సబ్ ఫీచర్

డిజిటల్ యుగంలో ‘మోత’లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ యుగం, కాగిత రహిత పాలన.. అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. అయితే, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సాంకేతికత విస్తరించిన నేటి ఆధునిక కాలంలోనూ బడికి వెళ్ళాలంటే పిల్లలు బండెడు పుస్తకాలు మోయాల్సిందేనా? పుస్తకాల మో తకు మోక్షం లేదా? ఈ విషయంలో పాలకులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఆలోచించడం మానేశారా? విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఈ పద్ధతికి స్వస్తి పలకరా? ఇపుడు ఇవి విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలు. పాఠశాలల్లో బోధనా పద్ధతులు ఎలా ఉన్నా విద్యార్థులకు పుస్తకాల మోత బరువు తగ్గించాలన్నదే ప్రధాన లక్ష్యం కావాలి. పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో పిల్లలకు ఉపశమనం కల్గించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏటేటా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాల బరువు మోయలేక సతమతం అవుతున్నారు. ఏ కార్పొరేట్ పాఠశాల వద్ద చూసినా భారమైన పుస్తకాల బ్యాగులను వీపుపై వేసుకొని విద్యార్థులు పరుగులు పెడుతుంటారు. రద్దీ రహదారుల్లో బరువైన సంచులతో వీరు నానా యాతన పడుతున్నారు.
గత ఏడాది హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో లిఫ్టులో ఇరుక్కుని విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆనాటినుంచి ప్రైవేట్ యాజమాన్యాలు లిఫ్టుల్లోకి పిల్లల్ని అనుమతించటం లేదు. ఇపుడు బరువైన సంచులతో ఎన్ని అంతస్తులైనా విద్యార్థులు మెట్లదారిపై ఎక్కవల్సి వస్తోంది. నగరాలలోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం రెండునుంచి ఆరు అంతస్తుల భవనాల్లో ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. గతిలేక బండెడు పుస్తకాల మోతతో విద్యార్థులు అంతస్తులు ఎక్కుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు 3.7 కిలోలు, స్టేట్ సిలబస్‌కు 5.6 కిలోలు, సిబిఎస్‌ఇ విద్యార్థుల బ్యాగ్ 5.5 కిలోలు, సిబిఎస్‌ఇ కాని విద్యార్థుల బ్యాగ్‌లు 2.2 నుండి 5.5 కిలోలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ క్లాసులు, డిజిటల్ విద్యకు ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల స్థాయిలో అయితే పేపర్, పెన్ను లేకుండానే అన్నిపరీక్షలు ‘ఆన్‌లైన్’లో జరుగుతున్నాయి. కంప్యూటర్లు, ట్యాబ్‌ల వినియోగంపై దృష్టిసారించాలి. పాఠశాలల్లో ట్యాబ్‌ల ద్వారానే విద్యార్థులతో ‘హోం వర్క్’ చేయించాలి. తరగతి గదుల్లోనే విద్యార్థులకు అవసరమైన డెస్క్‌లు, లాకర్లు ఏర్పాటుచేసి ఇంటినుంచి పుస్తకాల మోతను తప్పించాలి.
బడికి రోజూ పుస్తకాలు లేకుండా రావాలని యాజమాన్యాలు ఆదేశాలు ఇచ్చి వాటిని కచ్చితంగా అమలుచేయాలి. అవసరమైన పుస్తకాలనే ఇంటికి తీసుకొని వెళ్ళేటట్లు మార్గదర్శనం చేయాలి. ప్రతిరోజూ ఉపయోగించని నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను ఇంటివద్దనే వదలి వేయాలి. కొన్ని పుస్తకాలు తరగతి గదిలోనే వదిలి వెళ్లేందుకు డెస్క్‌లు, లాకర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి విద్యార్థికి ట్యాబ్‌లు, కంప్యూటర్ల వినియోగం మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. తేలికపాటి చిన్న సంచులనే విద్యార్థులకు తల్లిదండ్రులు కొని ఇవ్వాలి. స్కూల్ బ్యాగ్‌ల భారం వల్ల చిన్నారులకు నడుమునొప్పి, వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. నిటారుగా నడువలేక వంగి వంగి నడవటానికి పిల్లలు అలవాటు పడుతున్నారు. ఎనిమిది శాతం మంది విద్యార్థులు వెనె్నముక సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి విద్యార్థి తన శరీర బరువులో 10 శాతం లోపు వరకు స్కూల్ బ్యాగ్ బరువు మోసుకోవచ్చునని వైద్యులు వెల్లడిస్తున్నారు. నేటి విద్యార్థులే భావిభారత పౌరులు. వారిని ఆరోగ్యంగా పెంచుకోవాలి. బ్యాగ్‌లు బంద్‌చేసి డిజిటల్ యుగానికి వారిని వారసులుగా తీర్చిదిద్దాలి.

-రావుల రాజేశం