సబ్ ఫీచర్

కార్పొరేట్లకూ సామాజిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ లాంటి దేశాల్లో ఆదాయ, సంపద వ్యత్యాసాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ధనికులు, వ్యాపారవర్గాల వారు ఆర్థికంగా మరింత ఎదుగుతున్నారు. పేదరికం నిర్మూలనకు సంపన్నులు కృషిచేయాలన్న వాదన ఎప్పటినుండో వుంది. ధనికులు తమకు కావలసిన ధనానే్న వుంచుకుని, మిగిలినదాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని జాతిపిత గాంధీజీ భావించారు. ఎవరైనా సరే తమ అవసరాలకు మించి ఆస్తి కలిగి ఉండరాదు. ఒక స్థాయికి మించి సంపాదించిన ఆస్తి- సమాజమే ధర్మకర్తలుగా నియమించిన వ్యక్తుల ఆధ్వర్యంలో ఉండాలి. 1950 దశకంలోనే మన దేశంలో కొన్ని కంపెనీలు సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపట్టాయి. ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను తీర్చలేని స్థితిలో వున్నాయి. ఈ పరిస్థితులలో కార్పొరేట్ రంగంపై కొంత సామాజిక బాధ్యత పెట్టటం తప్పనిసరైంది. ప్రజాహిత కార్యక్రమాల్లో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ (సీఎస్‌ఆర్) అనే భావనను చట్టబద్ధం చేసింది.
కంపెనీల కొత్త చట్టం-2013 ప్రకారం కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో రెండు శాతాన్ని సమాజ హితానికి వెచ్చించవలసి వుంటుంది. వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్, 500 కోట్ల రూపాయల నికర విలువ దాటినా లేదా 5 కోట్ల రూపాయల వార్షిక లాభం మించిన కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నిబంధన 2014 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. సుమారు 6,000 కంపెనీల నుంచి సిఎస్‌ఆర్ కింద లభించే మొత్తం సంవత్సరానికి రూ.20,000 కోట్ల వరకు వుంటుంది. ఆకలి, పేదరిక నిర్మూలన, విద్యాభివృద్ధి, లింగ సమానత్వం, మహిళా సాధికారత, శిశుమరణాల రేటు తగ్గింపు, బాలింతల ఆరోగ్య రక్షణ, హెచ్‌ఐవీ-ఎయిడ్స్ నిరోధం, మలేరియా వంటి వ్యాధుల చికిత్స, పర్యావరణ రక్షణకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధులను ప్రభుత్వ అజమాయషీలో ఖర్చు చేయాల్సి ఉంది. అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన ఈ కార్యక్రమాలను కంపెనీలకు అప్పగించడం సబబుకాదు. ఆహార శుద్ధి, ఆహార వృథాను అరికట్టడం, శ్రామికుల నైపుణ్యతను పెంచడం, రైతులను దళారుల నుండి కాపాడటం మొదలైన కార్యక్రమాలు మాత్రం కంపెనీలు చేపడితే బాగుంటుంది. సేవా కార్యక్రమాలపై కొన్ని కంపెనీలు తగు స్థాయిలో నిధులను ఖర్చుచేయలేకపోయినా, మరికొన్ని నిర్ధారించిన దానికంటే ఎక్కువే ఖర్చు చేశాయి. తక్కువ ఖర్చు చేసిన కంపెనీలు అందుకు కారణాలు తెలుపవలసి వుంటుంది. మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలోనూ ప్రాంతీయ అసమానతలు వున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కంపెనీలు అధిక నిధులను సేవా కార్యక్రమాలపై ఖర్చు చేయవచ్చు. అంతగా లాభాలు లేని కంపెనీలకు ఇది భారంగా వుండవచ్చు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఎక్కువగా విద్యారంగంపై ఖర్చు చేస్తున్నాయి. సుమారు 81 శాతం కంపెనీలు ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాయి. 64 శాతం కంపెనీలు సమాజ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. 61 శాతం కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు వ్యాపారాభివృద్ధిరి దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చు. సొంత ప్రయోజనాల కోసం కాకుండా సీఎస్‌ఆర్ కింద సమాజసేవకు మాత్రమే నిధులను వెచ్చించాలి. సేవా కార్యక్రమాలను నిజాయితీతో చేపట్టే సంస్థలను ఇతర కంపెనీలు స్ఫూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. మన దేశంలో వ్యవసాయ రంగం లాభసాటిగా లేకపోయినా ఆ రంగంపైనే 55 శాతం శ్రామిక శక్తి ఆధారపడి వుంది. గ్రామీణ పేదరికానకి ఇదే ముఖ్య కారణం. కొంత శ్రామిక శక్తిని వ్యవసాయేతర రంగాలకు తరలించవలసిన బాధ్యతను కంపెనీలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయం పెరిగితే కార్పొరేట్ సంస్థలు కూడా లాభం పొందుతాయి.

-ఇమ్మానేని సత్యసుందరం