సబ్ ఫీచర్

ఇష్టపడ్డారు..సాధించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది చెన్నైలోని భారత సైనిక అధికారులకు శిక్ష ణ

ఇచ్చే అకాడమీ. కొత్త బ్యాచ్‌కి శిక్షణ మొదలైంది.

శిక్షణ తీసుకుంటున్న సైనికులలో ఇరువురు

మహిళా సైనిక అధికారులు ప్రత్యేకంగా

కనిపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పది నెలల

శిక్షణ కోసం వచ్చారు. ఇద్దరూ తల్లులే. పిల్లల్ని

వదలి కఠినమైన సైనిక శిక్షణకు సిద్ధమైన ఆ ధీర

వనితల్లో మరణమైనా..జీవితమైనా ఆర్మీకే జీవితం

అంకితం అనే అకుంఠిత దీక్ష కనిపిస్తోంది. దేశసేవలో

నిమగ్నమైన భర్తలను ముష్కర మూకలు

పొట్టనబెట్టున్నారు. విధి వక్రించి చిన్నవయసులోనే

ప్రాప్తించిన వైధవ్యానికి కుంగిపోకుండా తమ

తలరాతను మార్చుకునేందుకు తెగువ చూపారు.

ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కన్నీటి గాథ.
ఏడేళ్ల నుంచి పోరాటం
ఏడేళ్ల నుంచి ఎలాంటి జీవితాన్ని ఎంపిక

చేసుకోవాలో తెలియక సతమతమవుతున్న తనకు

ఈనాటికీ సరైన పంథాను ఎంచుకోగలిగానని

నిధిదుబే అంటున్నారు. నిధిదుబేకు సైన్యంలో

పనచేసే నాయక్ ముఖేష్ దుబేతో వివాహమైంది.

పెళ్లయిన ఏడాదికే 2009లో జరిగిన కాల్పుల్లో ఆ

సైనికుడు వీరమరణం పొందాడు. నాలుగైదు నెలలు

మాత్రమే భర్తతో కాపురం చేసింది. నిండు గర్భిణిగా

ఉన్న సమయంలోనే భర్త దూరమవ్వటంతో

పుట్టింటిచేరి మగబిడ్డను కన్నది. రెండు పదుల

వయసులోనే ప్రాప్తించిన వైధవ్యానికి చింతించకుండా

ఎంబీఎ పూర్తిచేసింది. భర్త పనిచేసినట్లుగానే

సైన్యంలో పనిచేయాలనే లక్ష్యంతో సైనిక

అధికారిణిగా ఎంపికయ్యేందుకు కఠోర శ్రమే పడింది.

ఉదయమే ఐదు గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల

దూరం పరుగెత్తేది. ఎక్కువ సమ యం జిమ్‌లోనే

గడిపేది. సాయంత్రం స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేది. ఇలా

కుమారుడివయసు ఏడేళ్లు వచ్చేసరికి కష్టపడి

శారీరక దృఢత్వాన్ని సంపాదించింది. ఓ రోజు న్యూస్

పేపర్‌లో పడిన ప్రకటన ఆమెకు ఎంతో ఉత్సాహాన్ని

ఇచ్చింది. చనిపోయిన సైనికులు భార్యలు తాము

భర్త అడుగుజాడల్లో నడుస్తూ సైనికులుగా

చేరవచ్చని వచ్చిన ప్రకటన ఎంతో ఉత్తేజాన్ని

ఇచ్చింది. కాని సైనికురాలిగా చేరటం అంతా ఈజీ

కాలేదు. నాలుగుసార్లు రాత పరీక్షలో ఫెయిలైంది.

ఐదవసారి పాసైంది. కాని ఇక్కడ కూడా ఆమెను ఓ

సమస్య వెంటాడింది. మరణించిన సైనికుల

భార్యలకు ఇచ్చే ఖాళీ ఒకటి మాత్రమే ఉంది. పోటీ

ఇద్దరు పోటీపడుతున్నారు. చివరకు

హెడ్‌క్వార్టర్స్‌లోని ఉన్నతాధికారులకు అర్జీ

పెట్టుకోవటంతో అదనంగా పోస్ట్‌ను మంజూరు చేసి

ఆమెను సైనిక అధికారిణిగా తీసుకున్నారు.
భర్త అడుగుజాడల్లో..
గత నవంబర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో

చనిపోయిన కల్నల్ సంతోష్ మాహదిక్ భార్య స్వాతి

సైనికి అధికారిణిగా గ్రీన్ యూనిఫారమ్‌ను

ధరించటాన్ని గర్వంగా ఫీలవుతున్నారు. భర్త

శవపేటిక స్వగ్రామమైన కుప్వారాకు వచ్చిన

తరువాత అంత దుఃఖంలోనూ ఆమె

అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. భర్త

అడుగుజాడల్లోనే నడుస్తూ సైనికురాలిగా చేరతానని

ప్రకటించింది. క్రమశిక్షణాయుతమైన జీవితం అంటే

తన భర్తకు ఎంతో ఇష్టమని, అలాంటి జీవితాన్ని

గడపాలనే భర్త ఆశయం మేరకు ఈ వృత్తిలో

చేరానని స్వాతి చెబుతున్నారు. స్వాతికి 11

సంవత్సరాల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.

వారిద్దిరిని బోర్డింగ్ స్కూల్లో చేర్పించి సైనిక శిక్షణలో

చేరింది. చనిపోయిన భర్తను ఎలాగూ తిరిగి

పొందలేను. కనీసం ఆయన బాటలో నడుస్తూ..

ఆశయాన్ని ముం దుకు తీసుకువెళ్లాలనే

కృతనిశ్చయం ఆమెలో కనిపిస్తోంది.