సబ్ ఫీచర్

సంక్షోభంలో బియ్యం మిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో 50 శాతం మందికి, భారతదేశంలో 70 శాతం మందికి, తెలుగు రాష్ట్రాలలో అయితే 85 శాతం మందికి ప్రధాన ఆహార ధాన్యం బియ్యమే. ఈ బియ్యం తయారీకి ముడి పదార్థమైన వరిని పండిస్తేనే సరికాదు. దానిని సక్రమంగా మరపట్టి బియ్యంగా మా ర్చాలి. ఈ క్రతువులో బియ్యం మిల్లులదే అగ్రస్థానం. ఒకప్పుడు బియ్యం మిల్లుల యజమానులు తలఎగరేసుకుని తిరిగేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లెవీ విధానాన్ని ఎత్తివేయటంతో వారి పని ఇరకాటంలో పడిపోయింది. ఒకప్పుడు లెవీ విధానాన్ని వ్యతిరేకించిన మిల్లర్లే ఇప్పుడు లెవీ విధానం రద్దు తర్వాత సంక్షోభంలో పడటం కోరి తెచ్చుకున్న విషాదంలా ఉంది. ఒకప్పుడు తాము బియ్యం వ్యాపారంచేసే వర్తకులమని ఇప్పుడు ప్రభుత్వం తరఫున బియ్యం మరపట్టే కస్టమ్ మిల్లింగ్ ఏజెంట్లుగా మారిపోయామని మిల్లర్లు ఆక్రోశిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఎన్.డి.ఎ. ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బియ్యం లెవీ విధానాన్ని రద్దుచేసింది. ఇది జరిగి రెండేళ్ళు కావస్తోంది. మొదటి ఏడాది అంతా ఈ విధానం బాగోగులపై బియ్యం మిల్లర్లు తర్జన భర్జనలుచేస్తూ వచ్చారు. రెండో ఏడాది ఈ విధానం తమకు గుదిబండగా తేలటంతో కనీసం 50 శాతం లెవీ విధానం ఉండాలంటూ కేంద్రంతో బేరసారాలకు దిగారు. అయినా ఫలితం కనిపించక పోవటంతో సంక్షోభంలోనే సంక్షేమాన్ని వెతుక్కుంటూ ప్రయా ణం సాగిస్తున్నారు.
బియ్యం మిల్లులకు రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. వరి పంటకు ఇటు ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణా పేరుపొందటంతో వేలాదిగా బియ్యం మిల్లులు రెండు రాష్ట్రాలలోను కొలువుతీరాయి. ఈ ప్రతిష్ట కారణంగానే ఇటీవల జరిగిన అఖిల భారత బియ్యం మిల్లుల సంఘం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గాను, తెలంగాణాకు చెందిన వడ్డి మోహనరెడ్డి ప్రధాన కార్యదర్శిగాను ఎన్నికయ్యారు. వేలాది మందికి ఉపాధి చూపటంతోపాటు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేలా కృషిచేస్తున్న బియ్యం మిల్లు వ్యవస్థను కాపాడుకుంటామని వారిద్దరు ప్రకటించటం గమనార్హం.
ప్రభుత్వం లెవీ విధానం ఎత్తివేసిన తర్వాత సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే బియ్యం మిల్లులకు పని ఉంటోంది. మిగిలిన కాలంలో డబ్బున్నవారు మాత్రమే మిల్లులు తిప్పగలుగుతున్నారు. ఈ కారణంగా మిగిలిన 9 నెలలు కూడా మిల్లులు తిరిగేలా కేంద్ర ప్రభుత్వం సహకరించటం గాని లేదా మిగిలిన తొమ్మిది నెలలు మిల్లింగ్ హాలీడే ఇవ్వటం గాని చేయాలనేది మిల్లర్ల సంఘం ప్రధాన డిమాండ్‌గా ఉంది. లేదా సీజన్‌లో ఇండస్ట్రీగా గుర్తించాలనేది వారి వాదన. వీరి వాదన న్యాయంగానే కనిపిస్తోంది. గతంలో లెవీ విధానం అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు ఎగబడి రుణాలు ఇచ్చేవి. కొత్త విధానంలో బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. మీరు ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మరపట్టడం తప్ప నేరుగా ధాన్యం కావటం లేదు కదా? అన్నది బ్యాంకులు బియ్యం మిల్లర్ల ముందుంచుతున్న ప్రధాన ప్రశ్న. స్పిన్నింగ్ మిల్లులకు ఏవిధమైన ప్రోత్సాహకాలు ఇస్తున్నారో అదే రకమైన ప్రోత్సాహకాలు బియ్యం మిల్లులకు కూడా ఇవ్వవలసి ఉంది. అదే విధంగా దేశంలో బియ్యం నిల్వలు అవసరానికి మించి ఉండటంవల్ల బియ్యం ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించాలని కూడా బియ్యం మిల్లుల యాజమా న్యం కోరుతోంది నిత్యం పెరుగుతున్న విద్యుత్‌ఛార్జీలు, పన్నులు బియ్యం మిల్లులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం తరఫున మరపట్టే ధాన్యం మిల్లింగ్ ఛార్జీలు కూడా బియ్యం మిల్లులకు గిట్టుబాటు కావటం లేదు. ఈ కారణంగా అందరికీ ఆమోదయోగ్యమైన మిల్లింగ్ రేటును నిర్ణయించవలసి ఉంది.
కేంద్ర పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలు
1. లెవీ విధానం రద్దు.. వికేంద్రీకృత ధాన్యం సేకరణ విధానంలో వివిధ రాష్ట్రాలు విఫలమయ్యాయి. మిల్లర్ల ప్రాధాన్యం తగ్గింది. కేవలం బాడుగకు మిల్లింగ్‌చేసే స్థితికి ఇండస్ట్రీ చేరింది. కోట్లాది రూపాయల పెట్టుబడిపెట్టి ప్రభుత్వాలు విదిల్చే చార్జీలు, ఉప ఉత్పత్తులతో కాలక్షేపం చేసే పరిస్థితి దాపురించింది. ఇండస్ట్రీని పరిపుష్టిగా పునరుజ్జీవనంలోకి తీసుకురావాలి.
2. కస్టమ్ మిల్లింగ్ విధానంలో అన్ని సమస్యలే. దశాబ్దాలనాటి చార్జీలే చెల్లిస్తున్నారు. ఈ బకాయిలు ఏళ్లఏళ్లుగా పేరుకుపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోయాయి. విద్యుత్తుచార్జీలు, కార్మికుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించలేక.. మిల్లులకు తాళాలువేసే పరిస్థితి ఏర్పడింది.
3. ఔట్‌టర్న్ రేషియో నిర్ధారణలోనూ మిల్లర్లకు అన్యాయం జరుగుతోంది. నాసిరకం ధాన్యం ఇచ్చి 67 శాతం బియ్యం వసూలు చేస్తున్నారు. ఫలితంగా సొంత బియ్యం ఇచ్చి మిల్లర్లు నష్టాన్ని మూటకట్టుకుంటున్నారు.
4. తెలుగు రాష్ట్రాల్లో బియ్యంపై పన్ను విధించటంతో ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలపై పన్నులు మినహాయించాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. జీఎస్టీ బిల్లులో ఆహార ధాన్యాలకు పన్ను లు మినహాయించేలా కృషిచేయాలి.
5. డిసెంట్రలైజ్ ప్రొక్యూర్‌మెంట్ అమలుజరుగుతున్న కారణంగా బ్యాంకర్లు వర్కింగ్ కేపిటల్ ఇవ్వటం లేదు. దీంతో పాత బకాయిలు పేరుకుపోతూ.. పరపతిని కోల్పో యే ప్రమాదం ఏర్పడింది.
6. బియ్యం ఎగుమతులను ప్రోత్సహించే విధంగా రాయితీలు ఇవ్వాలి.
7. మిల్లుల ఆధునికీకరణను ప్రోత్సహించే విధంగా సరళీకృత సబ్సిడీ పాలసీను అమలుచేయాలి. తగిన రాయితీలు సకాలంలో ఇవ్వాలి.
ఇటు రైతులకు అటు కార్మికులకు మేలుచేస్తున్న బియ్యం పరిశ్రమను పరిరక్షించుకోవలసిన బాధ్యత కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

- పుట్టా సోమన్నచౌదరి 9440339682