సబ్ ఫీచర్

అర్చకుల అరణ్యరోదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తలైన అర్చకులు ‘‘అర్చక నిధి చంద్రశేఖరా’’అంటూ మొత్తుకుంటున్నారు. భక్తి ఎక్కువగా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా ధూప దీప నైవేద్యాలు నిలిపేసి, అర్చకులు ఆందోళన చేసినప్పటికి వారి సమస్యల పరిష్కారం ఇంకా ‘‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది’అన్నట్లు ఉంది. అర్చకుల గోస తెలుగు రాష్ట్రాల పాలకుల చెవులకు ఎక్కడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్.పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచిపోయినా వారి సమస్యలకు ఇంకా పరిష్కారం లభించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కనీసం సమీక్షించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ అర్చకుల సంక్షేమంకోసం రూ.50 కోట్ల నిధులు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం 12వేల దేవాలయాలు ఉండగా 12వేల మంది దాకా అర్చకులు పనిచేస్తున్నారు. కేవలం 620 దేవాలయాల్లో పనిచేస్తున్నవారికి మాత్రమే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. మిగతావారి జీవితాలు ఏరోజుకారోజు కష్టాలలోనే కొనసాగుతున్నాయ. భక్తులు ‘సంభావన’ఇస్తే తిన్నట్లు లేకపోతే లేదు. అర్చక నిధిని తెలుగు రాష్ట్రాలు ఏర్పాటుచేస్తే ఎండోమెంట్ పరిధిలోని అర్చకులకు ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు అందుతాయి. వీటన్నింటికి తోడుఅర్చకులకు అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితులవల్ల ‘‘సెలవు’’దొరకడం పెద్ద సమస్యగా మారింది.
అర్చకుడు సెలవుపెడితే వేరే అర్చకుడిని క్షణాల్లో ఏర్పాటుచేయవల్సి ఉంటుంది. ఇదో పెద్ద సమస్యగా మారింది. అర్చకుల కుమార్తెల పెళ్ళిళ్ళకోసం లక్ష రూపాయల వరకు ఇస్తామని పాలకులు ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. ఇందులో 50వేలు మాఫీ, మిగిలిన 50వేలు దఫాల వారిగా తిరిగి చెల్లించేటట్లు ఏర్పాట్లుఉన్నాయి. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలకు ఆడపిల్లల పెళ్ళిళ్ళకు 51వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ‘బ్రాహ్మణ కళ్యాణలక్ష్మి’ని వెంటనే ప్రకటించి వారికి లబ్దిచేకూర్చాలని అర్చకులు కోరుతున్నారు. బ్రాహ్మణుల ఉపనయనంకోసం రూ.35వేలు, భవన నిర్మాణంకోసం రూ.ఒక లక్షా 20వేలు ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వటం లేదు. ఇంకా వాహనం కొనుగోలు కోసం 25వేలు, పదవీ విరమణ రెండు లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయడమే కాకుండా దేవాలయాల సిబ్బంది, అర్చకుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిపెట్టి సమీక్షించి, సమస్యలు పరిష్కారం చేయవల్సిన అవసరం ఉంది.
భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ వంటి దేవాలయాలకు వందల కోట్లు కేటాయించటం సంతోషం. చిన్న దేవాలయాలకు సైతం నిధులు కేటాయించి, వాటిని జీర్ణోద్ధరణకు నడుం బిగించాలి. చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ‘నిధి’ని ఏర్పాటుచేయాలి. 1997లో సుప్రీంకోర్టు ‘అర్చక నిధి’ ఏర్పాటుచేయాలని తీర్పుచెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో 857 జీ.వోను వెలువరించారు. కాని తెలుగు రాష్ట్రాల పాలకులు సుప్రీంకోర్టు తీర్పుని 18 ఏళ్ళుగడిచినా అమలుచేయటం లేదు. పురాతన ఆలయాలు శిథిలం కావ టం, భక్తులు పాత ఆలయాలకు రావటం తగ్గటంతో అర్చకులు ‘ఆకలి’తో అలమటిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు హిందూ ధర్మాన్ని బాగా ప్రచారం చేస్తున్నవారే కాబట్టి ‘అర్చక నిధి’ నిధులు విడుదల చేయాలి. అర్చకు సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించాలి. పేదరికంలో మగ్గుతున్న వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలి.

- రావుల రాజేశం