సబ్ ఫీచర్

ఫునశ్చరణే గురువుకు పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్సెస్‌మెంట్‌లో ఒక భాగం ప్రతి రోజు పునశ్చరణ చేయటం. అది ప్రతి రోజు జరుగుతుంది. వారానికి ఒక రోజు జరుగవచ్చును. నెలకు ఒకసారి కూడా జరుగవచ్చును. కొన్నిసార్లు వౌఖికంగా, కొన్ని సమయాల్లో రాతపూర్వకంగా జరుగుతుంటుంది. అది వౌఖికంగా, కొన్ని సమయాల్లో రాత పూర్వకంగా జరుగుతుంటుంది. అది వౌఖికంగా జరిగినా టీచర్ దాన్ని రికార్డుచేసుకోవలసి ఉంటుంది. రాతపూర్వకంగా జరిగితే ప్రతి వాక్యం చదవాలి. అవే ఉపాధ్యాయులలో కొత్త భావాలకు మూలాధారం అవుతుంది. కరెక్ట్‌గా రాసిన వారుంటారు. అదే విధంగా తప్పుగా రాసిన వారుంటారు. అదే మనలో కొత్త భావనలకు ప్రేరణ కల్పిస్తుంది. అదే ఉపాధ్యాయునిలో ప్రత్యామ్నాయ భావాలకు, పరిష్కార భావాలకు మూలమవుతుంది. మనదగ్గర ఒకే పరిష్కారం ఉంటుంది. దానే్న ఆధారం చేసుకుని చూస్తూ ఉన్నాం. అదే సమస్యను వేరే దృక్కోణంలో చూడవచ్చునని అర్థమవుతుంది. గురువుకు గురువు విద్యార్థి. పిల్లలు తప్పుచేశారని కొట్టివేస్తాం. ఆ తప్పులే ప్రత్యామ్నాయ పరిష్కారానికి పునాది. ఆ విద్యార్థి ఆ తప్పుగా రాసేందుకు ఎందుకు అట్ల ఆలోచించాడు. ఏ స్టెప్ దగ్గర తప్పు అడుగు పడింది. తప్పుగా ఆలోచించే అవకాశం ఎక్కడ ఉన్నది? ఆ ఆలోచనలు పనిచేస్తే మనకు పరిష్కారం దొరుకుతుందా? దొరికినట్లయితే అది ప్రత్యామ్నాయ పరిష్కారం అవుతుందా? కొలంబస్ తోవ తప్పాడు కాబట్టే కొత్త ఖండం ఆవిష్కరణ జరిగింది. కొత్త ఆవిష్కరణలన్నీ కూడా తప్పులనుంచే వస్తాయి. పరీక్షను నిర్వహించిన దానికన్నా పిల్లలు రాసిన పత్రాలను శ్రద్ధగా చదవటమే ఉపాధ్యాయుని మొదటి పరీక్ష. ప్రతి ఎర్రసిరా వెనుక ఒక కాంతి కిరణం ఉన్నదని మర్చిపోవద్దు. ఆ సంబంధిత విద్యార్థితో ఒంటరిగా కూర్చుని మాట్లాడితే తన ఆలోచనలు విశదీకరించుకోవచ్చును.
తప్పుచేసిన వాణ్ణి చిన్న చూపుకన్నా అతనితో సమాలోచనలు చేస్తేనే మనం ఎడ్యుకేట్ అవుతాము. ఒక సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుందనే కాలాలు పోయాయి. ఉపాధ్యాయుడు పిల్లలతో ఎన్నో పరిష్కారాలు నేర్చుకుంటాడు. అతనికి తక్కువ గ్రేడ్ ఇచ్చి ఫెయిల్ అనే ముద్రవేసిన దానికన్నా అతన్ని ప్రోత్సహించే ఇరువురిలో మార్పు వస్తుంది. తరగతి గదికి కేవలం సక్సెస్‌ఫుల్ విద్యార్థే మార్గదర్శి కాదు. ఫెయిల్ అయినవారే గురువుకు స్ఫూర్తిగా ఉంటారు. ఎందుకంటే వారిని సక్సెస్ వైపునకు పయనిం పజేయడంలో ఉపాధ్యాయుడు సరికొత్త మార్గాలను అనే్వషించాలి. అమలు పరచాలి. అది ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతిరోజు పిల్లలనుంచి గురువులు నేర్చుకుంటారు. పునశ్చరణ పిల్లలకు ఎంత అవసరమో మనకు కూడా అంతే అవసరం.

- చుక్కా రామయ్య