సబ్ ఫీచర్

నిజం- నిష్ఠురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔనన్నా కాదన్నా నిజమెప్పుడూ నిష్ఠురమే
రాజ్యపాలన కత్తిమీద సామే
సామదానాలూ, శాంతి వచనాలూ- సైతానుల ముందు పనిచేయవు

క్రూరత్వం కూకటివేళ్ళతో కూలిపోవాలంటే
వీరత్వం ప్రళయ భయంకరంగా విజృంభించాలి
ఖలులకూ, కంటకులకూ మర్దనమే గుణవర్థనం
శఠునికి శాఠ్యమే సరియైన మందు

చాణుక్యుని రాజ్యతంత్రమే సార్వకాలిక మంత్రం
మాయల మారీచ రాక్షసులు బంగారు లేడి రూపంలోనే వస్తారు
వంచకులెప్పుడూ మంచితనానే్న ప్రదర్శిస్తారు
కలుపు మొక్కలు పచ్చదనాన్ని ప్రదర్శిస్తాయి
పచ్చని పైరు పంటలను నాశనం చేస్తాయి

చల్లని చంద్రుని జెండా చూపిస్తూనే
బల్లాలు గుండెల్లో గ్రుచ్చుతారు క్రూరులు
బయటి శత్రువులకంటే అంతశ్శత్రువులే ప్రమాదం
హిత శత్రువులు అంతకంటే ప్రమాదం
ప్రజాదరాన్ని పొందలేనివారు ప్రజలమీదా కక్ష కడతారు
అసమర్థతకు అహంకారం తోడైతే
అసూయాద్వేషాలుగా రూపాంతరం చెందుతాయి
అసూయతో రగిలేవాడు పగను పెంచుకుంటాడు
ప్రత్యర్థిమీది ద్వేషంతో ప్రజాద్రోహానికి వెరవడు
స్వార్థం పెచ్చుమీరి దేశద్రోహులతో కలుస్తాడు
శత్రువులకు స్వాగతం పలుకుతాడు

ఆ విధంగానే అంభిరాజు అలెగ్జాండరును ఆహ్వానించాడు
జయచంద్రుడు గోరీ మహమ్మదుకు సహకరించాడు
మీర్జ్ఫార్ సిరాజుద్దౌలాను నిలువునా ముంచాడు
బ్రిటీష్ వారికి విజయాన్ని పంచాడు

ఒక బ్రాహ్మణుని స్వార్థం- ఒక ముస్లిం సున్నీ ఫకీరు అసూయ
ఔరంగజేబుకు గోలకొండను సాధించి పెట్టింది
ముసునూరి సోదరులమీద అసూయతో
రాచకొండ రాజులు సుల్తాను ఖులీకి గోలకొండను
బంగారు పళ్ళెంలో పెట్టి అందించారు
అది చరిత్ర - గతం- ఇది వర్తమానం
అయినా గుణాలు మారలేదు, గణాలు తగ్గలేదు
అసూయాపరులు దేశద్రోహ నినాదాలు చేస్తూనే ఉన్నారు

అందుకే మరి సోదరా!
ఆదర్శాల పగటి కలలు మాని
వాస్తవికతను గుర్తించు
నిష్ఠుర నిజంతో ప్రవర్తించు
ప్రచ్ఛన్న శత్రువులనుండి దేశాన్ని రక్షించు

-ఉమాపతి బి.శర్మ