Others

మానసిక ఆరోగ్యమే అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయ్యాక శిల్పాశెట్టి వెండితెరకు దూరమైంది. విభిన్న కోణాల్లో కనిపించే ఈ బాలీవుడ్ భామ ఎంచుకున్న రంగంలో తనదైన ముద్ర వేసుకుంటుంది. ఆమెలో నటి, రచయిత్రి, రియాల్టీ షో న్యాయ నిర్ణేత, వ్యాపారవేత్త, యోగాబ్యాసకురాలు, ఇంటిని చక్కదిద్దుకునే గృహిణి..ఇలా విభిన్న కోణాలు దాగి ఉన్నాయి. ఓ బిడ్డకు తల్లయినా.. ఇంటా బయటా పని ఒత్తిడికి గురికాకుండా ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ క్రమం తప్పకుండా వేసే యోగాసనాలే తనను నేటికీ నాజూకుగా ఉంచుతున్నాయని నాలుగు పదులు దాటిన ఈ పొడుగు కాళ్ల సుందరి చెబుతుంది. అవేమిటో తెలుసుకుందాం.
నా జీవిత అనుభవంతో చెబుతున్నా. ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోండి. ఏదో బతకటానికి తిన్నం అనే భావన వద్దు. మానసికంగా బలంగా ఉంటే ఎవరైనా అందంగా కనిపిస్తారని ఈ అందాల సుందరి తెలియజేస్తోంది.
తల్లులకు సూచన : తల్లయిన తరువాత ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెరగాలి. ఇళ్లల్లో ఎక్కువ సమయాన్ని రుచికరమైన వంటలు చేయటానికే తల్లులు కేటాయించండి. దీనివల్ల ఇంటిల్లిపాదీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పిల్లల కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి. నా కొడుకు వియాన్‌కు చిన్న వయసు నుంచే ఏది మంచి ఆహారమో, కాదో చెప్పటం వల్ల జంక్ ఫుడ్ పట్ల చిన్నప్పటి నుంచే విముఖత పెంచుకున్నాడు. కూల్‌డ్రింక్స్ అసలు తాగనే తాగడు. నిర్ణీత సమయంలో నిద్రిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.
సమర్థవంతమైన గృహ నిర్వాహకురాలు: శిల్పాశెట్టి సమర్థవంతమైన గృహ నిర్వాహకురాలు కూడా. ఆమె భర్త పూర్తి వెజిటేరియన్. ఆమె చేప మాత్రమే తీసుకునే శాకాహారి. ప్రతిరోజూ భర్త, కొడుకు ఏం తింటారో తెలుసుకుని మెనూ తయారుచేస్తోంది. వాళ్లకి ఎలాంటి ఆహారం కావాలో తెలుసుకుని వండి పెట్టడం వల్ల బయటకు వెళ్లినా ఎలాంటి ఒత్తిడికి గురికాను. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. అర్థరాత్రి వరకు జరిగే పార్టీలకు హాజరయ్యే అమ్మను కాను. కొడుకును కూడా సమయానికి స్కూలుకు పంపుతాను. రోజులో ఎక్కువ సమయాన్ని ఇంటికి, పనికి ఎలా కేటాయించాలో చక్కటి ప్రణాళిక వేసుకుంటాను.
కొత్తపుస్తకం : రచయిత్రి అయిన శిల్పాశెట్టీ ఆరోగ్యానికి ఉపకరించే వంటల వివరాలతో పుస్తకాలు రాసేస్తోంది. కొత్తగా విడుదలైన పుస్తకంలో ఆమెకు ఎంతో ఇష్టమైన మంగళూరియన్ వంటకంతో పాటు, ఎర్ర గుమ్మడి కాయతో చేసే తోటే కర్రీ కూడా ఇందులో ఉంది.
యోగా నేర్పించాలని ఉబలాటం : అందరికీ యోగా నేర్పించాలని ఉబలాటపడుతోంది. సెలబ్రిటీని కాబట్టి బయటకు వచ్చి నేర్పించలేక పోతున్నందకు బాధేస్తుందని చెబుతూ.. ఇంట్లో ఎక్కువగా నడుస్తాను, మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండటం వల్ల చలాకీగా ఉంటానని చెబుతోంది. ఇవండీ మరి అందమైన శిల్పాశెట్టీ హెల్త్ సీక్రెట్స్.

యోగాపైనే తొలి ప్రేమ
నా తొలిప్రేమ యోగాపైనే. ఆమె భర్త రాజ్ కూడా ఆమె యోగాకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుందని ఫీల్ అవుతుంటాడట. యోగాసనాలు నేర్పేంచేందుకు వీడియోలు రూపొందించటం, పుస్తకాలు రాయటం వ్యాపకంగా పెట్టుకున్న శిల్పాశెట్టీ భర్తతో మాత్రం యోగాసనలు వేయించలేకపోతుంది. అతను మాత్రం జిమ్‌కు వెళ్లి కార్డియో ఎక్స్‌ర్‌సైజులు చేస్తాడు. గ్లామరస్ రంగంలో ఉండటం వల్ల నిత్యం ఒత్తిడికి గురవుతుంటానని, దీన్ని యోగాతోనే జయించగలుగుతున్నానని, విచార సంఘటనలు తలెత్తినపుడు కొన్ని మంత్రాలను
జపిస్తానని చెబుతుంది. ఆమె కొడుకు
ఇప్పటికే ప్రాణాయామం చేసేస్తున్నాడు.