక్షల కోట్ల కుంభకోణాలన్నింటికీ 10, జనపథ్ ఎందుకు కేంద్ర బిందువుగా మారింది?
‘డబ్బిచ్చి రాజకీయాధికారం కొనుక్కోండి- ఖర్చు పెట్టిన డబ్బుకు రెండింతలు వసూలు చేసుకోండి. ఎవరైనా దేశభక్తులు ఇదేమి ప్రజాస్వామ్యం? అని ప్రశ్నిస్తే వారిని ఫాసిస్టులు అని ముద్రవేయండి. గత డెబ్బది సంవత్సరాలుగా భారతదేశంలో ఇదే రాజనీతి నడిచింది. రామచంద్రగుహ- అరుంధతీరాయ్, సునిల్‌చోప్రా, జాన్‌దయాల్, కవితాకృష్ణ, చుక్కా రామయ్యలు ఈ చిత్ర విచిత్రాన్ని ఎలా సమర్ధించగలరు?
అరవింద కేజ్రీవాల్, నయనతార, ప్రశాంత్‌కిశోర్, ఏచూరి, బృందాకారత్‌లు ఈ రెండు కోట్ల చిత్రం గూర్చి ఎందుకు మాట్లాడటం లేదు? వడ్డాది పాపయ్య, కొండపల్లి శేషగిరిరావు కూల్డ్రే, బాపిరాజు, రాజయ్య నందలాల్ బోస్‌లు గీచిన ఏ చిత్రానికైనా రెండు కోట్లు ఇచ్చి ఏ బ్యాంకు వారైనా కొనుగోలు చేశారా?? శీలా వీర్రాజు బొమ్మగీస్తే నేను ఎప్పుడూ ఐదువందల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదు. బాపు మూడు వేల రొపాయల కంటే ఎక్కువ తీసుకోలేదు. సంజీవ్‌దేవ్ ఫ్రీగా బొమ్మలు పంపేవాడు. మరి ఈ రెండు కోట్ల కుంభకోణాన్ని ఎలా సమర్ధించగలము? శారదా చిట్‌ఫండ్‌వారు కూడా ఇలాగే భారీ మొత్తం ఇచ్చి చిత్రాన్ని కొన్నారు. ఈ చిట్‌ఫండ్ దివాలా తీసి లక్షలాది బెంగాలీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నేరంలో ప్రధాన ముద్దాయి మమతాబెనర్జీ.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్