సబ్ ఫీచర్

ఎవరు ప్రగతి నిరోధకులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టుముందా లేక విత్తనమా, కోడి ముందా లేక గుడ్డా అని ప్రశ్నిస్తే ఎంతటి పండితుడైనా సరియైన జవాబు చెప్పలేడు. సరిగ్గా ఇలాం టి చిక్కు సమస్యనే నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. దేశం లో ఇతర ప్రాంతాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు నక్సల్ ప్రభావిత క్షేత్రాలలో చేపట్టకపోవడంవల్లనే నక్సల్స్ విస్తరిస్తున్నారు, విజృంభిస్తున్నారు. రక్తపాతం జరుగుతున్నదనేది సత్యం. దీనికి ప్రభుత్వపు అలసత్వమే కారణమని ఒక వర్గంవారు అంటున్నారు. నక్సల్స్ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. అందువలనే ఈ క్షేత్రాల అభివృద్ధి కుంటుపడిందని వేరొక వర్గం అభిప్రాయపడుతోంది. ఏది సత్యం? ఏదసత్యం?
ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎప్పటికి జన ప్రతినిధులు కాలేము అని నక్సలైట్లకు స్పష్టంగా తెలుసు. కేవలం తుపాకి ద్వారా అధికారం చేజిక్కించుకోవాలన్నది వారి ఆశ. అక్కడ నివశిస్తున్న పేద ప్రజల మనస్సులో గూడుకట్టుకున్న అసంతోషాన్ని అసహనాన్ని, వారికి ప్రభుత్వంమీద ఉన్న భయాన్ని సొమ్ముచేసుకొని సమాంతర ప్రభుత్వాన్ని సాగించాలన్నది వారి ఆకాంక్ష. పేద ప్రజలు, వనవాసీలు, గిరిజనుల హక్కులను కాపాడి వారికి మేలుచేయడమే మా ధ్యేయం అని వీరు చెప్పుకుంటారు. అయితే వీరు రక్షణదళాలతోను, ప్రభుత్వాలతోను తలపడుతూ నిరపరాధులైన గ్రామీణులను ఏదో కారణంతో ప్రజాకోర్టులు నిర్వహించి చిత్రహింసలుపెట్టి చంపుతున్నారు. ప్రభుత్వంలోని అవినీతి, ప్రభుత్వపు తప్పుడు నిర్ణయాలు, కార్పొరేట్ జగత్తు ఆధిపత్యంవలన ఈ వర్గపు ప్రజలకు మేలు జరుగదనేది వీరి వాదం. నిజానికి నక్సలైట్ల సంఖ్య పెరగడానికి అనేకానేక కారణాలున్నాయి. ఇక్కడ జీవిస్తున్న ప్రజలు వారు వనవాసీలైనా కావచ్చు. గిరిజనులైనా కావచ్చు. అభివృద్ధిలేకపోవడం, వారికి సరియైన వసతులు లేకపోవడం, వారి సంస్కృతి సభ్యతలు, రీతిరివాజులు ఛిన్నాభిన్నం కావ డం, ప్రకృతి సంపదలను వారికి దక్కకుండా చేయడం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న ఆందోళనకు వారు గురవుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ జగత్తు ప్రభుత్వంతో కలిపి వీరిని పీడిస్తోంది. వనరక్షణ, పర్యావరణ రక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాల సహాయంతో వనవాసీ, గిరిజన, పేద గ్రామీణుల ఇళ్ళను అడవిని, సంస్కృతీ సభ్యతలను రీతి రివాజులను, దేవీదేవతలను వారి పూర్వజులను వంచిస్తున్నారు. దీనివలన పర్యావరణ సమతుల్యం ఒక దెబ్బ తింటూ వుంటే ఈ వ్యాపారవేత్తలు అమాయక జనాలను మోసగించి ఆర్థిక లాభాలను పొందుతున్నారు. అందువలన కార్పొరేట్ వారికి అడవుల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతులను ఇవ్వడం అంటే ఇక్కడ స్థానికులను పూడ్చిపెట్టడంతో సమానం, ఆర్థికంగా ఈ స్థానికులు బలపడాలని కార్పొరేట్‌వారు కలలో కూడా ఆశించరు. వనవాసీ, గిరిజనులకు తరతరాలుగా అడవులే వారి ఇళ్ళు. వారి జీవితం అడవుల్లో లభించే వస్తువులమీదనే ఆధారపడింది. నదులు, ఏరులు, కొండలు వారి జీవితంలో మేళవించి ఉన్నాయి. ముఖ్యంగా ఇప్ప చెట్లు వారికి అపురూపమైన సంపద. వాటి ప్రాధాన్యత, విలువ ఈ స్థానికులకు తెలిసినట్లు బయటనుంచి వచ్చినవారికి తెలియదు. ఇప్పపువ్వు సారా వారికి పరంపరగా వస్తున్న ప్రీతిపాత్రమైనది.
నిజానికి నక్సలిజానికి నాయకత్వం వహిస్తున్నవారు వనవాసీ, గిరిజన వర్గాలకు చెందినవారు కారు. వీరి మూలాలు ఈ అలజడులకు కారణమైన ఈ ప్రాంతాలుకాక, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఆది రాష్ట్రాలలో ఉన్నాయి. నక్సల్స్ ప్రగతిని ప్రతిఘటిస్తున్నారా అంటే ఇతమిత్థంగా జవాబు చెప్పడం సాధ్యంకాదు. మేము అభివృద్ధినే కోరుకుంటున్నాం. అది కొరవడింది అని వీరి అభియోగం. ఇందులో ఎంత సత్యముందో ఆ పేరుమాళ్ళకే ఎరుక.

- గుమ్మా ప్రసాదరావు