సబ్ ఫీచర్

వ్యాధుల కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా పట్టణాలలో, గ్రామాల్లో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు బాధించకుండా వుంటాయి. మురికి గుంటలు, నీరు నిల్వవుండే తొ ట్టెల్లో నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి. పశువులను ఇళ్ల మధ్య కాకుండా ప్రత్యేక ప్రదేశాల్లో పోషించాలి. మరుగుదొడ్లు, స్నానాల గదుల్ని వెలుతురు వుండేలా చూసుకోవాలి. ఓవర్ హెడ్ టాంకులపై పూర్తిగా మూత వుంచి అవసరాలకు అనుగుణంగా బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. పూల కుండీలు, నీళ్ల టాంకులు మంచినీటి గోలాలు తదితరాలను కనీసం మూడు రోజులకోసారి శుభ్రం చేయాలి. ఇంటి పరిసరాల్లో పగిలిన గాజు సామాన్లు, టైర్లు, ఫ్లవర్‌వాజులు వుంచరాదు. ఇంటి ఆవరణలో ఎయిర్ కూలర్లలో నీటిని, ఫ్లవర్‌వేజ్‌లు, మనీ ప్లాంటు బాటిళ్లలోని నీటిని ప్రతి మూడురోజులకు మార్చాలి.
కాళ్లకు, చేతులకు కూడా కలిపి నిండుగా దుస్తులు వేసుకోవాలి. దోమ తెరలతో పాటు దోమల నివారణకు ఇతర మార్గాల్ని పాటించాలి. మురుగు కాల్వల్లో నీరు ధారాళంగా ప్రవహించే విధంగా చూడాలి. ఎక్కువ వేడితో జ్వరం వస్తుంటే, చర్మంపై దద్దుర్లు, వాంతి అయ్యేట్టు అనిపిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సకాలంలో వైద్యం పొందాల్సిందే. ఇంటిలో దోమలు రాకుండా కిటికీల వద్ద వెల్లుల్లి పాయలు కోసి వుంచాలి. చల్లటి వాతావరణం వేళ నిల్వ వున్న ఆహార పదార్ధాలను తినరాదు. తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలి. రోడ్డుపక్కన మురికి కాల్వల పక్కన మూత వేయని తినుబండారాలను తినరాదు. రోడ్డుపక్కన మురికి కాల్వల పక్కన బహిరంగ మల మూత్రవిసర్జన చేయరాదు. అలాచేస్తే ఈగలు వాలి తద్వారా రోగాలు వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మల విసర్జన అనంతరం చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. పిల్లల్లో వాంతులు, విరోచనాలు కలిగితే చిటికెడు ఉప్పు, చారెడు పంచదార గ్లాసుడు మంచినీళ్లలో కలిపి కొద్దికొద్దిగా తరుచుగా తాగించాలి. తల్లిపాలు తాగే చంటిపిల్లల్లో ఈ వ్యాధి సోకినా తల్లిపాలనే పట్టిస్తూ ఓఆర్‌ఎస్ ద్రావణం ఇస్తుండాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలకు పాఠశాలల్లో పరిశుభ్రత గురించి ఉపాధ్యాయులు నిత్యం బోధిస్తుండాలి. చిన్నప్పటి నుంచే పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు తల్లిదండ్రులు కూడా చొరవ చూపాలి. ఇంట్లోనే కాదు, మన పరిసరాల్లోనూ పరిశుభ్రతను పరిరక్షించుకోవడం ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి.
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయ. వీటిలో జనం విధిగా భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ భారత్ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ, స్వచ్ఛ ఆంధ్ర పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ పేరిట తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావులు మంచి పథకాలను ప్రారంభించి, వీటి కోసం నిధులు కేటాయస్తున్నారు.
వర్షాకాలంలోనే కాదు, ఏ సీజన్‌లోనైనా విధగా పరిశుభ్రత పాటించినపుడే వ్యక్తిగత ఆరోగ్యం సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు మన కోసమే అన్న భావన సమాజంలోని అన్ని వర్గాల వారిలో రావల్సిఉంది.
స్వచ్ఛ్భారత్ నినాదానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇచ్చి ఆరోగ్యవంత సమాజాన్ని ఏర్పరుచుకోవాలి. -

టి.సురేష్‌కుమార్