సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషోత్తమ
‘‘ముందు నాకు ‘అనుభవం’కావాలి. ఆనందం కావాలి. అంత దాకా నాకు నమ్మకం కలగదు’ అంటే కుదరదు.‘‘ముందు ఆనందం యిటివ్వు, ఆ తరువాతే విశ్వాసాన్ని నీకు అందిస్తా.’’అనటానికి ఇదేం బేరమా?
పురుషులందరిలో పురుషోత్తముని దర్శించు. పురుషుడంటే ఎవరు? పల్లెలోనో, పట్నంలోనో, తీరాన్నో వుండే మనిషి అనుకుంటున్నారు. పురుషుడంటే ఈ దేహం అనే ఆలయంలో వుండే జీవాత్మ మరి, పురుషోత్తముడో? సృష్టి సమస్తంలో వుండే పరమాత్మ నీవు సరియైన విధంగా సాధన చేయి. పురుషోత్తముని గుర్తించటం ఎలాగో తెలుసుకోవచ్చు.
అంతటా ఆయనే!
నలుగురూ కలిసి ఆలోచించుకోండి! చిన్నచిన్న సత్సంగాలను ఏర్పరుచుకొని ఆధ్యాత్మిక సాధనలు సాగించండి! భాగవతం వంటి భక్తిగ్రంథాలను పఠించండి! ఆయన అందమైన రూపంతో కన్నుల విందు చేసికోండి. ఆయన లీలలనూ, ప్రశస్తినీ వింటూ వీనుల విందు చేసికోండి. ఆయన కీర్తి సుధతో మీ గుండెను నింపుకోండి. అన్నిచోట్లా ఆయననే దర్శించండి. స్ఫూర్తిని పొందండి. ఏ కొండను చూసినా ఆయన మహాత్మ్యానే్న యోచించండి. పశు పక్ష్యాదులలో, సరీసృపాలలో, క్రిమికీటకాదులలో కూడా ఆయన ఉనికిని కనుగొనండి. ఆ అద్భుత దృశ్యం చూసి ఆనందంతో పరవశించండి.
అసలైన సాధన
లే! దేవతార్చనను సంచీలో సర్దు! చికాకు వదిలించుకో! అసలైన ఆధ్యాత్మిక సాధన ఆరంధించు, ఎన్నాళ్లు రుూ విగ్రహాలనూ, ఫొటోలనూ పట్టుకొని వేలాడతావు. సజీవంగా నీ యెదుట సంచరిస్తున్న సాటి ప్రాణులలో ఆ సర్వాంతర్యామిని దర్శించు! సేవించు! తరించు! వారిలో ఆ దేవదేవుని అద్భుత సౌందర్యాన్ని తిలకించు. ఆయన దయామృతాన్ని ఆస్వాదించు. నిరామయుడైన భగవంతుడే ఈ ఆకారాలన్నిటినీ తన ఆలయాలుగా చేసికొని నర్తిస్తున్నాడు. ఆయన లీలను అర్థం చేసికో! ఆయన ప్రతీకలైన ప్రాణికోటినీ, మానవాళినీ సేవించు.
కృపాజలధి
వాల్మీకిది ఏ కులం? కుచేలుడికి ఏం ఆస్తి వుంది? శబరి ఏం చదివింది? ప్రహ్లాదుడి వయసెంత? గజేంద్రుడి స్థాయి ఏమిటి? విదురుడి గొప్పతనం ఏమిటి? వారందరిలోనూ వున్న యోగ్యత ఒకటే, ప్రేమ. అదే కావలసింది. కులం, ఆస్తి, పాండిత్యం, వయస్సు. స్థాయి, ఘనత ఇవేం అక్కరలేదు.
భగవత్కృప సముద్రం లాగా ఎల్లలెరుగదు. అది అనంత విస్తారం. నీ సాధన వల్లా, నీ జపం వల్లా, నీ ధ్యానం వల్లా, నీ నీతి నియమాల వల్లా, నీ సత్ప్రవర్తన వల్లా భగవత్కృప మేఘమాలగా మారి ప్రేమామృతాన్ని వర్షిస్తుంది. అదే ఆనంద ప్రవాహమై మానవాళిని ముంచెత్తి తిరిగి భివత్కృపా జలధిని చేరుకుంటుంది.
కృష్ణ నామ మహిమ
కోరికలకు అదుపు లేదు.ఒకసారి నువ్వు వాటిని లొంగావా. నిన్ను ఎంతమావుల వెంట తిప్పుతాయి. నీచేత గాలిలో మేడలు కట్టిస్తాయి. నిరాశ నిస్పృహలను పెంచుతాయి.
కృష్ణునిపై తృష్ణ పెంచుకో. నీలో అంతర్వాహినిగా ఉన్న ఆనందధారను కనుగొంటావు. మధురమైన ఆయన నామం నీకు తుష్టిని చేకూరుస్తుంది.
కావాల్సింది అర్పణ
కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. వీణ తీగెలను మీటినట్లు ఆనయన నమ హృదయ తంత్రులను మీటగలిగాడు. ప్రేమ వాత్సల్యం, విశ్వాసం. దయ, కరుణ, ధైర్యం, సాహసం, సోదరభావం వంటి భావతరంగాలను ఆయన మనలో కలిగిస్తాడు. ఆయన ఊపిరి, కరుణ దయ ఆయన స్వభావం. ఆయనను ఆరాధించటం ఎలా హృదయాలను భక్తితో కరిగించండి. కన్నీటితో ఆయనను అభిషేకించండి. ఆర్ద్రమైన మనస్సులో ప్రేమధారలను నింపుకోండి. అపుడు అజ్ఞానం నశిస్తుంది. ఆనందం కురుస్తుంది.

ఇంకా ఉంది