సబ్ ఫీచర్

చలి కాలంలో చర్మం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతివారికీ ముఖారవిందం బాగుంటే సరిపోదు. శరీరంలోని అన్ని భాగాలూ, అవయవాలు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. ఆ విధంగా అందంగా, ఆకర్షణీయంగా తయారవాలంటే ప్రకృతి సహజమైన సౌందర్య సాధనాలు ఉపయోగించుకుంటూ అందానికి మెరుగులు దిద్దుకోవాలి.
పావుచెంచా జాజికాయ ముద్ద, చందనం పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా కర్పూరం పొడి కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు పూర్తిగా నయమవుతాయి.
తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకుంటే మేనిసొగసు మెరుగవుతుంది.
శెనగపప్పు రాత్రంతా నానబెట్టి, ఉదయం పూట మెత్తగా రుబ్బి దానికి కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం రంగు మారుతుంది. క్రమం తప్పకుండా అలా చేయడంవల్ల రంగు పెరుగుతారు.
కాకరకాయలను మెత్తగా రుబ్బి, శెనగపిండితో కలిపి ముఖానికి రాసుకుంటే చక్కని ప్రయోజనం ఉంటుంది.
ముందురోజు రాత్రి పసుపు కొమ్ములను దంచి పాలలో నానబెట్టాలి. ఉదయాన అందులో ఆవనూనె, మైదాపిండి చెరో చెంచా చొప్పున కలిపి రుబ్బాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే శరీరంపైన కనిపించే వెంట్రుకల సమస్య తొలగిపోతుంది. అంతేకాక చర్మం ఎంతో కోమలంగా తయారవుతుంది.
ఎండిపోయిన బ్రెడ్ ముక్కను పాలలో ఒక రాత్రంతా నానబెట్టి, ఆ ముద్దకు ఉదయానే్న తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కొంచెం సేపు అలా ఉంచి ఎండిపోయిన తరువాత కడిగేసుకుంటే చర్మం చక్కగా తయారై ముఖంలోని శుష్కత తగ్గిపోతుంది.
తేనెలో పాలు, సున్నిపిండి కలిపి లేపనంగా చేసుకుని శరీరమంతా రాసుకుని ఆరిన తరువాత స్నానం చేస్తే చర్మం ఎంతో మృదువుగా, మెత్తగా తయారవుతుంది.
పచ్చి బంగాళా దుంప ముక్కలను ముఖంపైన ఒక 15 నిమిషాలపాటు రుద్దుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది. ముల్తానీమట్టికి బంగాళాదుంపల రసాన్ని చేర్చి ముఖానికి రాసుకుంటే ముఖం మరింత అందంగా అవుతుంది.
క్యారెట్, టోమాటోల రసం చలికాలంలోనూ, కీరా దోసకాయ, టమాటోల రసం వేసవిలోనూ కళ్ళకింద రాసుకుంటే చర్మం శుభ్రపడుతుంది.
వయసు పెరిగినవారు పండిన అరటి పండును ముఖానికి రుద్దుకుంటే చర్మంలో కనిపించే ముడతలు పోయి వయసు తగ్గినట్లుగా కనిపిస్తారు.
వెనిగర్‌ను దూదిమీద చిలకరించి పెదవులకు రాసుకుంటే నల్లదనం పోయి మృదువుగా అవుతాయి.
ఉడికించిన బంగాళా దుంపలతో గోళ్ళపై రుద్దుకుంటే గోళ్ళు మెరుస్తాయి. బొప్పా యి పండు ముద్దకు పసుపు కలిపి కాళ్ళకు రాసుకుంటే కాళ్ళు, పాదాలకు అందంగా, మృదువుగా అవుతాయి.

- మనస్విని