సబ్ ఫీచర్

ఆంక్షలు వద్దు.. ఆకాంక్షలు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాము చెప్పినట్టే వినితీరాలని తల్లిదండ్రులు ఆంక్షలు విధించకుండా, చిన్నారుల ఆకాంక్షలు నెరవేరేలా స్వేచ్ఛను ఇవ్వాలని పూణెకు చెందిన పదేళ్ల ఐశ్విత కాత్యాల్ అంతర్జాతీయ వేదికపై తన మనోభావాలను వెల్లడించి అందర్నీ అబ్బురపరచింది. కెనడాలోని వాంకోవర్ నగరంలో తాజాగా జరిగిన ‘టెడ్-2016’ (టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ సమ్మేళనం)లో ఆమె తన అద్భుత వాగ్ధాటితో ఆహూతులను విస్మయపరచింది. ఐటి సంస్థలకు చెందిన ప్రముఖులు, పలువురు మేధావులు హాజరైన ‘టెడ్-2016’లో ఆ బాలిక- ‘చిన్నారుల ఆశల్ని గుర్తించడి.. వారికో అవకాశం ఇవ్వండి’ అంటూ ఓ నినాదం ఇచ్చింది. పిల్లలు ఏ దారిలో వెళుతున్నారో అని తెలుసుకోవాలనే ముందు వారి ఆకాంక్షలేమిటో ముందుగా గుర్తించాలని ఐశ్విత విజ్ఞప్తి చేసింది. ‘ఎలాంటి అద్భుతాలనైనా సాధించేందుకు పిల్లలు సిద్ధమే.. అయితే, చిన్నారుల కలలు సాకారం కాకుండా అడ్డుకునేందుకు కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ ప్రయత్నించడం సరికాదు..’ అని ఆమె తన అంతరంగాన్ని నిర్మొహమాటంగా ఆవిష్కరించింది. చిన్నారుల మేధస్సును తక్కువగా అంచనా వేయరాదని, భయాలకు దూరంగా వారిని పెంచితే అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని ఐశ్విత బలంగా వాదించి అసంఖ్యాక శ్రోతలను ఉర్రూతలూగించింది. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, యుద్ధోన్మాదం వంటి పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో పిల్లలు నానాపాట్లు పడుతున్నారని ఆమె వివరించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుతూ చిన్నారులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకే పెద్దలే మార్గదర్శకం కావాలిని ఆమె విజ్ఞప్తి చేసింది. వివిధ దేశాలకు చెందిన చిన్నారులు, మేధావులు, సంగీత దర్శకులు పాల్గొన్న సమావేశంలో అనర్ఘళంగా మాట్లాడిన ఐశ్వితతో ‘సెల్ఫీ’లు తీసుకునేందుకు ప్రముఖులు సైతం పోటీపడ్డారు. పిన్నవయసులోనే ‘సిమ్రాన్స్ డైరీ’ పేరిట ఓ పుస్తకాన్ని రచించిన ఐశ్విత కొద్దిరోజుల క్రితం భారత్‌లో జరిగిన ఓ సదస్సులోనూ తన ప్రసంగంతో అందర్నీ కట్టిపడేసింది. దీంతో ఆమెను వాంకోవర్‌లో ‘టెడ్-2016’ సదస్సుకు ఎంపిక చేశారు. తమ కుమార్తె చిన్నప్పటి నుంచి భిన్నంగా ఆలోచిస్తూ సృజనాత్మకను చాటుకునేదని ఐశ్విత తల్లి నాన్సీ కాత్యాల్ గుర్తుచేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో తన కుమార్తె ఇంతగా రాణిస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆమె తెలిపారు. వాంకోవర్‌లో జరిగిన ‘టెడ్-2016’ సదస్సులో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ వీనుల విందైన స్వరాలను అందించడంతో పాటు ఐశ్విత ప్రతిభను కొనియాడారు.
*