సబ్ ఫీచర్

సెక్యులరిజం అంటే ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుడ్డ కాల్చి నెత్తిన వేద్దాం.. ఓపిక ఉంటే తుడుచుకొంటాడు.. లేకపోతే మసిపూసుకొని తిరుగుతాడు.. మనకేంటి నష్టం..?’- అనే ధోరణి నేటి రాజకీయ నాయకులలో బాగా పెరిగిపోతున్నది. దాదాపు అందరు నేతలూ తాము సెక్యులరిస్టులమని చెప్పుకొంటారు. తమ ప్రత్యర్థులపై మాత్రం ‘మతం ముద్ర’ వేయడానికి ప్రయత్నిస్తారు. మైనారిటీల ఓట్ల కోసం సెక్యులరిస్టుల ముసుగులో వీరు వేస్తున్న వేషాలవల్లనే దేశంలో మతసామరస్యం దెబ్బతింటున్నది. మత సామరస్యంతో మాకు పనిలేదు, ఎన్నికలలో మైనారిటీల ఓట్లు దండుకోవడమే లక్ష్యం అని భావించే కొన్ని రాజకీయ పార్టీలు నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాయి. మనది లౌకిక రాజ్యం. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఈ మతం, ఆ కులం అని భేదం లేకుండా ప్రజలు తమకు నచ్చిన విధంగా (ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా) ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు కేవలం మైనారిటీల ఓట్లకోసం హిందువులపై లేనిపోని ఆంక్షలు విధిస్తూ వారు తమ ఇష్టదైవాన్ని పూజించుకొనే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బమ్ జిల్లాలోని కంగ్లాపహారి గ్రామస్తులను చెప్పుకోవచ్చు. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో అమ్మవారి మండపం ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడం వలన ఈ గ్రామస్థులు గత మూడు సంవత్సరాలుగా దేవీ నవరాత్రోత్సవాలు నిర్వహించుకోలేకపోతున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తనకు తాను ‘అపరకాళిక’గా అభివర్ణించుకొంటారు. తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిపినట్లుగా, పశ్చిమ బెంగాల్‌లో దసరా సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుపుకొంటారు. బెంగాల్‌లోని హిందువులకు కాళికాదేవి ఆరాధ్యదైవం. దేశంలో తాను పెద్ద సెక్యులరిస్టునని మమతా బెనర్జీ తరచూ చెప్పుకొంటారు. ఆమె కూడా ఓట్ల రాజకీయాలకు తలొగ్గుతారనడానికి కంగ్లాపహారి గ్రామమే ప్రత్యక్ష ఉదాహరణ. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా కంగ్లాపహారిలో అమ్మవారి మండపం ఏర్పాటుచేసుకొని, పూజలు నిర్వహించడానికి మూడు సంవత్సరాలుగా అధికారులు అనుమతి ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోంది. గ్రామంలోని ముస్లింలు అమ్మవారి మండపం ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకించడమే ఇందుకు కారణం. దీంతో గ్రామంలోని మహిళలు, పిల్లలు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి వేరే చోట అమ్మవారికి పూజలు చేసుకోవాల్సి వస్తున్నది.
కంగ్లాపహారి గ్రామంలో ఉన్న ముస్లిం కుటుంబాలు కేవలం 25 మాత్రమే. హిందూ కుటుంబాలు 300లు ఉన్నాయి. గ్రామస్థులు అమ్మవారి మండపం ఏర్పాటు చేసుకొని దేవీ నవరాత్రోత్సవాలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ స్థానిక అధికారుల నుంచి, కలెక్టర్, ఎస్పీల వరకు మూడేళ్లుగా దరఖాస్తులు చేసుకొంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ద్వారా అనుమతి పొంది తమ గ్రామంలో దేవీ నవరాత్రోత్సవాలను నిర్వహించుకోవడానికి కంగ్లా పహారీ గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. కాగా, దేవీ నవరాత్రోత్సవాలు సందర్భంగా అమ్మవారి మండపాలు కొత్త ప్రాంతాలలో ఏర్పాటుచేయడానికి అనుమతి ఇవ్వరాదని బీర్బమ్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇంత జరుగుతున్నప్పటికీ అధికార తృణమూల్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇటువంటి పరిస్థితులనే దేశంలోని పలు ప్రాంతాలలో హిందువులు ఎదుర్కొంటున్నారు. మరి ఇదేమి సెక్యులరిజమో ఘనత వహించిన నేతలే తెలపాలి.

-పి.మస్తాన్‌రావు