సబ్ ఫీచర్

పర్యావరణానికి హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన చుట్టూ ఉన్న జీవరాశుల్లోనే ఇటీవలి కాలంలో ఎన్నో కనిపించకుండా పోతున్నాయి. కొన్ని పూర్తిగా అంతరించిపోతున్నాయి. మనిషి దెబ్బకు చాలా జీవులు మనుగడ సాగించలేకపోతున్నాయి. భూ మిపై జీవ వైవిధ్యానికి ఆలవాలమైన ఎన్నో ప్రాంతాలు మానవ చొరబాట్ల కారణంగా నాశనమవుతున్నాయి. ఇప్పుడు ఊళ్లలో పిచ్చుకలు కనిపించడం లేదు. నగరాల్లో కాకుల అరుపులు వినిపించడం లేదు. మనం చిన్నప్పుడు చూసిన ఎన్నో మొక్కలు ఇప్పుడు లేవు. రాబందులు లేవు, రాచనాగులు లేవు. ఎటుచూసినా మనుషులే. మానవ ప్రభావంతో భూమిపై మిగతా జీవరాశి తీవ్రంగా దెబ్బతింటోందని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు సహా భూమిమీద జీవ వైవిధ్యానికి ఒకప్పుడు నిలయాలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నాయని శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. నాలుగింట మూడు వంతుల భూభాగంపై మనుషుల ప్రత్యక్ష ప్రభావం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. 71 శాతం రక్షిత పర్యావరణ ప్రాంతాలపై మనిషి ఆధిపత్యం పెరిగింది. పర్యావరణంలో జీవ సమతూకం దెబ్బతింటే కలిగే ప్రమాదాన్ని గుర్తించకుండా భూగోళంపై మనిషే సర్వాంతర్యామిగా మారుతూ మిగతా జీవజాలం మనుగడకు ముప్పు తెస్తున్నాడు. జనాభా పెరుగుదల, అడవులను నరికివేయడం, గనుల తవ్వకాలు, రహదారులు, రైలుమార్గాల విస్తరణ, పలురకాల ప్రాజెక్టులు, పొలాల్లో అతిగా ఎరువుల వాడకం, భూతాపం, కాలుష్యం, ప్రకృతి విపత్తులు, జీవ వైవిధ్య వినాశనానికి కారణాలవుతున్నాయి. జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మల్లాంటి ప్రాంతాలు 97 శాతం ఇప్పుడు ఆ ఘనతను కోల్పోతున్నాయి. సముద్ర జలాల్లో జీవజాలం 40 శాతం మేరకు తగ్గింది. మంచినీటిలో నివసించే పలురకాల జీవులు 70 శాతం కనుమరుగయ్యాయి. 1950 తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ 7 రెట్లు పెరిగింది. ఇంధన వినియోగం 5 రెట్లు అధికమైంది. ఎరువుల వాడకం ఎనిమిదింతలైంది. సముద్రాల్లో చేరుతున్న నైట్రోజన్ పరిమాణం నాలుగింతలైంది. సహజ వనరులను కొల్లగొట్టడం పెరిగింది. కాలుష్యం అధికమైంది. ఇవి భూమిపై, సముద్రాల్లో జీవరాశుల మనుగడకు ముప్పుతెస్తున్నాయి. కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను దెబ్బతీస్తోంది. మొక్కల్లో పరాగ సంపర్కంపైనా ఆ ప్రభావం పడుతుండడంతో వృక్షజాల సహజ వృద్ధిరేటు తగ్గుతోంది. సముద్రంలో వేట కారణంగానూ అక్కడి జీవవైవిధ్యానికి పొగబెడుతున్నాం.
అమెజాన్ అడవులు, ఇండోనేషియా అడవుల నరికివేత తీవ్రస్థాయిలో ఉంది. గత యాభైయ్యేళ్ళల్లో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు సగానికి సగం తరిగిపోయాయి. అల్పాదాయ, వర్ధమాన దేశాల్లో ఈ తగ్గుదల రేటు మరీ ఆందోళనకరంగా ఉంది. కనీసం 1,500 విశిష్ట మొక్క జాతులున్న జీవవైవిధ్య కీలక ప్రాంతాల్లో పరిశీలన చేయగా అక్కడి సహజ వృక్షసమూహాల్లో 70 శాతం తరిగిపోయినట్లు గుర్తించారు. కనీసం 500 రకాల సకశేరుకాలున్న ప్రాంతాల్లో 14 రకాలు అంతరించిపోయే ముప్పు ముంగిట ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. జీవవైవిధ్యం బాగాఉన్న ప్రాంతాల్లో కేవలం 3 శాతం ప్రదేశం మాత్రమే మానవ తాకిడికి దూరంగా ఉంది. అంటార్కిటికా, కెనడాలోని బొరియల్ అరణ్యాలు, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని దట్టమైన అడవులు, కాంగోలోని అరణ్యాలు, సహారా, గోబీ, ఆస్ట్రేలియాలోని కొన్ని ఎడారులు మనిషి ప్రభావం లేని ప్రాంతాలుగా ఉన్నాయి. పర్యావరణం దెబ్బతింటున్నందున మానవ మనుగడకు సైతం ప్రమాదం ఏర్పడుతోంది.

-గుండు రమణయ్య